హోస్టన్‌కు ఆపిల్ ఆర్థిక సాయం
హోస్టన్: వరుస హారికేన్లతో సతమతమౌతున్న హోస్టన్‌కు ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ ఆర్థిక సాయం ప్రకటించింది. బాధితులకు సహాయమే లక్ష్యంగా పలు సంస్థల సహకారంతో "హ్యాండ్ ఇన్ హ్యాండ్" పేరుతో విరాళాల సేకరణలో భాగంగా 5 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అంతేకాకండా తమ వినియోగదారులు ఎవరైనా యాప్ స్టోర్ లేదా, ఐట్యూన్స్ ద్వారా నేరుగా విరాళం ఇవ్వచ్చొని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. రెడ్ క్రాస్‌కు మరో 3మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చింది. ఆపిల్ ఉద్యోగులు, వినియోగదారుల ద్వారా మరో 2 మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు.
తొలుత "హ్యాండ్ ఇన్ హ్యాండ్" కార్యక్రమాన్ని ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం వెరిజోన్. మైఖేల్ & సుసాన్ డెల్ ఫౌండేషన్‌లు ప్రారంభించారు. ఇందుకోసం మైఖేల్ డెల్ 5 మిలియన్లు డాలర్ల విరాళాన్ని ఇచ్చాడు. ఇందుకోసం వెరిజోన్ సైతం 2.5 మిలియన్ డాలర్లు ఆర్థిక సహాయం అందిండంతోపాటు ప్రత్యేక కాల్ సెంటర్ నడుపుతోంది. విరాళాల సేకరణకు సెప్టెంబర్ 12 న ప్రముఖులతో టెలిథాన్ నిర్వహించాలని "హ్యాండ్ ఇన్ హ్యాండ్" నిర్వాహకులు ప్రణాళిక చేస్తున్నారు.
ఈ టెలీథాన్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఏబీసీ, సీబీఎస్, ఫాక్స్, ఎన్‌బీసీ, హెచ్‌బీవీ టీవీ నెట్‌వర్క్‌లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ఈ కార్యక్రమంలో బెయోన్స్, ఓప్రా, జోన్ స్టివార్ట్, స్టీవెన్ కోల్బర్ట్, డ్రేక్, జార్జ్ క్లూనీలు పాల్గొంటారు. అంతేకాకుండా మ్యూజిక్ స్టార్ జార్జ్ స్ట్రైట్ షోకూడా ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.