సాక్షి,ముంబై: మేలైన యాపిల్ పండ్లకు నెలవైన జమ్మూ-కాశ్మీర్‌లో ఇటీవల వరదలు ముంచెత్తాయి. పండ్ల తోటలన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకొనిపోయాయి. దాని ప్రభావం యాపిల్ పండ్ల వ్యాపార కేంద్రమైన వాషిపై తీవ్రంగా పడింది. అత్యధికంగా యాపిల్ పండ్లను ఇక్కడి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ) కాశ్మీర్ నుంచే దిగుమతి చేసుకొంటుంది.
వర్షాల కారణంగా అక్కడ నుంచి పండ్ల దిగుమతి పూర్తిగా నిలిచిపోయింది. సిమ్లా, హిమాచల్ ప్రదేశ్‌ల నుంచి వ్యాపారులు కొద్దిమేరకు యాపిల్ పండ్లను దిగుమతి చేసుకొంటున్నప్పటికీ వాటిని నిల్వచేస్తున్నారు. దీంతో యాపిల్ పండ్ల కృత్రిమ కొరత ఏర్పడుతుంది. యా పిల్ పండ్ల ధరలు భారీగా పెరగనున్నాయి. యా పిల్ పండ్ల ప్రియులకు ధరాభారం తప్పేట్లు లేదు.
కిన్నౌరాపై ప్రభావం
ప్రతి ఏడాది ఇదే సమయంలో జమ్మూ-కాశ్మీర్ నుం చి యాపిల్ పండ్లు సరఫరా అవుతుంటాయి. వరదల భీభత్సం కారణంగా సరఫరా తగ్గిపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌లో కూడా వాతావరణంలో మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఇక్కడ నుంచి కూడా యాపిల్ పండ్ల సరఫరా తగ్గిపోయే ప్రమాదం ఉంది. హిమాచల్ ప్రదేశ్ చౌపల్‌కు చెందిన రైతు వినోద్‌మెహతా మాట్లాడుతూ.. ఈ ప్రాంతం మంచుతో కప్పబడడంతో పండ్ల చెట్ల పూత కాయగా మారేందుకు చాలా సమయం పడుతుందన్నారు. పండ్ల సరఫరాలో జాప్యం జరుగుతోందని అంటున్నారు.
ఈ నెలలో నాలుగు ట్రక్కులు మాత్రమే
ఈ నెలలో కూడా ఈ మార్కెట్‌లోకి మొదటి విడుతగా పండ్లు వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తోం ది. ఇటీవల ఏపీఎంసీ మార్కెట్‌లోకి కేవలం నాలు గు ట్రక్కుల యాపిల్ పండ్లు మాత్రమే సరఫరా అయ్యాయి. గతంతో పోల్చితే ఇది చాలా తక్కువ. మామూలుగా 25 నుంచి 30 ట్రక్కుల యాపిళ్ పండ్లు నగరానికి సరఫరా అవుతుంటాయి. హోల్‌సేల్‌లో కిలో యాపిల్ పండ్ల ధరలు రూ.80 నుంచి 90 ఉండగా, రీటైల్ మార్కెట్‌లో వీటి ధరలు రూ.100 నుంచి 150 వరకు ధర పలుకుతోంది.
భవిష్యత్‌లో భారీ డిమాండ్
అంతర్జాతీయ పండ్ల దుకాణం యజమాని దీపల్ జైస్వాల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం యాపిళ్లు హిమా ల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ ప్రాంతం నుంచి సరఫరా అవుతున్నాయన్నారు. భవిష్యత్‌లో యాపిల్ పండ్ల కు భారీగా డిమాండ్ పెరిగే అవకాశం ఉండడంతో కొందరు వ్యాపారులు నిల్వ చేసుకొంటున్నారు.
యాపిల్‌ప్రియులకు వరద దెబ్బ
Published Sun, Sep 14 2014 10:26 PM | Last Updated on Mon, Aug 20 2018 3:07 PM
Advertisement