నల్లతంబి ఏర్పాటు చేసుకున్న విగ్రహం, (ఇన్‌సెట్‌లో) నల్లతంబి
చెన్నై : చెత్త బాటిళ్లు ఏరుకునే ఓ వ్యక్తి జీవితాశయం అతన్ని సెలబ్రిటీని చేసింది. తన ఆశయాన్ని సాధించటానికి కన్న వాళ్లను, కట్టుకున్న భార్యను, పిల్లల్ని వదలేసి, ఏకంగా 20 ఏళ్లు కష్టపడ్డాడు. ఎలాగైతేనేం సొంత స్థలంలో తన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న కలని నెరవేర్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని సేలం జిల్లా, అనైమేదు గ్రామానికి చెందిన నల్లతంబి అనే వ్యక్తి తాపీ పని చేసుకునేవాడు. కొన్ని గొడవల కారణంగా 20 ఏళ్ల క్రితం ఇంట్లోంచి బయటకు వచ్చేశాడు. ( ఆన్‌లైన్ క్లాసుల్లో పరిస్థితి ఇలానే ఉంటుందేమో? )
ఇంటిని వదిలి బయటకు వచ్చేసిన నాటి నుంచి దాదాపు 20 ఏళ్లలో తాపీ పని చేసి, వీధుల్లో చెత్త బాటిళ్లు ఏరుకుంటూ 10 లక్షల రూపాయలు సంపాదించాడు. ఆ డబ్బుతో రెండు స్థలాలను కొన్నాడు. ఓ స్థలంలో లక్ష రూపాయల ఖర్చుతో ఐదు అడుగుల ఎత్తుండే తన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దీని గురించి నల్లతంబి మాట్లాడుతూ.. ‘‘ నేను యవ్వనంలో ఉన్నప్పటినుంచి గొప్ప పేరు తెచ్చుకోవాలని అనుకునేవాడిని. అందుకే నాకంటూ ఓ విగ్రహం ఉండాలనుకున్నా. నేను నా కలను సాకారం చేసుకున్నా’’నని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment