చెన్నై: మరణించిన భార్య జ్ఞాపకార్థం ఓ వ్యాపారవేత్త ఆమె విగ్రహాన్ని చేయించి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆరు అడుగుల ఆ విగ్రహాన్ని ఆమె చనిపోయన నెల రోజుల తర్వాత ఆవిష్కరించాడు. వివరాలు.. మధురైకి చెందిన వ్యాపారవేత్త సేతురామన్ భార్య పిచ్చైమణియమ్మల్ నెలరోజుల క్రితం చనిపోయారు. ఆమె మీద ప్రేమతో సేతురామన్ విగ్రహాన్ని చేయించి ఇంట్లో పెట్టుకున్నారు. చివరి రోజుల్లో ఆమె జ్ఞాపకాలతో గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో విల్లాపురంలోని ప్రసన్న అనే శిల్పిని సంప్రదించారు. సేతురామన్ కోరిక మేరకు సదరు శిల్పి పట్టు చీర, నగలు ధరించి.. చిరునవ్వులు చిందిస్తూ కుర్చీలో కూర్చున్నట్లుగా పిచ్చైమణియమ్మాల్ విగ్రహాన్ని తయారు చేశారు. (చదవండి: శ్రీనివాస గుప్తా.. ఈయన సమ్‌థింగ్ స్పెషల్)
Tamil Nadu: Sethuraman, a businessman from Madurai unveiled a statue of his wife,Pitchaimaniammal,at his home after 30 days of her demise.
— ANI (@ANI) September 11, 2020
He says,"I lost my wife recently but when I look at this statue I can connect with her.Fibre,rubber & special colours were used to make it" pic.twitter.com/l5iykI8UCw
దీనిని పూర్తిగా ఫైబర్‌తో రూపొందించారు. సడెన్‌గా చూస్తే.. నిజంగా మనిషిని చూసినట్లే ఉండేలా రూపొందించారు. విగ్రహాన్ని ఇంటికి తీసుకెళ్లిన సేతురామన్ సంప్రదాయబద్ధంగా పూజలు చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భార్యను తలుచుకుని ఉద్వేగానికి గురయ్యారు సేతురామన్. గతంలో కర్ణాటకకు చెందిన ఓ వ్యాపారవేత్త కూడా ఇలానే భార్య విగ్రహాంతో గృహ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment