అదృష్టం అంటే ఆ అమ్మాయిదే..! | Teen Wins Lottery Jackpot Of Thousand Dollars A Week For Rest Of Her Life | Sakshi
Sakshi News home page

అదృష్టం అంటే ఆ అమ్మాయిదే..!

Apr 2 2018 3:24 PM | Updated on Aug 1 2018 2:29 PM

Teen Wins Lottery Jackpot Of Thousand Dollars A Week For Rest Of Her Life - Sakshi

చార్లీ లగార్డే

కెనడా : ఆ అమ్మాయిది మధ్యతరగతి కుటుంబం. అయినా బతకడానికి ఏ పని చేయక్కర్లేదు. ఆమె కుటుంబం కూడా ఇంట్లో కాలుమీద కాలు వేసుకుని కూర్చుని దర్జాగా జీవితాంతం అలా బతికేయెచ్చు. ఆమె ఇంట్లో వాళ్లు ఏ పని చేయకపోయినా వారానికి వెయ్యి డాలర్లు అప్పనంగా వాళ్ల అకౌంట్‌లో పడతాయి. ఏంటి ఎందుకు అనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళితే కెనడాకు చెందిన చార్లీ లగార్డే అనే యువతికి తన పుట్టిన రోజున లాటరీ తగిలింది.

లాటరీయేగా  ఏంటి గొప్ప అనుకుంటున్నారా..? అది మామూలు లాటరీ కాదు. అలాగని కోట్లు ఒకటే సారి వచ్చి పడవు. ఆమె బతికున్నంత కాలం వారానికి వెయ్యి డాలర్లు.. మన రూపాయల్లో అక్షరాల యాభై వేల రూపాయలు .. నెలకు మూడు లక్షల రూపాయలు చార్లీ అందుకోనుంది. కొద్ది రోజుల క్రితమే మొదటి వారానికి సంబంధించిన డబ్బును ఆమె అందుకుంది. ఈ సందర్భంగా చార్లీ మాట్లాడుతూ.. వచ్చిన డబ్బుతో ఫోటోగ్రఫీ నేర్చుకుంటానని తెలిపింది. ఇప్పుడు ఇలాంటి లాటరీ మనకు కూడా తగిలితే బాగుండనిపిస్తుంది కదూ...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement