పెద్ద నోట్లకు డాలర్లు
• నల్లధనాన్ని డాలర్లుగా మారుస్తున్న ముఠా
• వేలూరు నుంచి తీసుకొస్తున్న ఓ గ్యాంగ్
• 40 శాతం కమిషన్ తీసుకుంటున్న ఏజెంట్లు
చిత్తూరు (అర్బన్): నల్లధనాన్ని వెలికి తీయడానికి మోదీ ఓ మంత్రమేస్తే తామేమి తక్కువ తిన్నామా అంటూ కుబేరులు మరో మంత్రమేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దాచి పెట్టిన నల్ల ధనమంతా బయటకు వస్తుందనుకుంటున్న సమయంలో చిత్తూరు నగరంలోని కొందరు కుబేరులు ఉన్న ధనాన్ని డాలర్లతో మార్చుకోవడంలో బిజీగా ఉన్నారు.
నగర అభివృద్దికి, ఆర్థిక విలాసాలకు చాలా దూరంగా ఉన్న చిత్తూరు నగరంలో బడా కుబేరుల్ని సులువుగానే గుర్తించొచ్చు. ఆదాయపన్నుశాఖకు సక్రమంగా పన్నులు చెల్లించకుండా నల్లధనాన్ని ఓ స్థారుులో కూడబెట్టిన వ్యక్తులు నగరంలో 60 మంది వరకు ఉన్నారు. మోదీ ప్రకటనతో రూ.500, వెరుు్య నోట్లు బయటకు వస్తాయనకుంటే ఇక్కడి వ్యక్తులు కొత్త మార్గాన్ని అన్వేషించారు. భారీగా నిల్వ చేసిన పెద్ద నోట్లను డాలర్లగా మార్చుకుంటున్నారు. ఇందుకోసం వేలూరు, చెన్నై ప్రాంతాల్లోని మధ్యవర్తుల ద్వారా మన నగదును యూఎస్ డాలర్లుగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మన నగదు రూ.లక్ష ఇస్తే ఇందులో రూ.40 వేలు మినహారుుంచుకుని రూ.60 వేలను పరిగణలోకి తీసుకుంటున్న మధ్యవర్తులు ఆ మొత్తానికి డాలర్లను అందజేస్తున్నారు.
చిత్తూరులోని కొంగారెడ్డిపల్లె, మిట్టూరు, రామ్‌నగర్ కాలనీ, కట్టమంచి, గిరింపేట, చర్చీవీధి, ప్రాంతాల్లోని కొందరు వ్యక్తులు ప్రస్తుతం భారీగా యూఎస్ డాలర్లను తెప్పించుకున్నారనే వార్తలు గుప్పు మంటున్నారుు. విషయం ఆ నోట, ఈనోట పాకి చివరకు పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. డాలర్లలో కూడా దొంగ నోట్లు ఉన్నాయని.. వీటిని తీసుకుని చివరకు స్టేషన్లకు వచ్చి మోసపోయామంటూ క్యూ కట్టద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అరుుతే డాలర్లు ఇచ్చి వాటికి బదులుగా మన దేశపు రూ.500, వెరుు్య నోట్లను ఎలా మార్చుకుంటారనేదానిపై చిక్కుముడి వీడటంలేదు.
కాగా ఇలా సేకరించిన మన కరెన్సీతో బంగారం కొంటున్నారని నరగానికి చెందిన ప్రముఖ ఆడిటర్ చెబుతున్నారు. సవరం బంగారాన్ని మార్కెట్ ధర కంటే రూ.10 వేలు ఎక్కువ వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నా.. ఇందులో నిజానిజాలు ఏమిటనేది స్పష్టంగా తెలియడంలేదు. ఏదీ ఏమైనా జిల్లాలో పాత నోట్లకు విదేశీ డాలర్లను సైతం ఇస్తున్నట్లు తెలిసింది.