ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాౖయెర్ముఖైస్త్రీక్షణైఃయుక్తా మిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్‌గాయత్రీం వరదా భయంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవింద యుగళం హస్తైర్వహంతీ భజే‘‘
శరన్నవరాత్రి మహోత్సవాలలో మూడవ రోజు గురువారం కనకదుర్గమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకు మూల శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొంది ముక్త్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా, త్రిమూర్తి అంశగా గాయత్రీదేవి వెలుగొందుతున్నది. సమస్త దేవతా మంత్రాలూ గాయత్రీ మంత్రంతో అనుసంధానమవుతాయి.
గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే ఆయా దేవుళ్లకి అన్నప్రసాదాలను నివేదన చేస్తారు. గాయత్రీ మంత్రానికి అధిష్ఠాన దేవత సూర్యభగవానుడు. గాయత్రీ అమ్మవారిని దర్శించటం వలన భక్తులందరికీ సౌరశక్తి ప్రాప్తించి, ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్ర సిద్ధి ఫలాన్ని పొందుతారు.
Comments
Please login to add a commentAdd a comment