జడి వానలోనూ భక్తజన ప్రవాహం కొనసాగుతోంది. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపైకి చేరిన వేలాది మంది భక్తులు వర్షంలో తడిచి ముద్దవుతున్నా క్యూలోనే ఉన్నారు.
విజయవాడ: నగరంలో శనివారం ఉదయం నుంచి ఆగకుండా వర్షం కురుస్తోంది. జడి వానలోనూ భక్తజన ప్రవాహంకొనసాగుతోంది. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపైకి చేరిన వేలాది మంది భక్తులు వర్షంలో తడిచి ముద్దవుతున్నా క్యూలోనే ఉన్నారు. దుర్గాంబ దర్శనానికి బారులు తీరి వేచి చూస్తున్నారు. వేకువజాము రెండు గంటల నుంచి ఇప్పటి వరకు 60వేల మంది దర్శించుకున్నట్లు అధికారుల అంచనా.