విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఇంద్రకీలాద్రి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కొండ అంతా భక్తమయంగా మారింది. సుమారు 50వేల మందికి పైగా వచ్చినట్టు అంచనా. అమ్మవారి దర్శనం కోసం మూడుగంటలకు పైనే సమయం పడుతోంది.
వేసవి సెలవులకు తోడు ఆదివారం కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. కనకదుర్గానగర్‌లోని కేశఖండన శాలలో తలనీలాలు ఇచ్చి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. పుష్కరాల పనుల నేపథ్యంలో దుర్గాఘాట్‌ను మూసివేయడంతో భక్తులు స్నానాల కోసం కేశ ఖండన శాల వద్ద ఇబ్బందులు పడ్డారు.