భక్తజనకీలాద్రి
భక్తజనకీలాద్రి
Published Sat, Oct 8 2016 8:36 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపిణిౖయెన దుర్గాదేవి తన అంశలోని నిజ స్వరూపాన్ని సాక్షాత్కరింపచేసేలా ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ మేరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను శనివారం శ్రీ సరస్వతీదేవిగా అలంకరించారు. శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్టించి... వీణ, దండ, కమండలం, అక్షరమాల, నెమలితో కూడిన అభయముద్రను ధరించిన చదువుల తల్లిని దర్శించి భక్తులు తరించారు. ‘ తల్లీ.. మా అజ్ఞానాన్ని తొలగించి.. విజ్ఞానం ప్రసాధించు..’ అని వేడుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి.. భక్తజనకీలాద్రిగా మారింది. – సాక్షి, విజయవాడ
Advertisement
Advertisement