ప్రొద్దుటూరు కల్చరల్: కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 19, 20 తేదీల్లో విజయవాడలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు బలిజ, కాపు నిరుద్యోగ యువత హాజరు కావాలని అఖిల భారత కాపు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పాశంలక్ష్మీనరసయ్య తెలిపారు. 21న జరిగే ఉద్యోగ మేళాలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీఫాం, ఎంబీఏ, ఎంటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులు పాల్గొనాలని కోరారు. 100 కంపెనీలు పాల్గొంటాయని, 3వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని, ఈ అవకాశాన్ని కాపు యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బలిజల, కాపుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. అఖిల భారత కాపు సమాఖ్య పట్టణాధ్యక్షుడు గుండాల శ్రీనివాసులు, కార్యదర్శి సుదర్శన్, జిల్లా యూత్ అధ్యక్షుడు పాశం రామమోహన్, నాయకులు శంకర్, సూర్య, మధు, చెన్నప్ప పాల్గొన్నారు.