kapu corporation
-
తెలంగాణాలో నీ పరిస్థితి...పవన్ కళ్యాణ్ కి అదిరిపోయే కౌంటర్
-
‘పవన్,..2019లో అమరావతి కుల రాజధాని అని నువ్వు అనలేదా?’
సాక్షి, తాడేపల్లి: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు అరెస్టు పట్ల ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని పండుగ చేసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపులపై ఎన్నో అరాచకాలు చేశారని అలాంటి వ్యక్తికి కొమ్ము కాస్తున్నందుకు ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఇద్దరికీ కలిపి బుద్ధి చెబుతారన్నారు. అడపా శేషు మాట్లాడుతూ.. చంద్రబాబును అరెస్ట్ చేసి ఇప్పటికి 24 రోజులైందని ప్రజల్లో ఆయన పట్ల ఎలాంటివో సానుభూతి లేదని పైగా వారంతా చంద్రబాబు అరెస్ట్ పట్ల చాలా ఆనందంగా ఉండడమే కాకుండా పండుగ వాతావరణంలో ఉన్నారన్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కులాలను, మతాలను ఆయన ఇబ్బంది పెట్టారన్నారు. కాపు ఉద్యమం సందర్బంగా ముద్రగడ పద్మనాభంపై అనేక తప్పుడు కేసులు పెట్టారని, వంగవీటి రంగా హత్యకు కూడా చంద్రబాబే కుట్రదారుడన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ ముగ్గురూ వారి యాత్రల్లో చాలా అసభ్యంగా మాట్లాడారని ప్రజలను పదే పదే రెచ్చగొట్టారని అన్నారు. 2014లో పవన్ కళ్యాణ్ దగ్గరుండి మరీ కాపులతో టిడిపికి ఓట్లు వేయించారు. ఆనాడు చంద్రబాబు ప్రజలకు 600 హామీలిచ్చి గద్దెనెక్కారు. అలాంటిది 2019లో అమరావతి కుల రాజధాని అని పవన్ అన్న మాటలను గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ వైసీపీలో కాపులు తనని టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు కాబట్టి ఆయనకు నాదొక సూటి ప్రశ్న.. నువ్వు కూడా వైసీపీలోని కేవలం కాపు ఎమ్మెల్యేలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నావని.. కాపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనే ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నించారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక జన సైనికులకు నువ్వు ఏం చేశావని వచ్చే ఎన్నికల్లో జన సైనికులు, కాపులు నీకు ఎందుకు సహకరిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు పెట్టే స్కీములన్నీ పెత్తందారులకోసమేనని, అసలు చంద్రబాబు పేదల కోసం ఆలోచించడం ఒక్కసారైనా చూసావా అని నిలదీశారు. హైటెక్ సిటీ పక్కన భూములు కొన్నది టీడీపీ నేతలేనని, కాపులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు మీటింగ్‌లు పెట్టిస్తున్నారన్నారు. కాపులు రాజకీయంగా ఎదగకూడదన్నది టీడీపీ కుట్రని అందుకే పవన్ కల్యాణ్‌ను వాడుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ జనసేన కలిసిన తర్వాత జరిగిన మొట్ట మొదటి సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని చంద్రబాబు అరెస్ట్ పై ఆయన కుటుంబ సభ్యుల కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువగా బాధ పడుతున్నారని చంద్రబాబు కాళ్ళకు చెప్పుల మాదిరిగా పవన్ తయారయ్యారన్నారు. మీ నాన్నే నన్నేమీ పీకలేకపోయాడన్న చంద్రబాబు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని, ఇప్పుడు వీరిద్దరూ కలిసి రాష్ట్రాభివృద్ధిని నాశనం చేయాలని చూస్తున్నారన్నారు. వీరికి అధికారం కట్టబెడితే ఇక్కడి సంపదను దోచుకెళ్ళి ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ పెట్టుబడులు పెడతారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని అన్నారు. ఇది కూడా చదవండి: పద్మనాభం పీఎస్ ఘటన.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు -
మా ప్రభుత్వంపై పవన్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు
-
‘పవన్ కల్యాణ్ మీద రెక్కీ చేసింది చంద్రబాబు మనుషులే’
సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద రెక్కీ చేయించింది చంద్రబాబు మనుషులేనని రెడ్డి, కమ్మ, కాపు కార్పోరేషన్ల చైర్మన్లు స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ రెక్కీ నిర్వహించిందంటూ వచ్చిన వార్తలను రెడ్డి, కమ్మ, కాపు కార్పోరేషన్ల చైర్మన్లు ఖండించారు. ‘ పవన్‌పై రెక్కీ చేసింది చంద్రబాబు మనుషులే. సోషల్ మీడియాలో మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. వంగవీటి రంగా హత్య వెనుక ఎవరున్నారో ప్రజలు ఆలోచించాలి. కోనసీమ, తిరుపతి ఘటనల వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. అల్లర్ల వెనుక పవన్ కల్యాణ్ మనుషులే ఉన్నారు’ అని రెడ్డి కార్పోరేషన్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. విజయ్, ఆదిత్య చౌదరి, సాయికృష్ణ చౌదరి రెక్కీ నిర్వహించారు. రెక్కీ నిర్వహించిన వారు చంద్రబాబుతో ఫొటోలు దిగారు. కులాల కుంపట్లతో పవన్‌ను చంద్రబాబు బలి పశువును చేస్తున్నారు’ అని కమ్మ కార్పోరేషన్ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ తెలిపారు. ‘పవన్ సభకు జనసమీకరణం చేసింది టీడీపీ కాదా?, కుట్ర పూరిత రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్. రెడ్డి, కాపుల మధ్య గొడవలు పెట్టి చంద్రబాబు లబ్ది పొందాలని చూస్తున్నారు. జనం అన్నీ గమనిస్తూనే ఉన్నారు. చీఫ్ ట్రిక్స్ చేస్తే జనం పట్టించుకోరు. సీఎం జగన్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచిస్తామే తప్ప కుట్రల గురించి కాదు. కాపు సామాజికవర్గం మీద కుట్ర జరుగుతుంది’ ’ అని కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు పేర్కొన్నారు. -
చేతులు కట్టుకుని పరువు తీస్తావా.. చంద్రబాబు కోసం కాపు కులాన్ని వాడుకుంటావా?
సాక్షి, అమరావతి: సొంత సామాజిక వర్గాన్ని తొక్కేస్తూ తాను మాత్రమే ఎదగాలని కోరుకుంటున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కాపులు క్షమించరని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీలో ఉన్న కాపు నాకొడకల్లారా.. అంటూ పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు కోసం కాపు కులాన్ని వాడుకుంటావా? అని ఆయన నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వంగవీటి రంగా హత్యకు కారకుడైన చంద్రబాబు పక్కన చేతులు కట్టుకుని నిలబడి పవన్ కళ్యాణ్ కాపుల పరువు తీశారు. గతంలో జనవాణి కార్యక్రమానికి వచ్చి రంగా విగ్రహానికి కనీసం దండ వేయని పవన్ కళ్యాణ్‌కు కాపుల పట్ల ఏం ప్రేమ ఉంది? పవన్ కళ్యాణ్ సీఎం కావాలని జనసైనికులు ఆయన చుట్టూ తిరుగుతుంటే ఆయన మాత్రం చంద్రబాబును ఆ కుర్చీలో కూర్చోబెట్టాలనే విధంగా వ్యవహరించడాన్ని కాపు యువత గుర్తించాలి. పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి అధ్యక్షుడిలా వ్యవహరించటం లేదు. మూడు పెళ్లిళ్ల నినాదం ఇస్తే యువత పరిస్థితి ఏమిటి? చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదివి వెళ్లిపోతే అంతిమంగా కాపు కులమే అవహేళనకు గురవుతుందని గుర్తించాలి. చంద్రబాబు–పవన్ డైరెక్షన్లోనే కాపులపై కుట్ర జరుగుతోం ది. వైఎస్సార్సీపీలో ఉన్న కాపు నేతలు కాపులు కాదా? విశాఖలో మంత్రులపై దాడుల వెనుక చంద్రబాబు కుట్ర ఉంది. 2014లో జనసేన వల్ల అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అనేక దుర్మార్గాలకు పాల్పడి జన్మభూమి కమిటీలతో వేధిస్తే పవన్ ఏం చేశారు? కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ.1,000 కోట్లు ఇస్తామన్న చంద్రబాబు 2014 – 17 చివరి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోతే ఎందుకు ప్రశ్నించలేదు? కాపు నేతలు, యువకులపై టీడీపీ హయాంలో తప్పుడు కేసులు బనాయించిన దుష్ట శక్తులెవరో పవన్‌కు తెలియదా? ముద్రగడ కుటుంబాన్ని రోడ్డుకీడ్చి దూషించి మహిళలను జుత్తు పట్టుకుని కొడితే పవన్‌కు కాపులు గుర్తు రాలేదా? కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం కోనసీమలో అల్లర్లకు ప్రేరేపించి రాజకీయ లబ్ధి కోసం పాకులాడింది ఎవరో పవన్‌కు తెలియదా?’ అని అడపా శేషు అన్నారు. -
త్వరలోనే మున్నూరు కాపు కార్పొరేషన్
కాచిగూడ: మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం అనుకూలంగా ఉన్నారని, త్వరలోనే కార్పొరేషన్ ఏర్పాటవుతుందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో శనివారం కాచిగూడలోని మున్నూరు కాపు భవన్, మ్యాడం అంజయ్య హాల్లో మున్నూరు కాపు ప్రజాప్రతినిధుల సత్కార కార్యక్రమం మహాసభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న కాచిగూడ మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ బోర్డును త్వరలోనే దేవాదాఖ శాఖ పరిధి నుంచి బయటకు తీసుకువస్తామన్నారు. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో చర్చించడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్నూరుకాపులందర్ని ఏకం చేయడం జరుగుతుందని, ఆ దిశగా ప్రయత్నాలను మొదలుపెట్టి 90 శాతం వరకు పూర్తి చేశామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సహకారా అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ ఆకుల లలిత, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగళారపు లక్ష్మణ్, జెల్లి సిద్దయ్య, దామేర జ్ఞానేశ్వర్, మామిండ్ల శ్రీనివాస్, బండి పద్మ, రాకేష్, కొండూరు వినోద్‌కుమార్, గంగం రవి, చింతపండు మల్లేష్, ఎనుగుల మాణిక్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
కాపు సోదరులు పవన్ ప్రభావానికి లోను కావద్దు
కాపు సోదరులు పవన్ కల్యాణ్ ప్రభావానికి లోను కావద్దు. ఆయన వల్ల కాపులు అనేక ఇబ్బందులు పడ్డారు. పవన్ సినిమాలు ఆడించి అనేకమంది కాపు సోదరులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. జగన్ నుంచి కాపులను దూరం చేసేలా పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. సినీ పరిశ్రమలోనూ కాపులను విడగొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కాపులకు పెద్దన్నలాగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలబడ్డారు. కాపులకు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పథకాలు అమలు చేస్తున్నారు. కాపునేస్తం పథకం రూపశిల్పి.. వైఎస్ జగన్. కాపులకు ఎమ్మెల్యే, ఎంపీ, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలుగా అవకాశం కల్పించారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కాపులంతా బలోపేతం కావాలంటే పవన్ ప్రభావం నుంచి బయటకు రావాలి. కాపులు ఆవేశపరులే కాదు.. ఆలోచనాపరులు కూడా. –విజయవాడలో కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు -
కాపుల పట్ల నిజమైన హీరో సీఎం జగన్ : అడపా శేషు
-
‘సీఎం జగన్ కాపులకు పెద్ద పీట వేశారు’
-
‘సీఎం జగన్ కాపులకు పెద్ద పీట వేశారు’
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేత అడపా శేషుకు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం నామినేటెడ్ పోస్టులను ప్రకటించారు. దీనిలో భాగంగా అడపా శేషుకు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. తనకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అడపా శేషు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఎప్పుడూ మరువలేదు. రాష్ట్రంలో సీఎం జగన్ కాపులకు పెద్ద పీట వేశారు. పార్టీకి మంచి పేరు తీసుకుని వచ్చే విధానంగా పని చేస్తాను’’ అని అడపా శేషు తెలిపారు. ‘‘రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్ కాపు కార్పొరేషన్. నిబద్ధతతో పని చేస్తాను. కాపు కులానికి అండగా ఉంటాను. ముఖ్యమంత్రి జగనన్నను నమ్ముకుంటే కచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. రాష్ట్రంలో సీఎం జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం జగన్ కాపు కార్పొరేషన్‌కే ఎక్కువగా నిధులు ఇచ్చారు’’ అని అడపా శేషు తెలిపారు. -
కాపు కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకానికి ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌కు అధికార, అనధికార డైరెక్టర్ల నియామకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారిగా డైరెక్టర్లుగా ఏడుగురు, అనధికార డైరెక్టర్లుగా 12 మంది నియమించేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. చదవండి: థర్డ్‌వేవ్ హెచ్చరికలు: ఏపీ సర్కార్ ముందస్తు ప్రణాళిక ‘ఆ భూములను చంద్రబాబు పప్పుబెల్లాల్లా పంచాడు’ -
నారా నీడలో నోరు పెగల్లేదా?
కాపులకు ఏడాదికి రూ.వెయ్యి కోట్లు చొప్పున ఐదేళ్లకు రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని బాబు 2014 ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక బాబు ప్రభుత్వం మొత్తం ఐదేళ్ల కాలంలో కాపు కార్పొరేషన్ ద్వారా రూ.1,874.67 కోట్లు ఇచ్చింది. 2,54,335 మందికి మాత్రమే లబ్ధి చేకూర్చింది. సాక్షి, అమరావతి: ‘ఏ ప్రభుత్వమైనా కార్పొరేషన్లకు కేటాయించిన నిధుల నుంచి సంక్షేమ పథకాలకు నిధులను ఖర్చు చేస్తుంది. కాపు కార్పొరేషన్ కూడా అంతే. గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం.. కాపుల సంక్షేమానికి కాపు కార్పొరేషన్ ద్వారానే నిధులు కేటాయించింది. చంద్రబాబు ప్రభుత్వం కాపు సంక్షేమానికి చేసిన కేటాయింపులు, పెట్టిన ఖర్చు బాగా తక్కువ. ఆ నిధులను కూడా కాపు కార్పొరేషన్ నుంచి ఖర్చు చేసింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కాపుల సంక్షేమానికి కేటాయింపులు ఊహించనంతగా పెరిగాయి. ఈ ప్రభుత్వం 13 నెలల్లోనే రూ.4,769 కోట్లకుపైగా ఖర్చు చేసింది. 22.89 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది. ఈ విషయాన్ని మరిచిపోయి పవన్‌కల్యాణ్ లాంటి వారు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వం కూడా కాపుల కోసం చేసిన వ్యయాన్ని కాపు కార్పొరేషన్ నుంచే చేశారనే విషయాన్ని పవన్ ఉద్దేశ పూర్వకంగా ప్రస్తావించట్లేదు. అప్పుడు ఏమీ మాట్లాడని పవన్, ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. జగన్ ప్రభుత్వం కాపుల సంక్షేమానికి నిధుల కేటాయింపు పెంచిన విషయాన్ని పక్కనపెట్టి.. కాపు కార్పొరేషన్ నుంచి నిధులు ఇస్తుండటం తప్పన్నట్లుగా మాట్లాడుతున్నారు’ అని పవన్‌కల్యాణ్ తీరుపై కాపులు మండిపడుతున్నారు. ఎక్కువ నిధులు ఇచ్చినందుకు బాధా? కాపు సంక్షేమ పథకాలకు కాపు కార్పొరేషన్ నుంచి నిధులు వ్యయం చేయడం చంద్రబాబు హయాంలో కొనసాగింది. అదే ఇప్పుడూ కొనసాగుతోంది. కాపు కార్పొరేషన్ నుంచి నిధులను వారి సంక్షేమ పథకాలకు చంద్రబాబు ఖర్చు చేసినప్పుడు మౌనంగా ఉన్న పవన్‌కల్యాణ్.. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? కాపులను నిలువునా ముంచింది చంద్రబాబే. అటువంటి చంద్రబాబును ఒక్క మాట కూడా అనని పవన్‌కల్యాణ్.. కాపుల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేయడం బాధాకరం. కాపు కార్పొరేషన్ ద్వారా ఏడాదికి రూ.2 వేల కోట్లు ఇస్తానని హామీ ఇచ్చిన వైఎస్ జగన్.. ఏడాదిలో వివిధ పథకాల ద్వారా రూ.4 వేల కోట్లకుపైగా కాపులకు ఖర్చుపెట్టారు. ఇది పవన్ కల్యాణ్‌కు కనిపించదా? లేక ఎక్కువ ఖర్చు పెట్టినందుకు బాధా? – అవంతి శ్రీనివాస్, పర్యాటక శాఖ మంత్రి చంద్రబాబుతో కుమ్మక్కు రాజకీయమిది కాపుల గురించి మాట్లాడే అర్హత పవన్ కల్యాణ్‌కు లేదు. టీడీపీ హయాంలో చంద్రబాబు కాపులకు చేసిన అన్యాయాన్ని ఆయనెప్పుడూ ప్రశ్నించలేదు. కాపు కార్పొరేషన్ నుంచే చంద్రబాబు కాపులకు అన్ని పథకాలకు నిధులు ఇచ్చారు. ఆ నిధులన్నీ అరకొరే. కాపు కార్పొరేషన్ ద్వారా ఏటా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కినా పట్టించుకోలేదు. ముద్రగడ పద్మనాభం విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు కాపులెవరూ మర్చిపోలేదు. ఆయన కుటుంబాన్ని చంద్రబాబు పోలీసుల ద్వారా తీవ్ర మానసిక వ్యథకు గురిచేశారు. ఆ సమయంలో కాపులంతా పార్టీ రహితంగా బాధపడ్డారు. అప్పుడు పవన్‌కు ముద్రగడ కాపు కులస్తుడని గుర్తుకు రాలేదా? వైఎస్ జగన్ మేనిఫెస్టోలో కాపునేస్తం గురించి ప్రకటించకపోయినా అమలు పరిచి మహిళలకు ఆర్థిక సాయం చేశారు. పవన్ ఇవన్నీ తెలుసుకుంటే మంచిది. – కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే బాబు డైరెక్షన్.. పవన్ యాక్షన్ చంద్రబాబు కార్యాలయం నుంచి వచ్చే ప్రెస్నోట్లు వల్లెవేసే పవన్‌కు కాపుల అభ్యున్నతికి సీఎం జగన్ చేస్తున్న కార్యక్రమాలు కనిపించవు. తెలుగుదేశం హయాంలో కాపు కార్పొరేషన్ నిధులను ‘పసుపు–కుంకుమ’కు మళ్లించారు. అప్పుడు మాట్లాడని పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? రిజర్వేషన్‌పై ఉద్యమం చేయాలంటే పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమం చేసి సాధించాలి. భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలన్నా, పెంచాలన్నా భారత పార్లమెంటులో 2/3 మెజార్టీ సభ్యులతో తీర్మానం చేసి 9వ షెడ్యూల్లో చేర్పించాలి. ఈ ప్రక్రియపై రాష్ట్రపతి ఆమోదం తెలియజేయాలి. కాపుల రిజర్వేషన్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తే సంతోషిస్తాం. – నరహరశెట్టి శ్రీహరి, జాతీయ కాపు సమాఖ్య అధ్యక్షుడు -
‘వైఎస్సార్ కాపు నేస్తం’ అమలుకు ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారి చేసింది. కాపు మహిళలకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం అందించనుంది. ఇక నుంచి రాష్ట్రంలోని కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన మహిళలకు ఈ ఆర్థికసాయం అందనుంది. 45 ఏళ్లు పైబడిన 60 ఏళ్లలోపు కాపు మహిళల జీవనోపాధి కింద ‘వైఎస్సార్ కాపు నేస్తం’ వర్తిస్తుంది. ( వైఎస్సార్ కాపు నేస్తం) -
వైఎస్సార్ కాపు నేస్తం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన మహిళలకు ఆర్థికసాయం అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకానికి శ్రీకారం చుడుతోంది. 45 ఏళ్లు పైబడిన 60 ఏళ్లలోపు కాపు మహిళల జీవనోపాధికోసం ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం చేస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట మేరకు ఈ పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. పథకం అమలుకు రూపొందించిన మార్గదర్శకాలకు తుదిరూపు ఇచ్చింది. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ పథకం ద్వారా దాదాపు ఆరు లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతారని అంచనా. అభ్యర్థుల ఎంపికలో నిబంధనలివీ: మహిళల వయోపరిమితి 45 నుంచి 60 ఏళ్లలోపు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం నెలకు రూ.10 వేలలోపు, అర్బన్‌లో రూ.12 వేలలోపు ఉండాలి. కారు ఉండకూడదు. ట్యాక్సీ, మినీవ్యాన్ వంటి వాటి ద్వారా జీవనం సాగిస్తుంటే మినహాయింపు ఇచ్చారు. మూడెకరాల మాగాణీ లేదా పదెకరాల మెట్ట భూమి, లేదా మాగాణి, మెట్ట కలిపి పదెకరాల భూమి ఉండవచ్చు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు. ప్రభుత్వ పెన్షన్ కూడా తీసుకుంటూ ఉండకూడదు. కుటుంబంలో వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నవారు ఉన్నా.. కాపు నేస్తం వర్తిస్తుంది. ఆదాయ పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు అనర్హులు. 2020 మార్చి నుంచి 2024 మార్చి వరకు ఐదేళ్లపాటు సాయం అందజేస్తారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుంది. వలంటీర్లు అభ్యర్థుల సమాచారాన్ని సేకరిస్తారు. గ్రామ సచివాలయం వద్ద లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాక పథకం అమలుకు చర్యలు తీసుకుంటాం. వచ్చే మార్చిలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం జమవుతుంది. – హరేందిరప్రసాద్, కాపు కార్పొరేషన్ ఎండీ -
‘దళారులకు స్థానం లేదు..పథకాలన్నీ ప్రజల వద్దకే’
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికారంలో ఉండగా కాపులను మోసం చేశారని..కాపుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. విజయవాడలో రెండో రోజు జరుగుతున్న ‘కాపు విదేశీ విద్య దీవెన’ సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమంలో జక్కంపూడి రాజా, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజా మీడియాతో మాట్లాడుతూ.. కాపులకు ఇచ్చిన హామీని వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారన్నారు. కాపులకు ప్రతి ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలు సీఎం జగన్ కేటాయిస్తున్నారని వెల్లడించారు. పవన్ కల్యాణ్ పోటీ చేసిన ఉభయగోదావరి జిల్లాలో కాపులు వైఎస్ జగన్‌కు అండగా నిలబడ్డారన్నారు. ఇస్తామని చెప్పి మోసం చేశారు.. కాపులకు ఏడాదికి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని.. కానీ వైస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2,000 కోట్లు కాపులకు కేటాయించారని పేర్కొన్నారు. ఐదేళ్లలో కేవలం 1,700 కోట్లు మాత్రమే చంద్రబాబు కేటాయించారని విమర్శించారు. కాపు విదేశీ దీవెన పథకానికి వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందేవని.. వైఎస్ జగన్ పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. వారికి మాత్రమే లోన్లు ఇచ్చేవారు: మంత్రి వెల్లంపల్లి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలకు మాత్రమే లోన్లు ఇచ్చేవారని.. వైఎస్ జగన్ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ తండ్రి బాటలో నడుస్తూ.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ ఏడాది కాపు విదేశీ విద్య దీవెన పథకం ద్వారా 1000 మందిని విదేశాలకు పంపుతున్నామని మంత్రి వెల్లడించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాలనలో దళారులకు స్థానం లేదని.. సంక్షేమ పథకాలన్నీ నేరుగా ప్రజల వద్దకే చేరుతున్నాయని తెలిపారు. -
తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలి: వినాయక్
సాక్షి, విజయవాడ: దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్రావు వారసుడిగా రాజా కీర్తి ప్రతిష్టతలు ఇనుమడింప చేయాలని సినీ దర్శకుడు వి.వి. వినాయక్ ఆకాక్షించారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా ఆదివారం విజయవాడలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన వినాయక్ మాట్లాడుతూ.. ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న గొప్ప నాయకుడిగా జక్కంపూడి రామ్మోహన్‌రావును ప్రస్తుతించారు. తండ్రి బాటలో నడిచి ఆయన ఆశయాలను రాజా నెరవేర్చాలని అన్నారు. జక్కంపూడి రాజాకు కాపు కార్పొరేషన్ పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
‘చంద్రబాబును కాపులు ఇక జీవితంలో నమ్మరు’
సాక్షి, విజయవాడ: కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజాను నియమించడం కాపులందరికీ దక్కిన గౌరవమని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవీ స్వీకార ప్రమాణ సభలో ఆయన మాట్లాడుతూ.. కాపు కార్పొరేషన్ టీడీపీ దోపిడీకి గురైందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కాపుల కోసం విడుదలయిన నిధుల మొత్తం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్ళాయన్నారు. కాపుల సంక్షేమం గురించి చంద్రబాబు ప్రధానితో ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. చంద్రబాబు మోసపూరిత చర్యలతో అగ్రవర్ణాలలో చిచ్చు రగిలిందన్నారు. చంద్రబాబును కాపులు ఇక జీవితంలో నమ్మరని తెలిపారు. కాపులను విస్మరించకుండా ఇచ్చిన మాటకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుబడి బాధ్యతగా పనిచేస్తున్నారని ఆళ్ల నాని చెప్పారు. ఈ సందర్భంగా కాపుల పక్షాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్.. కాపు సామాజిక వర్గ ఆరాధ్య నేత ప్రతి కాపు విద్యార్థికి కార్పొరేషన్ అండగా ఉండాలని మంత్రి పేర్ని నాని అన్నారు. కాపు సామాజిక వర్గమంతా ఆరాధించే నాయకుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ నిధులు మంజూరు చేయాలని జక్కంపూడి రాజాను ఆయన కోరారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి సీఎం జగన్ కాపులను టీడీపీ రాజకీయంగా మాత్రమే వాడుకుందని ఎమ్మెల్యే కిలారి రోశయ్య అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని ప్రశంసించారు. కాపులకు ఇచ్చిన నిధులను సక్రమంగా వినియోగించాలని కోరారు. -
కాపుల సమావేశానికి వెళ్తే చంద్రబాబు నిలదీశారు
సాక్షి, విజయవాడ: కాపులకు గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలనే ఆలోచనతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) అన్నారు. కాపు ఛైర్మన్ ప్రమాణా స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..చిన్న వయస్సున్న రాజాకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కేటాయించడం పట్ల వైయస్ జగన్ కాపుల పక్షపాతి అనడానికి నిదర్శనం అని పేర్కొన్నారు. గతంలో తాను కాపుల సమావేశానికి వెళ్ళితే చంద్రబాబు నిలదీశారని తెలిపారు. జన్మించేటప్పుడు..మరణించేటప్పుడు మనకు తోడుగా ఉండేది కులమేనని తెలిపారు. కాపులకు ఐక్యత ఉండదంటారని అదే మనకు బలం కావాలన్నారు. కాపులు ఆశించే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగేలా జక్కంపూడి రాజా కృషి చేయాలని కోరారు. బీసీలకు కాపు జాతి అన్యాయం చేయద్దని..కాపులు ఎవరికైనా కాపు కాస్తారే తప్ప అన్యాయం చేయరని తెలిపారు. కాపుల ఎదుగుదలను చంద్రబాబు అడ్డుకున్నారు:దాడిశెట్టి రాజా 70 శాతం ఉన్న కాపులను ఏ రంగంలో కూడా ఎదగనివ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కాపులకు అండగా ఉన్నారన్నారు. కాపు సంక్షేమానికి ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ కాపుల పక్షపాతి:సామినేని ఉదయభాను కాపుల పక్షపాతి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. కాపుల సంక్షేమాన్ని చంద్రబాబు విస్మరించారన్నారు.కాపు ప్రజా ప్రతినిధులకు పెద్దపీట వేసిన వ్యక్తి వైయస్ జగన్ అని కొనియడారు. -
‘మా కుటుంబానికి వైఎస్ రాజశేఖరరెడ్డి దైవం’
సాక్షి, విజయవాడ : కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా జక్కంపూడి రాజా ఆదివారం ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఆయన చేత కాపు కార్పొరేషన్ ఎండీ హరీంద్రప్రసాద్ ప్రమాణం చేయించారు. దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ తమ కుటుంబాన్ని వెన్నంటి ఆదుకున్నారని రాజా అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మమ్మల్ని ఆదుకున్న వైఎస్ జగన్, నన్ను ఆదరించి గెలిపించిన నియోజకవర్గ ప్రజలవల్లే నాకీ పదవి లభించింది. ఇప్పటికీ, ఎప్పటికీ వైఎస్ జగన్ వెంటే నడుస్తా. కాపుల సంస్కరణలను మంటకలిపిన వ్యక్తి చంద్రబాబు. కాపుల్ని అయోమయానికి గురిచేస్తూ రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు నాటకాలాడారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయంచేస్తానని మా నాయకుడు సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. కాపు కార్పొరేషన్లో కొత్త సంస్కరణలు తీసుకువస్తాం. ప్రతి కాపు సోదరుడికి అండగా ఉంటాను. ప్రతి రూపాయి కాపులకు అందేలా చూస్తాం’అన్నారు. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జక్కంపూడి రామ్మెహన్ తనయుడే రాజా. ఆయన వైఎస్సార్సీపీ రాజానగరం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాపులకు ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తొలి బడ్జెట్లోనే రూ.2000 కోట్లు కాపు కార్పొరేషన్‌కు కేటాయించి కాపుల అభ్యున్నతికి తొలి అడుగు వేశారు. కార్యక్రమంలో మంత్రులు కన్నబాబు, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ఆళ్లనాని, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఇతర ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. కాపులు ఎవరికీ వ్యతిరేకం కాదు.. జక్కంపూడి రాజా తల్లి విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ‘మా కుటుంబానికి వైఎస్ రాజశేఖరరెడ్డి దైవం అయితే జక్కంపూడి రమ్మోహనరావు, వంగవీటి రంగా మా ప్రాణం. చెప్పిన మాటను నెరవేర్చుకునే ఏకైక వ్యక్తి జగన్. కాపులు ఎవ్వరికీ వ్యతిరేకం కాదు’అన్నారు. రాజా ఛైర్మన్‌గా రావడం మంచిపరిణామమని కాపు కార్పొరేషన్ ఎండీ హరీంద్రప్రసాద్ అన్నారు. కార్పొరేషన్ కింద వచ్చే ప్రతి రూపాయి కాపుల అభ్యున్నతికి ఖర్చు పెడతామని స్పష్టం చేశారు. మాట నిలబెట్టుకునే ఏకైక నేత జగన్ అని మాజీ కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. -
‘కాపుల కోసం ఆయన ఒక పని కూడా చేయలేదు’
సాక్షి, విజయవాడ: గత టీడీపీ ప్రభుత్వం కాపులకు వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి..ఐదేళ్లలో రెండు వేల కోట్లు కూడా ఖర్చుచేయలేదని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఆదివారం కాపు ఛైర్మన్ జక్కంపూడి రాజా ప్రమాణా స్వీకారోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ..ఢిల్లీ పర్యటనలు తప్ప..చంద్రబాబు కాపుల కోసం ఒక పని కూడా చేయలేదన్నారు. కాపులు ఓసినో, బీసీనో చెప్పలేని విధంగా కాపులను చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్ కాపులకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటిస్తున్నారన్నారు. జక్కంపూడి రాజాను కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించడం సీఎం జగన్ ఖచ్చితమైన నిర్ణయాలకు నిదర్శమని తెలిపారు.రాజకీయ,సామాజిక,విద్య,ఆర్థిక పరంగా కాపులను ఎదిగేలా చేస్తే కాపులు అన్ని రంగాల్లోనూ ముందుంటారని తెలిపారు. ఐక్యంగా ఉంటే అన్నీ సాధించుకోగలుగుతామన్నారు. చంద్రబాబులా కాపులను మోసం చేయం: అబంటి కాపు కార్పొరేషన్‌కు పదివేల కోట్లు ఖర్చు చేయడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే అబంటి రాంబాబు అన్నారు. అన్నికార్పొరేషన్ల కన్నా కాపు కార్పొరేషన్ ఆర్థిక పరిపుష్టి సంతరించుకుందన్నారు. కాపులను బీసీల్లోకి చేరుస్తానని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారన్నారు. దీంతో కాపులకు తీరని నష్టం కలిగిందన్నారు. మంజునాధ కమిషన్ నివేదిక వ్యతిరేకంగా ఉండటంతో .. కమిషన్ సభ్యుల రిపోర్టు కేంద్రానికి ఇచ్చేలా చంద్రబాబు చేశారని మండిపడ్డారు. రెండు రిపోర్టులపై కేంద్రం అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు ప్రభుత్వం సమాధానమే ఇవ్వలేదన్నారు. చంద్రబాబు కాపులను నమ్మించి మోసం చేశారని..మా ప్రభుత్వం కాపులను మోసం చేయదన్నారు. కాపు సంక్షేమానికి ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. -
కానిచోట కల్యాణ మండపమట..!
జిల్లా కేంద్రమైన ఏలూరులోరూ.5 కోట్ల కాపు కార్పొరేషన్ నిధులతో నిర్మించనున్న కల్యాణ మండపం వివాదంలో పడింది. కాలనీలో పార్క్ కోసం కేటాయించిన కాలనీ కామన్ సైట్లో అధికార పార్టీ నేతలు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో హడావుడిగా శంకుస్థాపన చేశారు. దీనిని కాలనీవాసులు వ్యతిరేకించి కోర్టును ఆశ్రయిం చేందుకు సన్నద్ధం అవుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, తమ అంగీకారం లేకుండా మండపం నిర్మాణం పనులు చేపడుతున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి , ఏలూరు :ఏదైన ప్రదేశంలో కొత్తగా లేఅవుట్ వేసిన సమయంలో కొంత స్థలాన్ని కాలనీవాసుల అవసరాలకు అనుగుణంగా కామన్ సైట్‌గా వదిలేసి, మిగిలిన స్థలాన్ని విక్రయించుకుంటారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆ లేఅవుట్లో స్థలాలు కొనుగోలు చేసుకున్న వారు ఆ కామన్ సైట్‌ను ఆటస్థలంగాను, పార్కుగాను వినియోగించుకోవాల్సి ఉంటుంది. తమ్మిలేరుకు అనుకొని ఉన్న సుమారు పదిహేడున్నర ఎకరాల్లో 2002లో ప్రస్తుత నగరపాలక సంస్థ మేయరు నూర్జహాన్ భర్త ఎస్ఎంఆర్ పెదబాబు లేవుట్‌ను వేశారు. ప్రభుత్వ నిబంధన (72 జీవో) ప్రకారం ఆ లేఅవుట్లో 4816 చదరపు గజాల స్థలాన్ని కామన్ సైట్‌ను ఆట స్థలం, పార్కుకు గాను వదిలి, 2008లో నగరపాలకసంస్థకు రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ (1306/2008)గా ఇచ్చారు. ఈ కామన్ సైట్లో పార్కును నిర్మించేందుకు అమృత్ నిధులు సుమారు రూ.40 లక్షలు మంజూరు కావడంతో అధికారులు పనులు కూడా ప్రారంభించారు. అయితే ఈ కామన్సైట్లో కాపు కల్యాణ మండపం నిర్మించేందుకు ప్రభుత్వ అనుమతులు ఇవ్వాల్సిందిగా గత ఏడాది డిసెంబర్ 23న జరిగిన కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో అజెండాలోని 30 అంశంగా పొందుపరిచారు. దీనిని సభ్యులందరూ ఆమోదం తెలిపి ప్రభుత్వానికి పంపించారు. ఇప్పటికే ఆ లేఅవుట్లో చాలా మంది ఇళ్లను నిర్మించుకొని నివాసంఉంటున్నారు. అయితే ఈ స్థలాన్ని అక్కడ స్థలాలు కొనుగోలు చేసిన వారికి ఎటువంటి ఉపయోగకరంగా లేకుండా ఓ సామాజిక వర్గం పేరుతో కల్యాణ మండపాన్ని నిర్మించేందుకు పాలకులు శంకుస్థాపన చేయడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు కామన్ సైట్లో పార్కు, ఆట స్థలాన్ని తప్ప ఎటువంటి నిర్మాణాలను చేపట్టకూడదని నిబంధనలు చెబుతున్నాయి. అసలు నిర్మాణం ఎవరు చేస్తారు..? ఎస్ఎంఆర్ నగర్‌లోని కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి ఈ నెల 2వ తేదీన కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, స్థానిక ఎమ్మెల్యే బడేటి బుజ్జిలు శంకుస్థాపన చేశారు. కాపు కార్పొరేషన్ నిధులు రూ.5 కోట్ల వ్యయంతో ఈ కల్యాణ మండపం నిర్మిస్తున్నట్లు వారు ప్రకటించారు. దాంతో పాటు నగరంలో పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కల్యాణ మండపం నిర్మాణం ఎవరు చేపడతారనే విషయమై గందరగోళం నెలకొంది. ఈ కామన్ సైట్లో పార్కును నిర్మించేందుకు అమృత్ నిధులు సుమారు రూ.40 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన నగరపాలకసంస్థ అధికారులు ఇప్పటికే సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చు చేసి కామన్ సైట్ చుట్టూ ప్రహరీ నిర్మించి, మట్టితో మెరక చేశారు. అయితే ఈ కామన్ సైట్లో కల్యాణ మండపం నిర్మించేందుకు పాలకులు శంకుస్థాపన చేయడంతో ఆ నిధులు వృథా అయినట్లే. అయితే ఈ కల్యాణ మండపాన్ని నగరపాలకసంస్థ, పబ్లిక్ అండ్ హెల్త్ నిర్మిస్తుందా, లేక నామినేషన్ పద్ధతి ద్వారా ఎవరైనా కాంట్రాక్టర్‌కు నిర్మాణ పనులను అప్పగిస్తారా అనేది ఇంకా çస్పష్టత లేదు. కామన్ సైట్లో కల్యాణ మండపం నిర్మించడం నిబంధనలకు విరుద్ధం కావడంతో ఈ నిర్మాణ పనులను చేపట్టేందుకు నగరపాలకసంస్థ అధికారులు ముందుకు రావడం లేదని సమాచారం. దీనిపై కాలనీ వాసులు కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు.కోర్టును ఆశ్రయిస్తే తాము ఇబ్బందుల్లో పడతామని కార్పొరేషన్ అధికారులు అందోళన చెందుతున్నారు. ప్రభుత్వఆమోదం వస్తేనే పనులు కామన్‌సైట్‌గా ఉన్న ఈ స్థలాన్ని కాపు కార్పొరేషన్ భవన నిర్మాణం కోసం కౌన్సిల్లో తీర్మానం చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే పనులు ప్రారంభిస్తాం. – మోహన్,మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ -
మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటు కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని నిజామాబాద్ ఎంపీ కవిత ప్రకటించారు. సోమవారం నిజామాబాద్‌లో నగర మున్నూరుకాపు సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. సంఘం నేత కొండ దేవన్న కోరుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని, అవసరమైతే తన వెంట తీసుకువెళ్లి కార్పొరేషన్ సాధనకు ప్రయత్నిస్తానని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు ఎలా వ్యవహరిస్తారో అదే వారి నిజమైన వైఖరి అని అన్నారు. కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
కాపు కార్పొరేషన్ ఆఫీసులో రగడ
-
కాపు కార్పొరేషన్ ఆఫీసులో రగడ
సాక్షి, అమరావతి: కాపు కార్పొరేషన్ కార్యాలయంలో ఆదివారం రాత్రి 8 గంటల నుంచి 8.30 వరకూ హైడ్రామా నడిచింది. కార్పొరేషన్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం 8 గంటలకు విలేకరుల సమావే శాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎండీ అమరేంద్ర కుమార్ మీడియాకు సమాచారమిచ్చారు. విలేకరులు చేరుకునే సమయంలో కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ కూడా అక్కడకు వచ్చారు. ఆదివారం కార్యాలయ రికార్డులు తారుమారు చేసే అవకాశం ఉందని రామానుజయ అనుమానం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విలేకరుల సమావేశం నిర్వహించకూడదని అమరేంద్రకుమార్‌ను ఆదేశించారు. అయితే తన చాంబర్లో విలేకరులతో మాట్లాడుతానని అమరేంద్రకుమార్ స్పష్టం చేశారు. దాంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు ఎండీ అమరేంద్రకుమార్ కార్యాలయం బయట రోడ్డుపైనే విలేకరులతో మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని వెల్లడిం చారు. విద్యోన్నతి పథకం కింద శిక్షణ తీసుకున్నవారికే ఫీజులు చెల్లించామన్నారు. ఉద్యోగ మేళాలు ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో జరిగాయని.. వాటి ఖర్చులతో తనకు సంబంధం లేదన్నారు. నిబంధనలకు లోబడే తన తల్లి వైద్య ఖర్చులకు నిధులను వినియోగించానన్నారు. 2016కు ముందటి అంశాలతో తనకు సంబంధం లేదన్నారు. మాతృశాఖకు ఎండీ సరెండర్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ రేంద్రకుమార్‌ను మాతృశాఖ (పశు సంవర్థక)కు సరెండర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కార్పొరేషన్ కార్యాలయం లో ఎక్కువమందిని ఔట్సోర్సింగ్, కాంట్రా క్ట్‌పై తీసుకున్నారు. వీరి ద్వారా నిధుల దుర్వినియోగానికి ఎండీ పాల్పడినట్లు ఉన్న తాధికారుల పరిశీలనలో వెల్ల్లడైంది. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం అమలు తీరుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. -
స్వప్రయోజనాల కోసమే పాదయాత్ర
ఏలూరు (ఆర్ఆర్ పేట) : కాపు నాయకుడు తన స్వప్రయోజనాల కోసమే పాదయాత్ర చేయడానికి పూనుకున్నారని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ విమర్శించారు. స్థానిక జెడ్పీ అతిథి గృహంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం చేపట్టిన పాదయాత్ర గతంలో తుని తరహాలో హింసాత్మకం కాకూడనే ఉద్దేశంతోనే ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కాపులకు ఉద్యోగ, విద్యాపరమైన రిజర్వేషన్ కల్పించే కార్యాచరణ ప్రణాళిక త్వరలో పూర్తి కాబోతుందని, ఎవరు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా కాపు కులస్తులు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాపులను బీసీ జాబితాలో చేర్చే విషయంలో బీసీలు కూడా సుముఖంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ ద్వారా గతేడాది 80 వేల మందికి స్వయం ఉపాధి రుణాలు అందించామని ఈ ఏడాది 64 వేల మంది కాపులకు రుణాలు అందించాలనే లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు నష్టం జరగకుండా కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పిన మాట వాస్తవమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళాభివృద్ధి సంస్ధ చైర్మన్ పాలి ప్రసాద్, కాపు సంఘ నాయకురాలు ఎ.మాళవిక పాల్గొన్నారు. -
కాపు జాతితో బాబు మైండ్ గేమ్: ముద్రగడ
కిర్లంపూడి: కాపు జాతితో ఏపీ సీఎం చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్ర గడ పద్మనాభం ఆరోపించారు. కాపు రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన కాపులకు బహిరంగ లేఖ విడుదల చేశారు. ‘ఈ మధ్య మన జాతి (బలిజ, తెలగ, ఒంటరి, కాపు) రిజర్వేషన్ల సాధన కోసం చేస్తున్న నిరసన లను తట్టుకోలేక చంద్రబాబు ప్రభుత్వం.. వారి పెంపుడు పత్రిక, చానల్లో కాపు పోరాటంలో చీలికలని, కాపు, బలిజల మధ్య కుమ్ములాటలని రాయిస్తోంది’ అని ముద్రగడ మండిపడ్డారు. ఉద్యమం ప్రారంభం నుంచి తనను తిట్టించడం కోసం కొంత మంది పెద్దలతో పాటు కాపు కార్పొరేషన్‌నూ ప్రభుత్వం వినియోగించు కుందన్నారు. -
21న ఉద్యోగ మేళా
ప్రొద్దుటూరు కల్చరల్: కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 19, 20 తేదీల్లో విజయవాడలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు బలిజ, కాపు నిరుద్యోగ యువత హాజరు కావాలని అఖిల భారత కాపు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పాశంలక్ష్మీనరసయ్య తెలిపారు. 21న జరిగే ఉద్యోగ మేళాలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీఫాం, ఎంబీఏ, ఎంటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులు పాల్గొనాలని కోరారు. 100 కంపెనీలు పాల్గొంటాయని, 3వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని, ఈ అవకాశాన్ని కాపు యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బలిజల, కాపుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. అఖిల భారత కాపు సమాఖ్య పట్టణాధ్యక్షుడు గుండాల శ్రీనివాసులు, కార్యదర్శి సుదర్శన్, జిల్లా యూత్ అధ్యక్షుడు పాశం రామమోహన్, నాయకులు శంకర్, సూర్య, మధు, చెన్నప్ప పాల్గొన్నారు. -
బలిజ కులస్తులు ఆర్థికంగా ఎదగాలి
పెనగలూరు: రాజకీయంగా, ఆర్థికంగా బలిజ కులస్తులు ఎదగాలని బలిజ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం బలిజ సంఘం సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పెనగలూరు హైస్కూల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాపుకార్పొరేషన్ డైరక్టర్ మోదుగుల పెంచలయ్య మాట్లాడుతూ జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో బలిజలు అధికంగా ఉన్నారని, నాలుగు ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటుకు పోటీ చేసేటట్లు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. కాపు కార్పొరేషన్ ద్వారా బలిజలకు మేలు జరుగుతుందని, వచ్చే సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరికి లక్షరూపాయలు రుణాలు ఇచ్చేటట్లు ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం మాత్రమే రూ.60వేలు లోను ఇస్తారని తెలిపారు. ఐదు మంది కమిటీగా ఏర్పడితే రూ.10లక్షలు వరకు రుణసదుపాయం వచ్చేటట్లు ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. బలిజ కులస్తుంతా ఏకతాటిపై నిలబడాలన్నారు. మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య మాట్లాడుతూ బలిజలను కాంగ్రెస్ పార్టీ వాడుకుని వదిలేసిందన్నారు. బలిజలను బీసీలో చేర్చితే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఇతరులకు సహకారం అందించినప్పుడే మనం రాజకీయంగాను, ఆర్థికంగాను ఎదుగుతామన్నారు.విబేధాలు, ద్వేషాలు మరిచి ఐకమత్యంగా ఉండాలని సూచించారు. అంతకు ముందు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటికే కాపు కార్పొరేషన్ ద్వారా బలిజలు ఒక అడుగు ముందుకు వేశారన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత బలిజలు 17శాతం నుంచి 27శాతంకు పెరిగారన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు అత్తికారి వెంకటయ్య, చలపతి, చిట్వేలి మస్తాన్, పెనగలూరు మండల బలిజ సంఘం అధ్యక్షుడు నగిరి సుబ్బరాయుడు, వైస్ ప్రెసిడెంట్ కత్తి సుబ్బరాయుడు, ప్రధాన కార్యదర్శులు కానాల శంకరయ్య, జిలకర సుబ్బయ్య, బలిజసంఘం నాయకులు పాల్గొన్నారు. -
యూనిట్లు స్థాపిస్తేనే సబ్సిడీ
ఏలూరు (మెట్రో) : కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరైన వారికి యూనిట్లు స్థాపిస్తేనే సబ్సిడీ విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ అతిథిగృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనిట్లు స్థాపించకుండా సబ్సిడీ విడుదల చేస్తే ఆ సబ్సిడీని దుర్వినియోగమయ్యే అవకాశం ఉండదని, అందువల్లే సబ్సిడీ విడుదలలో జాప్యం జరుగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలో నిరుద్యోగులైన వారిని చిన్న, మధ్యతరగతి పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దేందుకు ప్రతి జిల్లాలో పరిశ్రమలపై నేడు అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో బీసీ కార్పొరేషన్ ఈడీ పెంటోజీరావు పాల్గొన్నారు. -
‘ముద్రగడ’ను హేళన చేస్తున్న మంత్రులు
► తాలూకా కాపు జన సంఘం అధ్యక్షుడు శివయ్య ► సత్తెనపల్లిలో రంగా విగ్రహానికి క్షీరాభిషేకం సత్తెనపల్లి : కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఉద్యమాన్ని హేళన చేసే మంత్రులకు పుట్టగతులు ఉండవని సత్తెనపల్లి తాలూకా కాపు జన సంఘం అధ్యక్షుడు ఆకుల శివయ్య అన్నారు. పట్టణంలోని నాగార్జున నగర్లో రంగా విగ్రహానికి శనివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ ముద్రగడ నిజాయితీగా చేస్తున్న ఉద్యమాన్ని కాపు మంత్రులు హేళనగా మాట్లాడటం తగదన్నారు. చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏడాదికి వెయ్యి కోట్లు కేటాయిస్తానని, గద్దెనెక్కి రెండేళ్లైనా పట్టించుకోలేదని, ముద్రగడ దిక్షకు దిగగానే రూ.వెయ్యి కోట్లు బడ్జెట్ కేటాయించారని చెప్పారు. ఈ కేటాయింపు కాపు మంత్రుల వల్ల కాదన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. కాంట్రాక్టర్ల కోసం పోరాడే కాపు మంత్రులు, కాపు జాతి కోసం పోరాడే ముద్రగడను అవమానించడం సబబు కాదని తెలిపారు. కాపులు ఓట్లు వేస్తేనే గెలిచి మంత్రులు అయ్యారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు కె.అర్జునరావు, మాదంశెట్టి వేదాద్రి, కొత్తా భాస్కర్, బగ్గి నరహారావు, ఆవుల వెంకటేశ్వర్లు, అంచుల సాంబశివరావు, బి.వేణు, వల్లెం నరసింహారావు, కోటేశ్వరరావు, ఎం.సుబ్బారావు, నరేంద్ర, తవిటి భావన్నారాయణ, ఆకుల హనుమంతరావు, పి.వెంకటేశ్వర్లు, నాగేంద్రబాబు, ఆకుల సుబ్బారావు, ఎ.వెంకట మల్లేశ్వరరావు, చంటి తదితరులు ఉన్నారు. -
రాజకీయ సభగా కాపు మేధోమధన సదస్సు
అకొందరు కాపు నేతల విమర్శలు గుంటూరు వెస్ట్ : చంద్రబాబుకు భజన చేస్తూ మేధోమదన సదస్సును కాస్తా రాజకీయ సభగా మార్చేశారు. కాపు కార్పొరేషన్ నిధుల వినియోగంపై కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల సంక్షేమం, అభివృద్ధి ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరులోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జిల్లా కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. తొలుత కాపు మేనేజింగ్ డెరైక్టర్ అమరేందర్ రాష్ట్ర ప్రభుత్వం కాపుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. కొంతమంది కాపు సంఘాల నాయకులు, ప్రతినిధులు లేచి ఆందోళనకు దిగారు. కాపు సంక్షేమ సంఘం నాయకుడు ఆళ్ల హరి మాట్లాడుతూ రాజకీయాలు వద్దు, సమస్యలపై చర్చించాలంటూ పట్టుబట్టారు. దీంతో సభలో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. పోలీసులు వచ్చి వారిని బయటకు లాక్కువెళ్లేందుకు ప్రయత్నించగా కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ వారిని వారించారు. కాపు కార్పొరేషన్ ఎం.డి. అమరేందర్ కలుగజేసుకుని కాపుల సంక్షేమానికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని పదేపదే విజ్ఞప్తి చేసినా పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. అనంతరం ప్రసంగించిన ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తదితరులు కూడా తమ ప్రసంగాల్లో చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తేందుకే ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. దీనిపై కొంతమంది కాపు సంఘాల నాయకులు, ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రుణాల పంపిణీలో బ్యాంకర్లు ఇబ్బందికి గురిచేస్తున్నారని, దరఖాస్తు చేసుకోవడం ఎలాగో తమకు అర్థం కావడం లేదంటూ కొంతమంది చీటీలపై రాసి వేదికపై కూర్చున్న అధికారులు, నేతలకు అందజేశారు. -
'వారి ఖాతాలో వేసుకుంటామంటే కుదరదు'
విజయవాడ: బీసీలు, కాపులు ఎవరూ అసంతృప్తి చెందకుండా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంబంధిత అధికారులకు ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన కాపు కార్పొరేషన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప, మంత్రులు పీ నారాయణ, గంటా శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, మాణిక్యాల రావు, కాపు కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కొందరు కులసంఘాల నాయకులు తమ ఖాతాలో వేసుకుంటామంటే కుదరదన్నారు. కులాల కుమ్ములాటలు లేని సమాజ స్థాపనే తన ధ్యేయం అని అన్నారు. ఆర్థికంగా వెనుక బడిన కాపు కులస్తులను ఆదుకునేందుకు కాపు కార్పొరేషన్ పనిచేస్తుందని అన్నారు. రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వారి వయసు 18-45 నుంచి 21-50కి పెంచుతున్నట్లు చెప్పారు. -
కాపు రుణాల మంజూరు.. పక్కా మోసం
► ప్రకటించింది రూ.2 లక్షలు.. ఇచ్చేది రూ.60 వేలు ► తీవ్ర అసంతృప్తిలో కాపు నాయకులు నెల్లూరు(సెంట్రల్): రుణాల మంజూరు విషయంలో ప్రభుత్వం కాపులను పక్కాగా మోసం చేసిందని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. కాపులను ఆదుకోవడానికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఇస్తామని చెప్పి సర్కారు మాటలు నీటిమూటలయ్యాయి. తీరా రుణం కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత ఒక్కొక్కరికి ఇచ్చేది రూ.60 వేలు మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. దీంతో దరఖాస్తుదారులు అవాక్కవుతున్నారు. ఇంత మోసమా అంటూ కాపు నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లెక్క ఇలాగా.. కాపు కార్పొరేషన్ కింద సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే రూ.60 వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాకు రూ.7 కోట్లు కేటాయించింది. 2462 మందికి రుణాలు ఇస్తామని ప్రకటలు గుప్పించింది. దీంతో జిల్లాలో కాపు వర్గానికి చెందిన 12,714 మంది దరఖాస్తులు చేసుకున్నారు. తీరా కాపు కార్పొరేషన్ తరపున లబ్ధిదారులకు వచ్చే సబ్సిడీ రుణం ఎంతో తెలిసి నోరు వెళ్లబెడుతున్నారు. మొత్తం బ్యాంకు ఇచ్చే నగదు రూ. 60 వేలు సబ్సిడీ రుణం కాగా అందులో కాపు కార్పొరేషన్ ఇచ్చేది రూ.30 వేలు సబ్సిడీ మాత్రమే. అందుకు గాను జన్మభూమి కమిటీ ఆమోద ముద్ర తప్పని సరిగా పెట్టారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొం దాలంటే కనీసం జన్మభూమి కమిటీకి కొంత ముట్టచెప్పాలి. ఇక దరఖాస్తులు చేసుకోవడానికి, కుల ధ్రువీకరణ పత్రం, రుణం ఫైనల్ చేసుకునే సరికి లబ్ధిదారునికి సుమారు రూ.10 వేల వరకు ఖర్చువుతోందని తెలిసింది. లబ్ధిదారుని చేతికి వచ్చేది ఇక రూ.20 వేలు మాత్రమే. విసిగిపోతున్న దరఖాస్తుదారులు అటు జన్మభూమి కమిటీల పెత్తనం, మరో పక్క చాలా వరకు బ్యాంకుల నుంచి తలనొప్పులు ఎదురౌతున్నాయని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రుణాలు మాబ్యాంకు నుంచి ఇస్తున్నాం.. జన్మభూమి కమిటీల పెత్తనం ఏమిటని పలువురు బ్యాం క్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ రుణాలు ఇస్తుందని, తమను కమిటీ సభ్యులుగా నియమించిందని తాము చెప్పిన వారికే రుణాలు ఇవ్వాలని కమిటీ సభ్యుల హుకుం జారీ చేస్తున్నారు. అటు బ్యాంకు అధికారులు, ఇటు కమిటీ సభ్యుల మధ్య కోల్ట్వార్తో దరఖాస్తుదారులు విసిగిపోతున్నారు. బ్యాంకు ల, కమిటీ సభ్యుల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే బీసీ కార్పొరేషన్ ఈడీ మాత్రం ఇవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని కాపు నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక జిల్లా అధికారి కనీ సం రుణాల విషయంలో జోక్యం చేసుకోకుండా మౌ నంగా చూస్తుండడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా కాపులను రుణాల పేరుతో ప్రభుత్వం మోసం చేసిందని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. -
కాపులందరికీ రుణాలు ఇవ్వాలి
తిరుపతి ప్రెస్‌క్లబ్: కాపు కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని బలిజ కులస్తులందరికీ రుణాలు మంజూరు చేయాలని బలిజ కులస్తుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజురాయల్ కోరారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాపుకార్పొరేషన్‌లో రుణాల కోసం అర్హత వయస్సు 20 నుంచి 50 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. మంజునాథ్ కమిషన్‌ను వేగవంతం చేసి, ఏడు నెలల్లో కాపులను బీసీలో చేర్చాలన్నారు. 2016-17 బడ్జెట్లో కాపులకు రూ.1000 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు శ్రీనివాసులు, వెంకటరత్నం, వెంకటరమణ, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కాపు రుణాలకు కోత..!
కాపుల సంక్షేమమే ధ్యేయం... కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.2 వేల కోట్లు మంజూరు చేస్తాం.. రాయితీ రుణాలు మంజూరు చేస్తామంటూ టీడీపీ నేతలు ప్రకటనలు గుప్పించారు. ఆచరణలో తుస్సు మనిపించారు. దీనిపై కాపు సామాజిక వర్గం మండిపడుతోంది. అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. రూ.2 లక్షల రుణానికి బదులు రూ.40 వేలు మంజూరు చేస్తుండంపై గగ్గోలు పెడుతోంది. శ్రీకాకుళం పాతబస్టాండ్: కాపుకార్పొరేషన్ నుంచి కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల యువతకు రూ.వేల కోట్ల రుణాలు మంజూరు చేస్తామని, ఉపాధికి ఊతమిస్తామని టీడీపీ సర్కారు ప్రకటించింది. ఆచరణలో విఫలం కావడం, రుణాలకు భారీగా కోత వేసింది. బీసీ రుణాలను గణనీయంగా తగ్గించిన ప్రభుత్వం తాజాగా 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాపు కార్పొరేషన్ రుణాలకు కూడా కోతపెట్టడంపై యువత మండిపడుతోంది. కాపు కార్పొరేషన్‌కి ఏడాదికి రూ.2 వేలు కోట్లు మంజూరు చేస్తామని టీడీపీ సర్కారు హామీ ఇచ్చింది. దీనిలో రూ.200 కోట్లు ఇస్తామని చెప్పి చివరికి రూ.వందకోట్లు మంజూరు చేసి చేతులు దులుపుకుంది. రూ.2 లక్షలకు బదులు రూ.40 వేలు... ఒక్కో యూనిట్ కింద యువతకు రూ.2 లక్షల రుణం మంజూరు చేయాలి. ఇందులో రూ.లక్ష రాయితీ లభిస్తుంది. అయితే, ప్రభుత్వం యూనిట్‌కు రూ.40 వేలే మంజూరు చేస్తుండడంపై యువకులు గగ్గోలు పెడుతున్నారు. ఈ రుణంతో ఎలాంటి స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పలేమని వాపోతున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి కాపుకార్పొరేషన్ రుణాలు జిల్లాకు 738 యూనిట్ల మంజూరు లక్ష్యంగా నిర్ణయించారు. దీనికోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. సుమారు 5 వేల మంది కాపు సామాజిక వర్గం యువతీయువకులు దరఖాస్తు చేశారు. రుణాలు వస్తాయి... స్వయం ఉపాధి పొందవచ్చని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఒక మోమోను జారీ చేసింది. రుణాలను 400 యూనిట్లకే పరిమితం చేసింది. బడ్జెట్‌ను సైతం కుదించారు. -బీసీ కార్పొరేషన్ రుణాలు కూడా 2015-16 ఆర్థిక సంవత్సరానికి తొలుత 5,547 యూనిట్లు లక్ష్యంకాగా, రూ.53 కోట్టు బడ్జెట్‌ను కేటాయించారు. తర్వాత ఆ రుణాలను ఒక మెమోతో 1942 యూనిట్లకు తగ్గించారు. బడ్జెట్‌ను కూడా రూ.15 కోట్లకు కుదించారు. కోత పెట్టడం అన్యాయం కాపు కార్పొరేషన్ ద్వారా కాపు, బలిజ, తెలగ కులాలకు చెందిన నిరుద్యోగ, నిరుపేద యువతకు అందజేసే రుణాలకు కోత వేయడం అన్యాయం. ప్రభుత్వం చెప్పిన దానికి, చేసిన దానికి సంబంధం లేదు. టీడీపీ సర్కారు ప్రతి మాటలోనూ ప్రజలను మోసం చేస్తోంది. ఈ పథకం యూనిట్ల కుదింపుతో కాపు, తెలగ. బలిజ సామాజిక వర్గాల యువత మరోసారి నష్టపోతారు. -రొక్కం సూర్యప్రకాశరావు, తెలగ సంఘం నాయకుడు పారదర్శకతలేదు.. కాపు కార్పొరేషన్ రుణాల మంజూరులో పారదర్శకతలేదు. మాయ మాటలు చెప్పి, ఆ సామాజిక వర్గాలను మోసం చేస్తున్నారు. ఉద్యమాలు చేసేటప్పుడు మాట ఇచ్చి, తరువాత మాటమార్చుతున్నారు. గత ప్రభుత్వాల కంటే కాపు, తెలగ కులస్తులకు ఈ ప్రభుత్వం మరింత మోసం చేస్తోంది. ముద్రగడ దీక్షలోఉన్నప్పుడు ఇచ్చిన మాట నేడు లేదు. -శవ్వాన ఉమామహేశ్వరి, తెలగ కుల నాయకురాలు బీసీ రుణాల ఆశ సన్నగిల్లుతోంది.. బీసీ యువతకు అందజేసే రుణాల ఆశలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. గతంతో వేలాదిమందికి ఇచ్చే రుణాలు నేడు వందల్లోకి చేరాయి. అవి కూడా ఎప్పుడు సబ్సీడీ విడుదలవుతుందో తెలియదు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి 5,542 యూనిట్లు లక్ష్యంకాగా, వాటిని 1942కి కుందించడం చాలా అన్యాయం. -జె.ఎస్.రాజు, బీసీ యువకుడు -
టీడీపీ నేతల సమ్మతి పత్రం ఉంటేనే రుణం
* కాపు కార్పొరేషన్ రుణానికి ప్రభుత్వం మెలిక * రాష్ట్ర కాపునాడు విస్మయం సాక్షి, హైదరాబాద్: కాపు రుణాల్లో పచ్చ చొక్కాలకే ప్రాధాన్యంఇస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా మరో మెలిక పెట్టింది. టీడీపీ ఎమ్మెల్యే, ఎంఎల్సీ లేదా ఆయా ప్రాంతాల్లో పేరున్న టీడీపీ నేతల సమ్మతి పత్రం ఉంటేనే రుణం మంజూరు చేయాలని కాపు కార్పొరేషన్‌కు షరతులు విధించింది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లుగా రుణం మంజూరైనా.. సమ్మతి పత్రం (విల్లింగ్ సర్టిఫికెట్) లేనిదే దరఖాస్తుదారులు కాపు కార్పొరేషన్ కార్యాలయం మెట్లెక్కే పరిస్థితి కనిపిం చడం లేదు. దీనిపై ఏపీ రాష్ట్ర కాపునాడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాపునాడు రాష్ట్ర కన్వీనర్ కఠారి అప్పారావు శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రుణాలకు రాజకీయ పార్టీలతో పనేముందని ఆయన ప్రశ్నించారు. కాపు కార్పొరేషన్లో టీడీపీ ప్రత్యక్ష జోక్యానికి ఇది నిదర్శనం కాదా? అని నిలదీశారు. ఈ ఏడాదికి యూనిట్ రుణాన్ని రూ.2 లక్షల నుంచి 60 వేలకు కుదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో రూ.30 వేలు కార్పొరేషన్, మిగతా రూ.30 వేలు బ్యాంకులు ఇస్తాయని, ఈ మొత్తం కోసం కూడా లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు తమకు తెలిసిన వారికే సమ్మతి పత్రం ఇస్తున్నారని ఆరోపించారు. రుణానికి అర్హత ఉందో లేదో నిర్ణయించేది కాపు కార్పొరేషనా లేక టీడీపీ నేతలా? అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.25 లక్షల మంది కాపు యువత రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 25 వేల మందికే ఈ ఏడాది రుణాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం దారుణంగా వంచించిందని మండిపడ్డారు. తక్షణమే అర్హులందరికీరుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతల సమ్మతి పత్రం ఉంటేనే రుణాలు ఇస్తామన్న షరతును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని కాపు కార్పొరేషన్ చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సమ్మతి పత్రం ఇచ్చేందుకు కొందరు టీడీపీ నేతలు డబ్బులు అడుగుతున్నారని కూడా కఠారి అప్పారావు ఆరోపించారు. -
కాపు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ కొరిటెపాడు (గుంటూరు) : కాపుల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమశెట్టి రామానుజయ స్పష్టం చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. 22 ఏళ్ల నుంచి కాపుల గురించి ఏనాడు మాట్లాడని ముద్రగడ పద్మనాభం రెండు నెలలుగా కాపులపై కపట కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు పనుల కోసం కాపులు నా వద్దకు రావద్దన్న ముద్రగడ నేడు కాపులపై ప్రేమ ఎందుకు చూపుతున్నారో అర్థం కావటంలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యకు సీఎంను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. సమావేశంలో టీడీపీ కాపు నాయకులు బొబ్బిలి రామారావు, యర్రగోపు నాగేశ్వరరావు, పోతురాజు ఉమాదేవి, అడపా బాబు తదితరులు పాల్గొన్నారు. -
హామీలు అమలు కాకుంటే మరో ఉద్యమం
త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం: కాపు నేత ముద్రగడ వెల్లడి నల్లజర్ల రూరల్: కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు సక్రమంగా అమలు కాకుంటే మరోసారి ఉద్యమించక తప్పదని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఆదివారం నిర్వహించిన కాపు నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అత్యంత నిరుపేదలకే రిజర్వేషన్లు అమలు చేయాలని అడుగుతున్నాం. మన ఆకలి తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. మన కోసం కాకపోయిన భవిష్యత్ తరాల కోసం రిజర్వేషన్లు సాధించాల్సి ఉంది’ అని ముద్రగడ అన్నారు. కాపు కార్పొరేషన్ రుణాలు జన్మభూమి కమిటీల పేరుతో ధనవంతులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నట్టు చాలా ప్రాంతాల నుంచి విమర్శలు వస్తున్నాయని, ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. కాపులను బీసీల్లో చేర్చే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. రాజకీయ, స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని తాకట్టు పెట్టే నైజం తనది కాదని చెప్పారు. కాపు ఉద్యమం ఏ కులానికి, మతానికి,పార్టీకీ వ్యతిరేకం కాదని, అలాగని దేనికీ అనుకూలం కూడా కాదని పునరుద్ఘాటించారు. -
కాపు రుణాలు కంటితుడుపే!
కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు అందించే సంక్షేమ రుణాలు కంటి తుడుపుగా మారుతున్నాయి. జిల్లాలో సుమారుగా 20 వేల కుటుంబాలకు చెందిన కాపు, తెలగ, బలిజ కులస్తులు ఉండగా, కేవలం 786 యూనిట్లు మాత్రమే లక్ష్యంగా తీసుకున్నారు. ఎన్నికల హామీ మేరకు ఆ కులాలకు రుణాలు కల్పించేందుకు ప్రత్యేక కమిషన్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినా, వారిక ఈ సంస్థ వల్ల ఆశించిన ప్రయోజనం కలగడం లేదు. నిబంధనాలతోపాటు.. జన్మభూమి కమిటీల జోక్యంతో లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. శ్రీకాకుళం పాతబస్టాండ్ : తెల్ల కార్డు కలిగి, గ్రామీణ ప్రాంతాలవారికి వార్షిక ఆదాయం రూ.60 వేలు, పట్టణ ప్రాంతాలవారికి రూ.75 వేల కంటే తక్కువ ఉన్నవారు కాపు రుణాలకు అర్హులు. 21నుంచి 45 సంవత్సరాల మధ్య వయ స్సు కలిగి ఉండి, కుల ధ్రువ పత్రం తప్పని సరి. యూనిటుమొత్తం రూ.2 లక్షలు కాగా, బ్యాంకు రుణం రూ.లక్ష, ప్రభుత్వం సబ్సిడీ రూ.లక్ష ఉంటుంది. మండలాని 16 యూనిట్లే... కాపు కార్పొరేషన్ ద్వారా మండలానికి కేవలం 16 యూనిట్లు కేటాయించారు. కొన్ని మండలాల్లో ఈ కులాలు తక్కువగా ఉన్నప్పటికీ, అర్బన్ ప్రాంతాల్లోనూ, ఎల్ఎన్ పేట, జి.సిగడాం, ఆర్ ఆమదాలవలస, రణస్టలం, లావేరు, పాలకొండ, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. వారికి ఈ రుణాలు అందే పరిస్థితి కన్పిండం లేదు. రాజకీయ ప్రమేయంతో మరింత ఇబ్బందిగా మారుతోంది. 4,587 దరఖాస్తులు ఈ రుణాలకు ఈ నెల 20తో గడువు ముగియగా, ఇప్పటి వరకు జిల్లాలో ఆన్లైన్లో 4,587 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ఏడు మండలాల్లో కేవలం 66 యూనిట్లకు మండల కమిటీలు సిఫారసు చేశాయి. ఎచ్చెర్ల ఒకటి, జి.సిగడాం-6, ఇచ్ఛాపురం అర్బన్-16, ఇచ్ఛాపురం రూరల్ -14, ఎల్ఎన్ పేట-25, రేగిడి -4, సారవకోట-3, మిగిలినవి రాజకీయ కారణాలతో అడ్డంకిగా మారుతున్నాయి. సిఫారసులు వస్తే అనుమతులిస్తాం మండల, పురపాలక సంఘాల నుంచి కమిటీ తీర్మానంతో కాపు రుణాల కోసం సిఫారసులు వస్తే, ఆ దరఖాస్తులను పరిశీలించి రుణం అనుమతుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని బీసీ కార్పొరేషన్ ఈడీ బి. శ్రీహరిరావు తెలిపారు. జిల్లాకు రూ.7.86 కోట్లే... జిల్లాకు రాయితీ రుణంగా రూ.7.86 కోట్లు కేటాయించారు. వీటితో 50 శాతం సబ్సిడీపై 786 యూనిట్ల మంజూరుకు లక్ష్యాంగా తీసుకున్నారు. అయితే ఆన్లైన్ దరఖాస్తుదారుల్లో అధికంగా బీసీ కాపులే ఉన్నారు. ఇక ఒంటరి కులానికి చెందిన వారు జిల్లాలో లేరు. అక్కడక్కడ కాపులు, తెలగాలు ఉన్నారు. ఇక బలిజ కులస్తులు జి.సిగడాం, వంగర మండలాల్లో ఉన్నారు. తెలగ కులస్తులు రణస్థలం, పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్నారు. వాస్తవమైన ఓసీ కాపు, తెలగ కులస్తులకు చెందిన కుటుంబాలు సుమారుగా 20వేల వరకు ఉన్నాయి. -
మాదిగలను మోసం చేసిన బాబు
మంజునాథ్ కమిషన్ పర్యటనను అడ్డుకుంటాం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు గుత్తి: ఎన్నికల సమయంలో మాదిగల చిహ్నమైన డప్పు కొట్టి తాను పెద్ద మాదిగనవుతానని చెప్పి తీరా గద్దెనెక్కాక మాదిగలను మోసం చేసి చంద్రబాబు రాష్ట్రంలోనే పెద్ద మోసగాడని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు విమర్శించారు. పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద శనివారం సాయంత్రం మాదిగల సమరభేరి బహిరంగ సభను నిర్వహించారు. అంతకు ముందు మన్రోసత్రం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా వచ్చి రాయలసీమ జిల్లాల ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఎంఎస్ రాజు మాట్లాడుతూ ఆర్థిక, రాజకీయ, సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉన్న కాపులకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి ఎస్సీ వర్గీకరణ ఎందుకు గుర్తుకులేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మంజునాథ్ కమిషన్‌ను అడ్డుకుంటామన్నారు. కాపులు ఒక రైలు కాలిస్తేనే కాపు కార్పొరేషన్‌కు చంద్రబాబు వెయ్యి కోట్లు కేటాయించారన్నారు. 100 రైళ్లు కాల్చే సత్తా మాదిగలకు ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీలపట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబును గద్దెదించే సత్తా మాల,మాదిగలకు ఉందన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి కుంటి మద్ది ఓబులేసు, రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు రమణ, జిల్లా అధ్యక్షడు కణేకల్ క్రిష్ణ, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు బొంగ సంజయ్, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నె చిరంజీవి, రాష్ట్ర నాయకులు కెరటాల మల్లేష్, జిల్లా అధికార ప్రతినిధి తిరుపాల్, జిల్లా ఉపాధ్యక్షుడు నగేష్, గుత్తి మండల,పట్టణ అధ్యక్షులు అంజన్ ప్రసాద్, సుధాకర్, టౌన్ కార్యదర్శి మధుబాబు,గౌరవాధ్యక్షుడు ఎల్లప్ప, పట్టణ ఉపాధ్యక్షుడు రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
'25న కాపులకు రుణాలు పంపిణీ చేస్తాం'
విజయవాడ: కాపు కార్పొరేషన్‌కు 3 లక్షల దరఖాస్తులు వచ్చాయని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయ పేర్కొన్నారు. ఈ నెల 25న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కాపులకు రుణాలు పంపిణీ చేస్తామని చెప్పారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపులకు 350 కోట్ల రూపాయల వరకు రుణాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రామానుజయ తెలిపారు. -
25న ఏలూరులో కాపు రుణమేళా
25న ఏలూరులో కాపు రుణమేళా రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ గుంటూరు వెస్ట్: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈ నెల 25న జరగనున్న రాష్ట్రస్థాయి కాపు రుణమేళా కార్యక్రమంలో ప్రతి లబ్ధిదారుడూ పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కోరారు. గుంటూరులోని ఎస్సీ కార్పొరేషన్ మీటింగ్ హాలులో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కులాలకు 50శాతం సబ్సిడీ ద్వారా లక్ష రూపాయల వరకు రాయితీ కల్పించి మొత్తం యూనిట్ విలువ రూ.2 లక్షలుగా నిర్ణయించి వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,65,608 దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా వచ్చాయని చెప్పారు. దరఖాస్తులను ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల ద్వారా పరిశీలించి అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికీ రుణాలు మంజూరు చేస్తుందని ఆయన వెల్లడించారు. -
ముద్రగడను కలిసిన కాపు నేతలు
కిర్లంపూడి: మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభంను మంగళవారం పలు జిల్లాల కాపు సంఘం నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారు కాపు కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేయాలన్నారు. ఆయనను కలిసిన వారిలో ప్రకాశం, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల నాయకులు కొక్కిరాల సంజీవ్‌కుమార్, లింగంపల్లి వెంకటేశ్వరరావు, అడపా నాగేంద్ర, అజిత్‌కుమార్, జిల్లా కాపు సద్భావన సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, గుండా వెంకటరమణ, గౌతు స్వామి, గోపు చంటిబాబు, ఆర్వీ సుబ్బారావు, బస్వా ప్రభాకరరావు, ఎన్ఎస్ నాయుడు రామకృష్ణ, పాలెం సురేష్, కిచ్చం బసవయ్య, గౌతు సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. -
అప్పుతిప్పలు..
కాపు కార్పొరేషన్ రుణాల కోసం క్యూ కడుతున్న నిరుద్యోగులుజిల్లావ్యాప్తంగా 44,437 దరఖాస్తుల దాఖలు మరిన్ని దాఖలయ్యే చాన్స్ కిటకిటలాడుతున్న మీ-సేవ, ఎంపీడీవో కార్యాలయాలు20 వరకూ గడువు తొలివిడత మంజూరైనయూనిట్లు 2,462 మాత్రమే ఎన్నికల వేళ చంద్రబాబు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇప్పటివరకూ అమలుకు నోచలేదు. కనీసం రుణమైనా దక్కితే.. సొంతకాళ్లపై నిలబడి.. జీవనరథాన్ని నడపవచ్చని కాపు యువత ఆశ పడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా.. కాపు కార్పొరేషన్ రుణాల కోసం.. ఆ సామాజికవర్గానికి చెందిన నిరుద్యోగులు.. దరఖాస్తులు పట్టుకుని కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. రుణాల మంజూరుపై రాష్ర్ట ప్రభుత్వం ఇంతవరకూ బ్యాంకులకు ఎటువంటి మార్గదర్శకాలూ విడుదల చేయకపోయినా.. కొండంత ఆశతో దరఖాస్తు చేసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాపు కార్పొరేషన్ రుణాల కోసం జిల్లాలోని ఆ సామాజికవర్గ నిరుద్యోగులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఒక్కో దరఖాస్తుకు సుమా రు రూ.400 ఖర్చవుతున్నా.. ఆన్‌లైన్‌తో పాటు, ఎంపీడీవో కార్యాలయాల్లో కూడా దరఖాస్తులు చేయాల్సి వస్తున్నా.. మీ- సేవ కేంద్రాలు, ఆయా కార్యాలయాల ముందు బారులు తీరుతున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడి దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాలో మంగళవారం నాటికి 44,437 దరఖాస్తులు అధికారులకు అందాయి. ఈ నెల 20 వరకూ గడువుండగా, ఈ నాలుగు రోజుల్లో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశముంది. అత్తెసరుగా నిధులు దరఖాస్తులు వేలల్లో ఉండగా.. కాపు రుణాలకు సంబంధించి రాష్ర్ట ప్రభుత్వం జిల్లాకు అత్తెసరుగానే నిధులు ఇస్తోంది. తొలివిడతగా జిల్లాకు 2,462 యూనిట్లు మాత్రమే మంజూరు చేసింది. కాపు కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేయగా, ఇందులో జిల్లాకు రూ.7.38 కోట్లు మాత్రమే దక్కనున్నా యి. సబ్సిడీతో కలిపి రూ.14.76 కోట్ల మేర రుణ సహాయం అందనుంది. వస్తున్న దరఖాస్తులతో పోలిస్తే ఈ నిధు లు ఏ మూలకూ చాలవు. కాపు కార్పొరేషన్‌కు మరో రూ.500 కోట్లు కేటాయిస్తామని, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష విరమణ సందర్భంగా రాష్ర్ట మంత్రి కె.అచ్చెన్నాయుడు ప్రకటించారు. కానీ దీనిపై ఇప్పటివరకూ ఉత్తర్వులేవీ రాలేదు. యూనిట్ విలువనుబట్టి రూ.15 వేల నుంచి రూ.2 లక్షల వరకూ 50 శాతం సబ్సిడీతో రుణాలివ్వాల్సి ఉంది. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ రుణా సహాయం అందిస్తామన్న సీఎం చంద్రబాబు హామీని సంపూర్ణంగా అమలు చేయాలంటే కనీసం రూ.200 కోట్ల సబ్సిడీ నిధులను ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. అంతమేర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందా? లేక ఏదో ఒక సాకుతో వడపోసి దరఖాస్తుల సంఖ్యను తగ్గించేస్తుందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అధికారులు మాత్రం మిగిలిన వారందరికీ మలివిడతలో రుణాలు మంజూరు చేస్తామని చెబుతున్నారు. మరోవైపు రుణ సహాయం పొందేందుకు బ్యాంకుల సమ్మతి కూడా అవసరం. అక్కడ నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టినా రుణాలు దక్కకపోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
'కాపు కమిషన్ చైర్మన్ ఓ అసమర్థుడు'
పాలకొల్లు టౌన్(పశ్చిమగోదావరి జిల్లా): కాపు కులస్తుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదని, కాపుల డిమాండ్లకు పరిష్కారాలు చూపకపోగా తూతూ మంత్రంగా కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని మాజీ ఎంపీ హరిరామజోగయ్య విమర్శించారు. 'చంద్రబాబు వైఖరిని నిరసించేందుకు కాపులంతా సన్నద్ధమవుతున్నవేళ కంటితుడుపు చర్యగా రూ. 100 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటుచేసి, టీడీపీకే చెందిన ఓ అసమర్థనాయకుడిని చైర్మన్ గా నియమించారు' అని దుయ్యబట్టారు. బీసీ కార్పొరేషన్ అనుసరిస్తున్న విధివిధానాలను యథాతథంగా కాపు కార్పొరేషన్‌కు కూడా అమలు చేయాలని శుక్రవారం విడుదలచేసిన ఒక ప్రకటనలో హరిరామజోగయ్య డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న కాపు యువకులకు నెలకు రూ. 1,500 నుంచి రూ. 2 వేలు నిరుద్యోగ భృతిగా కార్పొరేషన్ ద్వారా అందజేయాలని, తద్వారా సీఎం చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నట్లవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం బీసీలుగా ఉన్న ఏ ఇతర సామాజిక వర్గానికి నష్టం కలగకూడదనేది కాపుల ఆకాంక్షని, దానిని చంద్రబాబు గ్రహించాలని జోగయ్య పేర్కొన్నారు.