
కాపు సోదరులు పవన్ కల్యాణ్ ప్రభావానికి లోను కావద్దు. ఆయన వల్ల కాపులు అనేక ఇబ్బందులు పడ్డారు. పవన్ సినిమాలు ఆడించి అనేకమంది కాపు సోదరులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. జగన్ నుంచి కాపులను దూరం చేసేలా పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. సినీ పరిశ్రమలోనూ కాపులను విడగొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కాపులకు పెద్దన్నలాగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలబడ్డారు.
కాపులకు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పథకాలు అమలు చేస్తున్నారు. కాపునేస్తం పథకం రూపశిల్పి.. వైఎస్ జగన్. కాపులకు ఎమ్మెల్యే, ఎంపీ, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలుగా అవకాశం కల్పించారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కాపులంతా బలోపేతం కావాలంటే పవన్ ప్రభావం నుంచి బయటకు రావాలి. కాపులు ఆవేశపరులే కాదు.. ఆలోచనాపరులు కూడా.
–విజయవాడలో కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు
Comments
Please login to add a commentAdd a comment