Adapa Seshu
-
కాపు నిధులపై చర్చకు సిద్ధమా?.. పవన్‌కు అడపా శేషు సవాల్
సాక్షి, తాడేపల్లి: సీఎం జగన్ దగ్గర లక్ష కోట్లు ఉన్నాయంటూ పవన్ కల్యాణ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత అడపా శేషు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, లక్షల పుస్తకాలు చదివానంటున్న పవన్‌కు ఎన్నికల అఫిడవిట్ అంటే తెలుసా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఆస్తులు ఎంతో వివరంగా అధికారికంగా ప్రకటించారన్నారు.‘‘ఒక్కసారి ఎన్నికల కమిషన్ వెబ్సైట్లోకి వెళ్తే తెలిసిపోతుంది. సీఎం జగన్ ఆస్తులు ఎంతో తేటతెల్లంగా ఉంటే ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు చంద్రబాబు మెప్పుకోసం లక్ష కోట్లు అంటూ పిచ్చి పట్టి మాట్లాడుతున్నారు. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు ప్రకటన ఉంటుంది చూసుకో.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చూసి ఎన్నికల ప్రసంగాలు చదివే పవన్‌కు ఈ విషయంలో స్క్రిఫ్ట్ సరిగా రాసిచ్చినట్లు లేరు. అందుకే వివరం తెలియకుండా మాట్లాడుతున్నారు’’ అంటూ శేషు దుయ్యబట్టారు.2014లో చంద్రబాబుని పొగిడి 2019లో చంద్రబాబు, లోకేష్ ని తిట్టిన మాట నిజం కాదా?. మళ్లీ నేడు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి కాపు కులాన్ని గంపగుత్తగా తాకట్టుపెట్టిన ఘనత పవన్‌దే. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసం నమ్ముకున్న కులాన్ని, జనసేన కోసం శ్రమిస్తున్న జన సైనికులని తాకట్టు పెట్టిన వ్యక్తి పవన్. పార్టీ పెట్టి 14 ఏళ్లలో 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి కష్టపడి జగన్ సీఎం అయ్యాడు. రెండేళ్లు అటు ఇటుగా జనసేనను స్దాపించిన పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండుచోట్ల ప్రజల విశ్వాసం పొందలేకపోయాడు. ఇప్పుడు బీజేపీ, టీడీపీతో కలసి వచ్చినా ప్రజలు పవన్ కల్యాణ్‌ను నమ్మే పరిస్దితి లేదు’’ అని అడపా శేషు పేర్కొన్నారు.పవన్ కల్యాణ్‌కు ఆదరణ తగ్గడంతో సజ్జల రామకృష్ణారెడ్డి.. చిరంజీవిని ఏమీ అనకపోయినా చిరంజీవిని అంటే ఊరుకోనంటూ చిరంజీవిని సైతం ఇందులోకి లాగారు. చంద్రబాబు మెప్పుకోసం చిరంజీవిని సైతం రాజకీయంగా వినియోగించుకోవాలని పవన్ కల్యాణ్ చూస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు పిఠాపురంలో ఎదురుగాలి వీస్తోంది. అందుకే పవన్ కల్యాణ్‌లో ఆందోళన ప్రారంభమైంది’’ అని శేషు చెప్పారు.రాష్టంలో దమ్మున్న నాయకుడు జగన్. ఏపీలో సచివాలయాలు, వాలంటీర్లు వంటి కొత్త సంస్కరణలు తెచ్చి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసారు. పార్టీ పెట్టి 14 ఏళ్లలో ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి కష్టపడి జగన్ సీఎం అయ్యారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే జగన్‌ని ఏమని ప్రశ్నిస్తావ్ పవన్. గతంలో టీడీపీ జన్మభూమి కమిటీల పేరుతొ అవినీతి చేస్తుంటే చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించలేదు. కాపు రిజర్వేషన్ అంశంపై ముద్రగడ, చంద్రబాబుకి లేఖ రాస్తే అప్పుడు పవన్ ఎక్కడ ఉన్నాడు. సిగ్గు, శరం లేని పవన్ కల్యాణ్ చంద్రబాబు చేతిలో కీలు బొమ్మ అయ్యాడు. సిద్ధం సభలు చూస్తే పవన్‌కి సీఎం జగన్‌కు ఉన్న ఆదరణ ఏంటో అర్ధం అవుతుంది. అన్ని పార్టీలు జత కట్టినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. సీఎం జగన్‌పై దాడి చేసేదాక మీ రాజకీయాలు దిగజారిపోయాయి. కాపు సంఘాలు, నాయకులు అర్ధం చేసుకోండి.. జగన్ వల్లనే కాపులు అభివృద్ధి చెందుతారు.అసెంబ్లీ టిక్కెట్ల పరంగా చూసినా, మంత్రివర్గంలో కేటాయించినా స్దానాలు చూసినా జగన్ చిత్తశుద్ది అర్థమవుతుంది’’ అని శేషు పేర్కొన్నారు.2014, 2019, 2024 మూడో సారి పవన్‌కి ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సిగ్గులేకుండా చిరంజీవిని పవన్ కళ్యాణ్ తెర మీదకి తీసుకువస్తున్నాడు. చిరంజీవి అంటే జగన్‌కి చాలా గౌరవం ఉంది. చంద్రబాబు హయాంలో కంటే వైఎస్ జగన్ హయాంలో కాపులకు నిధులు అధికంగా విడుదల చేశారు. కాపు నిధుల అంశంలో చర్చకి పవన్ కళ్యాణ్ సిద్ధమా?. సంక్షేమ పథకాలతో కాపు మహిళలు సైతం అభివృద్ధి చెందారు. వంగవీటి రంగా మరణానికి కారణం చంద్రబాబు.. అలాంటి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు. కాపులకు చంద్రబాబు, పవన్ అన్యాయం చేస్తున్నారు.. గమనించాలి’’ అని అడపా శేషు తెలిపారు. -
పవన్ కల్యాణ్ పై కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు ఫైర్
-
మనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం జగన్ వల్లే దక్కింది: అడపా శేషు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత కాపుల పరిస్థితి మరింత దిగజారిపోయిందని విమర్శించారు ఏపీ కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు. జనసేన పార్టీ పెట్టి 11 ఏళ్లు అయ్యిందని.. ఈ కాలంలో కాపులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమిలో 21 సీట్లు తీసుకుని తనను నమ్ముకున్న వారిని పవన్ మోసం చేశాడని మండిపడ్డారు. జనసేనలో పవన్ వెనుక తిరిగిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తిరువూరులో వైఎస్సారీసీపీ కాపుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు, వైఎస్సార్సీపీ కాపు నేత ఆకుల శ్రీనివాస్ ,తిరువూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధి నల్లగట్ల స్వామిదాస్, తిరువూరు కాపు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడపా శేషు మాట్లాడుతూ.. కాపులకు అండగా ఉంటానని పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 30 మందిని ఎమ్మెల్యేలను చేసి, మంత్రి పదవులు కూడా ఇచ్చారని తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకూ కాపులను మంత్రులు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. మనం కోరుకున్న రాజ్యాధికారం జగన్ మోహన్ రెడ్డి వల్లే దక్కిందన్నారు.. ఆయనకు మనకు ఏం చేయలేదని వ్యతిరేకించాలని ప్రశ్నించారు.. సీఎం చెప్పింది చేస్తారని, పార్టీలతో పనిలేకుండా మనకు మేలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు. కొలికపూడి శ్రీనివాస్‌పై అడపా శేషు ఫైర్.. ‘రంగా హత్యకు వైఎస్సార్ కారణమని కొలికపూడి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. రంగా హత్యకు కారణం ముమ్మాటికీ టీడీపీ,చంద్రబాబే. టీడీపీ పతనం వంగవీటి మోహన్ రంగా ఆశయం. వంగవీటి మోహన్ రంగా మనకు ఇచ్చిన ఆయుధం వైఎస్ జగన్. టీడీపీకి ఓటేస్తే మళ్లీ జన్మభూమి కమిటీలొస్తాయి .పథకాలు ఆగిపోతాయి. కాపులకు తిరువూరులో అండగా నిలబడే వ్యక్తి నల్లగట్ల స్వామిదాస్. మనకు రాజకీయ గురువు రంగా ఒక్కరే. చిరంజీవి, పవన్ మనకి కేవలం సినిమా హీరోలు మాత్రమే. వంగవీటి మోహన రంగా ముఖ్యమంత్రి అవుతారని తెలిసే టీడీపీ, చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారు. పవన్ జనసేన పెట్టగానే చంద్రబాబు తన దొడ్లో కట్టేసుకున్నాడు’ అని అడపా శేషు మండిపడ్డారు. -
చంద్రబాబు చేతిలో పవన్ ఓ జోకర్: అడపా శేషు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు చేతిలో పవన్ కల్యాణ్ ఓ జోకర్ అని మండిపడ్డారు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. జనసేన పార్టీని పెట్టించిందే చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు కాపులను ఎదగకుండా చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు తీసుకుని, కాపులను యాచించే స్థాయికి పవన్ దిగజార్చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో రూ. కోటి 20 లక్షలతో నిర్మించిన వంగవీటి మోహన రంగా కాపు కమ్యూనిటీ భవనాన్ని గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు,మేయర్ రాయన భాగ్యలక్ష్మి ,డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడపా శేషు మాట్లాడుతూ.. తనను నమ్ముకున్న జనసేన కార్యకర్తలు , వీరమహిళలకు పవన్ ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు. పవన్ పేరుకే పవర్ స్టార్ అని.. పొత్తుల విషయంలో ప్యాకేజీ స్టార్ అయిపోయాడని విమర్శించారు. పవన్ ముఖ్యమంత్రి అవుతాడని కాపులంతా నమ్మారని, కాపులకు నమ్మకద్రోహం చేసిన వ్యక్తి పవన్ అని మండిపడ్డారు. పవన్ ఈ రాష్ట్రానికి చుట్టంచూపుగా వచ్చి వెళ్తాడని ఎద్దేవా చేశారు. ఆయనను కాపు సోదరులు ఎవరూ నమ్మొద్దని హితవు పలికారు. టీడీపీ,జనసేన, బీజేపీకి ఏపీతో సంబంధం లేదన్నారు. ఈ రాష్ట్ర ప్రజలను తన కుటుంబంగా భావిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కాపులంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. చదవండి: ఫైనల్‌గా ఫిక్స్.. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ -
కాపులను బాబుకు అమ్మేస్తున్న పవన్
సాక్షి, అమరావతి : చంద్రబాబు హయాంలో కాపుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు విమర్శించారు. బుధవారం తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జీవోల్లో కేటాయింపులు తప్ప కాపుల అభ్యున్నతికి వాస్తవంగా ఖర్చు చేసింది శూన్యమన్నారు. అప్పటి ప్రభుత్వాన్ని నమ్ముకుని విదేశీ విద్యకు వెళ్లిన ఎందరో పేదింటి కాపు విద్యార్థులు నిధులు విడుదల చేయకపోవడంతో అప్పులపాలయ్యారని గుర్తు చేశారు. కాపు భవనాల నిర్మాణాలంటూ ఎల్లో మీడియాలో ఊదరగొట్టడం తప్ప ఒక్కపైసా కూడా ఇవ్వలేదన్నారు. సీఎం జగన్ వచ్చాక కాపుల సంక్షేమానికి ఏకంగా రూ.39,317.80 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. అయినా, ఈనాడు పత్రిక మాత్రం కాపులను తప్పుదారి పట్టేంచేలా అసత్య కథనాలు ప్రచురిస్తోందని దుయ్యబట్టారు. చంద్రబాబుకు తొత్తుగా మారిన పవన్ ఏకంగా కాపులను అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కాపు ఎమ్మెల్యేలు బలంగా ఉన్నచోట మాత్రమే పవన్‌ను ఉపయోగిస్తున్నారని చెప్పారు. దమ్ముంటే పవన్.. కాపులపై కాకుండా ఇతర కులాలపై పోటీ చేయాలని సవాల్ చేశారు. కాపులను రాజ్యాధికారం దిశగా తీసుకెళ్తారని నమ్మిన కాపునాయకులు, జేఏసీల ఆశలను పవన్ నట్టేట ముంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులంటే పవన్ ఒక్కడేనా? ఇతర కాపులు రాజకీయ పదవులు చేయకూడదా? అంటూ నిలదీశారు. భీమవరంలో జనసేన పార్టీ కార్యాలయానికి స్థలం ఇవ్వట్లేదని అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. 30 మంది కాపు, బలిజలను ఎమ్మెల్యేలను చేయడంతో పాటు మంత్రులను చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతోందన్నారు. చంద్రబాబు మోసానికి, అరాచకత్వానికి నిర్వచనమని విశాఖలో భూకబ్జాలు, విజయవాడలో దేవస్థానం భూములను ఒక సామాజిక వర్గానికి దోచిపెట్టారని దుయ్యబట్టారు. రంగా నుంచి ముద్రగడ పద్మనాభం వరకు, తాజాగా జనసేన కార్యకర్తలు సైతం చంద్రబాబు కుట్రలకు బలైపోయారని.. అందుకే కాపులంతా వైఎస్సార్సీపీ వైపే ఉన్నారన్నారు. కాపులకు కొమ్ముకాస్తున్న సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేస్తూ, కులాల్లో చిచ్చుపెట్టేలా వార్తలు ప్రచురిస్తున్న ఈనాడుపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పేదలను అణగదొక్కేందుకు అవినీతిపరులు ఏకమయ్యారు
-
పవన్ కల్యాణ్.. టీడీపీ తొత్తు: అడపా శేషు
-
పవన్ కల్యాణ్.. టీడీపీ తొత్తు: అడపా శేషు
సాక్షి, తాడేపల్లి: ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా అధికారంలోకి రావాలనేది చంద్రబాబు ఆలోచన అని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అవే మాటలు మాట్లాడుతున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ పూర్తిగా దిగజారిపోయాడని, పూర్తిగా రూపాంతరం చెంది జన సైనికులను త్యాగాలకు సిద్ధం కావాలంటున్నారని మండిపడ్డారు. ‘‘పవన్ నీచ రాజకీయాలను గమనించాలి. భీమవరంలో పవన్ కళ్యాణ్ ఎవరిని కలిసాడో జన సైనికులు ఆలోచించాలి. టీడీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ పవన్ కలిశాడు. జనసేన, కాపు నాయకుల ఇళ్లకు పవన్ ఎప్పుడైనా వెళ్ళారా?. కాపులకు రాజ్యాధికారం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారనే చంద్రబాబు రంగాను అంతమొందించారు. పవన్ జనసేనను మర్చిపోయి సీనియర్ టీడీపీ నాయకుడిలా ప్రవర్తిస్తున్నారు. ఢిల్లీ వెళ్లి చీవాట్లు తిన్నానని చెప్పుకుంటున్నారు. పవన్ అసలు ఢిల్లీ వెళ్లి ఎవరిని కలిశాడు?ఎవరి కోసం కలిశాడు? అంటూ అడపా శేషు దుయ్యబట్టారు. ‘‘కాపులను ఉద్ధరించడానికి, జన సైనికులను ఎమ్మెల్యేలుగా చేయటానికి వెళ్లాడా?. పాతవాళ్లు పోతారు.. కొత్తవాళ్లు వస్తారని పవన్ చెప్తున్నారు. టీడీపీ నేతలను చేర్చుకోవడానికి పవన్ సిద్ధమయ్యారు. కాపులు తనకి ఓటు వేయరని, తనను నమ్మరని పవన్ ముందే చెప్పారు. పవన్ జనసేనను టీడీపీలో విలీనం చేస్తారనే అనుమానం కలుగుతోంది. పవన్ తెలుగుదేశం తొత్తు’’ అంటూ ఆయన ధ్వజమెత్తారు. ‘‘పవన్ వల్ల కులం భ్రష్టుపడుతుందని జోగయ్య లేఖ ద్వారా తెలిపారు. తెర వెనుక జరిగిన కుంభకోణాన్ని బయటపెట్టాలి. జగన్ పాలనలోని సంస్కరణలు కళ్లకు కనిపించట్లేదా?. మత్తులో ఉన్నాడు కాబట్టే రంగాను హత్య చేసిన టీడీపీతో పవన్ జతకట్టాడు. పేదల రక్తాన్ని పీల్చేసిన వ్యక్తి చంద్రబాబు. ప్రజాసొమ్మును పెత్తందార్లకు దోచిన వ్యక్తి చంద్రబాబు. రాబోయే కురుక్షేత్రంలో కాపులంతా టీడీపీని భూస్థాపితం చేయాలి’’ అంటూ అడపా శేషు పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: సిద్ధంగా ఉన్నారా? నాలుగో సభ ఎక్కడంటే? -
అప్పుడు ఏం మాట్లాడావో గుర్తు చేసుకో పవన్: అడపా శేషు
సాక్షి, విజయవాడ: పవన్‌కు సిద్ధాంతాలు.. విలువలు లేవంటూ దుయ్యబట్టారు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐవీ కృష్ణారావు రాజధాని భూములపై పుస్తకం రాసినప్పుడు పవన్ ఏం మాట్లాడాడో గుర్తు చేసుకోవాలన్నారు. రాజధాని పేరుతో ఒక సామాజికవర్గం భూములు దోపిడీ చేస్తుందని మాట్లాడిన మాటలు మర్చిపోయావా పవన్ అంటూ అడపా శేషు నిలదీశారు. దోపిడీని అరికడతానని చెప్పి చంద్రబాబు పంచన చేరావా పవన్. చంద్రబాబు చేసిన దుర్మార్గాలపై నువ్వు ఏం మాట్లాడావో మర్చిపోయావా? చంద్రబాబు, లోకేష్‌పై నువ్వెంత నీచంగా మాట్లాడావో మర్చిపోయావా?. చంద్రబాబు దోపిడీ దొంగల ముఠాకు నాయకుడివి అన్నావ్ గుర్తులేదా?. పవన్‌కు తన మాట మీద నిలకడ లేదు. కాపులను చంద్రబాబుకు తాకట్టు పెట్టడానికి తప్ప నువ్వు దేనికీ పనికిరావు’’ అంటూ పవన్‌ను అడపా శేషు దుయ్యబట్టారు. ఏం సాధిద్ధామని చంద్రబాబు పంచన చేరావ్ పవన్. కాపులను ఎలా బేరం పెట్టావో అందరూ చూస్తున్నారు. అడుక్కోవద్దు...శాసించు అని హరిరామ జోగయ్య చెప్పింది వినిపించలేదా?. చంద్రబాబు నీకెన్ని సీట్లిస్తాడు..అందులో నువ్వెన్ని కాపులకు ఇస్తున్నావో చెప్పు.. నీకు దమ్ము ధైర్యం ఉంటే హరిరామజోగయ్య లేఖలో చెప్పిన పేర్లన్నీ ప్రకటించు. పవన్ నువ్వు క్లాస్‌గా కమ్మగా ఉన్నావని ప్రజలందరీకీ తెలుసు. పేద, బడుగు, బలహీన వర్గాల మాస్ లీడర్ సీఎం జగన్’’ అని అడపా శేషు పేర్కొన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబుకు మల్లాది విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ -
పవన్ కళ్యాణ్ పై కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు ఫైర్
-
దొంగల ముఠాపై సీఎం జగన్ చేసే పోరాటానికి మేమంతా సిద్ధం: అడపాశేషు
-
‘కాపు కులాన్ని నీకు ఏమైనా అద్దెకు ఇచ్చామా?’
సాక్షి,తాడేపల్లి: కాపు కులాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడానికి పవన్ కళ్యాణ్ ఎవరని ప్రశ్నించారు కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు. కాపు కులాన్ని ఏమైనా పవన్‌కు అద్దెకు ఇచ్చామా? అంటూ నిలదీశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్మీట్లో అడపా శేషు మాట్లాడుతూ.. కాపులను అణచి వేసేందుకు బాబు కుట్ర చేస్తుంటే అందులో పవన్ కళ్యాణ్ భాగస్తుడయ్యాడని ధ్వజమెత్తారు. అడపా శేషు ఇంకా ఏమన్నారంటే.. కాపుల ద్రోహి పవన్‌కళ్యాణ్ రాష్ట్రంలో కాపు సోదరులకు పవన్ ఏం న్యాయం చేశాడు? వారికి పవన్ చేసిన అన్యాయం గురించి మాట్లాడతాను. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ముసుగులో నుంచి పుట్టిందా? లేదా?. దీనికి సమాధానం చెప్పాలి. మాట్లాడితే వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకుల మీద పవన్‌కళ్యాణ్ చేస్తున్న దాడి గమనించండి. నిజానికి పవన్‌కళ్యాణ్‌కు రాష్ట్రంలో ఇల్లు లేదు. ఓటు లేదు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడ ఓటు లేదు. ఇప్పుడు ఆయన భార్య అసలు భారతీయురాలే కాదు. ఆయన రెండో భార్య పిల్లలకు కూడా ఇక్కడ ఓటు హక్కు లేదు.కేవలం చంద్రబాబుకు మేలు చేయడం కోసమే పవన్ రాజకీయాలు చేస్తున్నాడు. చంద్రబాబును సీఎం చేయడం కోసమే పవన్ ఇక్కడకు చుట్టపుచూపుగా వస్తున్నాడు. అందుకే పవన్‌కళ్యాణ్ కాపుల ద్రోహి పవన్ ఆనాడెందుకు ప్రశ్నించలేదు? కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పర్యటించి, టార్గెట్ రాజకీయాలు చేస్తున్నాడు. కాపు ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా పవన్ రాజకీయాలు చేస్తున్నాడు. దీన్ని గమనించాలి. ప్రశ్నించేందుకే తాను పార్టీ పెట్టినట్లు చెప్పే పవన్‌కళ్యాణ్, నాడు వంగవీటి రంగాను హత్య చేసిన తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయడం సిగ్గుచేటు. ముద్రగడ పద్మనాభం ఆత్మగౌరవాన్ని రోడ్డుకీడ్చినా కనీసం ప్రశ్నించలేదు.వంగవీటి రంగా గారిని చంపితే.. అది ఫ్యాక్షన్ హత్య అన్నాడు. అదే అక్కడ పరిటాల రవి హత్యను ప్రత్యర్థులు చేసిన హత్య అనడం దారుణం.ఎవరిది ఫ్యాక్షన్ హత్య? పవన్ అలా మాట్లాడడం సరికాదు. కాబట్టి ఆయన మాటలను గమనించమని కోరుతున్నాను. మనకూ ఆత్మ గౌరవం, పౌరుషం ఉంది. రొమ్ము విడిచి చెప్పగలం. కానీ ఎందుకు ఆ పని చేయలేకపోతున్నాం. కాపులపై చంద్రబాబు కుట్ర అటు ఉత్తరాంధ్ర మొదలు ఇటు రాయలసీమ జిల్లాల వరకు మనకు ఎందరో కాపు నాయకులు ఉన్నారు. వారు జిల్లాల్లో ఆధిపత్యం చేస్తుంటే.. దాన్ని అణిచి వేయడం కోసం చంద్రబాబు, పవన్చేత జనసేన పార్టీ పెట్టించి రాజకీయం చేస్తున్నాడు. అందుకే పవన్‌కళ్యాణ్ ఆయా ప్రాంతాల్లోనే పర్యటిస్తున్నాడు. కాబట్టి కాపు సోదరులు దీన్ని గమనించి, ప్రశ్నించాలని కాపు సోదరులను కోరుతున్నాను. గత మూడు రోజులుగా రాజమండ్రి రూరల్‌లో పవన్ పర్యటిస్తున్నాడు. అక్కడే ఎందుకు? కేవలం కాపు సామాజికవర్గం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే పర్యటించడం ఎందుకు? జనసేన ప్రారంభించిన రోజున కాపు సోదరులకు రాజ్యాధికార సాధన కోసం అందరూ అనుకున్నారు. కానీ కాపులు ఎక్కడా రాజ్యాధికారంలో ఉండకూడదన్నది చంద్రబాబు కుట్ర. అందుకే పవన్‌ను ఆయా చోట్లకు పంపిస్తున్నారు. పవన్.. నీవా కాపులను కాపాడేది! గతంలో మహానేత వైయస్సార్‌గారు మాత్రమే కాపులకు పెద్దపీట వేశారు. వారికి అన్నింటా ప్రాథాన్యత ఇచ్చారు. అదే చంద్రబాబునాయుడు, కాపు సోదరులను ఎక్కడికక్కడ అణిచివేసి, లోపల వేయించాడు. ఇటీవలే నారా లోకేష్ ఒక మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్ సీఎం చంద్రబాబు మాత్రమే అన్నారు. కానీ, పవన్ కనీసం దాన్ని కూడా ప్రశ్నించలేదు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరిగాయి. వాటిని పవన్ కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు వారాలబాబు మాదిరిగా రాష్ట్రానికి వారం రోజులకో, నెలకో ఒకసారి వస్తూ పవన్ రాజకీయాలు చేస్తున్నాడు. ఖమ్మంలో మంత్రి శ్రీ అంబటి రాంబాబుపై ఒక సామాజికవర్గం దాడి చేస్తే.. పవన్ కనీసం పట్టించుకోలేదు. పవన్.. నీవా కాపులను కాపాడేది? నిన్ను నమ్ముకున్న కాపు సోదరులను ఏనాడైనా పట్టించుకున్నావా? వారికి కనీసం టికెట్లు అయినా ఇప్పించావా? వారిని ఎక్కడైనా కనీసం ఆదుకున్నావా? అసలు దేనికి నీ ప్రయాణం? కేవలం చంద్రబాబు ప్రయోజనాలు కాపాడడమేనా? కాపు సోదరులు గుర్తించాలి పవన్.. నీకంటూ రాష్ట్రంలో సొంత నియోజకవర్గం ఉందా? కనీసం ఇల్లైనా ఉందా?. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కాపు సోదరులు పోరాడుతున్నారు. అలాంటి వారిని పవన్‌కళ్యాణ్ తొక్కేస్తున్నాడు. కాబట్టి, కాపు పోదరులు ఒకసారి వాస్తవాలు గుర్తించాలి. కాపులకు ఎవరు కావాలి? సీఎం జగన్ కాపు సోదరులకు రాజకీయ పదవులు ఇవ్వడమే కాకుండా, వారికి ఆర్థిక పరిపుష్టత కూడా కలిగించారు. ఇన్ని పదవులు ఇచ్చిన జగన్‌గారు కావాలా? లేక కాపులను ఏకతాటిపై అమ్మేస్తున్న పవన్‌కళ్యాణ్ కావాలా? ఒక్కసారి ఆలోచించమని కాపు సోదరులను కోరుతున్నాను. ఒక్కసారి కళ్లు తెరవండి. పవన్ అనైతిక రాజకీయాలను నిలదీయండి. టీడీపీలో భాగస్తుడు నువ్వే దైవం, నువ్వే సర్వస్వం అని తిరిగిన జన సైనికులు, వీర నారీమణుల గురించి ఏనాడైనా పట్టించుకున్నావా? వారి గురించి ఏం చెప్పదల్చుకున్నావ్?. వారికి ఒక్క పదవి అయినా ఇచ్చావా? వారి ఆర్థిక స్థితి ఏమిటన్నది పట్టించుకున్నావా?. కనీసం నీ పర్యటనల్లో ఒక్క జన సైనికుడితో అయినా మాట్లాడావా? పార్టీని, కులాన్ని పక్కన పెట్టేసి కేవలం చంద్రబాబునాయుడు పార్టీలో ఒక భాగస్తుడవయ్యావు. అందుకు ఈ ఫోటోలే నిదర్శనం.. (అంటూ టీడీపీ ప్రచురించిన పోస్టర్లు చూపిన అడపా శేషు). అసలు పవన్‌కళ్యాణ్ జనసేన నాయకుడా? లేక తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడా? లేకుంటే మేం చెబుతున్నట్లు చంద్రబాబు దత్తపుత్రుడా?. నిజానికి పవన్‌కళ్యాణ్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. కాపుల అభ్యున్నతిని అడ్డుకుంటున్న సామాజికవర్గ నాయకులను కట్టడి చేసే ప్రయత్నం కూడా చేయడం లేదు. కాపు కులాన్ని అద్దెకు ఇచ్చామా? ఇవాళ రాష్ట్రంలో చాలా చోట్ల టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తాము ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడితే, ఈరోజు అదే పార్టీని చంద్రబాబుకు, టీడీపీకి ఇస్తున్నావని వారంటే.. కనీసం సమాధానం చెప్పడం లేదు. నీకు కాపు కులాన్ని అద్దెకు ఇచ్చామా? నీవేమైనా పోటుగాడివా? కాపులను ఉద్ధరిస్తారని నిన్ను నమ్మారనుకుంటున్నావా? కాపులకు ఆర్థిక పరిపుష్టి కల్పించి, ఆదుకున్న నాయకుడు జగన్‌గారు మాత్రమే. కోవిడ్ సంక్షోభంలో కూడా వారిని ఆయన ఎంతో ఆదుకున్నారు.అదే పేదల రక్తం తాగిన చంద్రబాబుకు, పవన్ కొమ్ము కాస్తున్నాడు. కాబట్టి ఆలోచించమని కోరుతున్నాను. చంద్రబాబు ఒక్కటైనా చెప్పుకోగలరా? సీఎం జగన్ ఎక్కడికి పోయినా.. అక్కడి ప్రజలు ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఊరూరా ప్రతి ఇంట్లో నాడు వైయస్సార్, ఇప్పుడు సీఎం శ్రీ వైయస్ జగన్ వల్ల ప్రయోజనం పొందిన వారున్నారు. అదే లోకేష్ 3 వేల కిలోమీటర్లు తిరిగాడంటున్నారు కదా? కనీసం ఒక్క ఊరిలో అయినా, తన తండ్రి వల్ల ఒక్క మేలు జరిగిందని చెప్పుకోగలరా? కనీసం ఒక్క కుటుంబం అయినా ముందుకొచ్చి, తమకు చంద్రబాబు వల్ల మేలు జరిగిందని చెప్పారా?. కాపులకు నాడు–నేడు వారితోనే మేలు పేదల సంక్షేమం కోసం నాడు వైయస్సార్, ఇప్పుడు జగన్‌గారు ఎంతో చేశారు. ఇంకా చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైయస్సార్ కుటుంబానికి పేదలంటే మక్కువ. వారికి మేలు చేయడం కోసం ఎక్కడా వెనకడుగు వేయరు. అదే చంద్రబాబు ఏం చేశాడనేది చూస్తే.. పేదల రక్తంతో ఎన్నో రాష్ట్రాలలో తన సామాజిక వర్గానికి కోటలు కట్టించాడు. పవన్‌కళ్యాణ్‌తో అవసరం ఉంటే, ఛార్టర్డ్ ఫ్లైట్ పెట్టించి, పవన్‌కు ఇక్కడకు రప్పిస్తున్నాడు.కాపుల్లో కానీ, ఇతర కులాల్లోని నిరుపేదలను కానీ ఆదుకోవడంలో జగన్‌గారు ఎంతో కృషి చేశారు. పవన్ ఏనాడు ఈ దిశలో పని చేయలేదు. కేవలం చంద్రబాబుకు మేలు చేయడం కోసం కాపు సామాజికవర్గం ఉన్న ప్రాంతాల్లో తిరుగుతూ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. పవన్ రాజకీయాలు చేస్తున్నాడు. కాపులను ఎవరు గెలిపిస్తున్నారు? వారికి ఎవరు ఎక్కువ సీట్లు ఇస్తున్నారు? వారికి ఎవరు ఎక్కువ పదవులు ఇస్తున్నారు? ఇవన్నీ ఆలోచించమని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అదే సమయంలో పవన్‌కళ్యాణ్ చేస్తున్న అనైతిక రాజకీయాలను ప్రశ్నించమని కోరుతున్నాను. -
‘జన సైనికులు అప్పుడు నమ్మలేదు.. ఇప్పుడు బాధపడుతున్నారు’
సాక్షి, తాడేపల్లి: పేదల రక్తం పీల్చే వ్యక్తి చంద్రబాబు అయితే, ప్రజల కోసం తన రక్తాన్ని ధారపోసే వ్యక్తి సీఎం జగన్ అని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు, లోకేష్, పవన్‌లకు ఈ రాష్ట్ర ప్రజల గురించి అవసరం లేదంటూ దుయ్యబట్టారు. అర్జంట్‌గా అధికారంలోకి రావాలన్నదే వారి ఆలోచన. తన వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే చూసుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్. జనసేన శ్రేణుల సమస్యలు కూడా పవన్‌కు అవసరం లేదని ధ్వజమెత్తారు. పవన్‌కు కావాల్సిందల్లా కేవలం చంద్రబాబు, లోకేష్ బాగోగులే. జనసేన పార్టీ పెట్టించింది చంద్రబాబేనని మేం ఎప్పుడో చెప్పాం. జన సైనికులు అప్పుడు నమ్మలేదు.. ఇప్పుడు బాధపడుతున్నారు. పవన్ సీనియర్ టీడీపీ కార్యకర్తలా తయారయ్యాడు. పవన్ చేస్తున్న పనులతో జన సైనికులు అవమానంతో కుమిలిపోతున్నారు. చంద్రబాబు లేకపోతే తన మనుగడ సాగదని పవన్ ఆలోచన. పవన్ తన పక్కన లేకపోతే జనం రారేమోనని చంద్రబాబు భయం. చంద్రబాబు,లోకేష్,పవన్ ను నమ్మే పరిస్థితిలో జనం లేరు యువగళం ముగింపు సభ అట్టర్ ప్లాఫ్’’ అంటూ అడపా శేషు వ్యాఖ్యానించారు. చంద్రబాబే సీఎం అభ్యర్ధని ఓ ఇంటర్యూలో లోకేష్ స్పష్టంగా చెప్పాడు. పవన్‌ను ప్యాకేజ్ స్టార్ అంటే మమ్మల్ని అందరూ విమర్శించారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఎవరు సమాధానం చెబుతారు?. పవన్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే. జన సైనికులు, కాపు సామాజికవర్గ పెద్దలు ఆలోచన చేయాలి. భారతదేశంలో ఎవరూ చేయలేనంత గొప్పగా సీఎం జగన్ సంస్కరణలున్నాయి. చంద్రబాబు, పవన్, లోకేష్ చేస్తున్న రాజకీయం చూస్తుంటే సిగ్గేస్తోంది’’ అని శేషు దుయ్యబట్టారు. ప్రజల రక్తాన్ని పీల్చి కోట్లు సంపాదించిన వ్యక్తి చంద్రబాబు. ఆ సంపద కోసం ఆశపడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకి పవన్ అమ్ముడుపోయాడు. తెలంగాణ ఎన్నికల్లో ఎనిమిదిచోట్ల పోటీచేసిన పవన్ పార్టీ తుస్సుమంది. తనను నమ్ముకున్నవారిని ఇంకా పిచ్చోళ్లను చేసే ప్రయత్నంలో పవన్ ఉన్నాడు. కాపులకు ప్రాధాన్యం కల్పించింది వైఎస్సార్ కుటుంబమే. కాపులను రోడ్ల పై ఈడ్చి తన్నించిన చరిత్ర చంద్రబాబుది. కాపులకు కొమ్ముకాసిందెవరో.. అమ్ముకున్నదెవరో తెలుసుకోండి. ఛాలెంజ్ చేసి చెబుతున్నా.. కాపులను పవన్.. చంద్రబాబుకు అమ్మేశాడు’’ అంటూ అడపా శేషు ధ్వజమెత్తారు. సీఎం జగన్ 2 వేల కోట్లు కాపు నేస్తానికి ఖర్చు చేశారు. పవన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే తనకు ఎన్ని సీట్లిస్తారో ప్రకటించాలి. అచ్చెన్నాయుడికి టిక్కెట్ ఇవ్వనని చెప్పే దమ్ము చంద్రబాబుకి ఉందా?. సమర్ధవంతమైన వ్యక్తిని ప్రకటించే దమ్ము సీఎం జగన్‌కే ఉంది. సీఎం జగన్ సింహంలా సింగిల్ గానే వస్తాడు.. 175 సీట్లలో గెలుస్తారు’’ అని అడపా శేషు పేర్కొన్నారు. -
దయచేసి పవన్ ను డాక్టర్ కి చూపించండి..
-
ఒక సినిమా పోతే మరో సినిమా.. అదే పవన్ విధానం: అడపా శేషు
సాక్షి, తాడేపల్లి: తెలంగాణలో డిపాజిట్లు కోల్పోవడంతో పవన్‌కు మతి భ్రమించిందని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో పవన్‌కు ప్రజలు ఓటేయలేదని, అక్కడ ఓడిపోగానే వైజాగ్ వచ్చి ఊగిపోతున్నాడని మండిపడ్డారు. ‘‘తెలంగాణలో బీజేపీతో ఏపీలో టీడీపీతో పవన్ జతకలిశాడు. పవన్ తీరు అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాలాగే ఉంది. అక్కడ పోతే బీజేపీ పోయిందని వదిలేశాడు. ఇక్కడ చంద్రబాబు కోసం ఆరాట పడుతున్నాడు. ఒక సినిమా పోతే మరో సినిమా అదే పవన్ విధానం. కాపులను చంద్రబాబుకు తాకట్టు పెట్టాడు. ఏపీకి ఏం చేస్తాడని పవన్‌ను ప్రజలు నమ్మాలి’’ అంటూ శేషు ధ్వజమెత్తారు. చంద్రబాబుకు నిజంగా దమ్ముంటే ఎందుకు క్యాండెట్‌ను పెట్టలేదు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఫైనాన్షియర్ మాత్రమే. రేవంత్ గెలిస్తే ఏపీలో ఒక సామాజిక వర్గం సంకలు గుద్దుకుంటోంది, పవన్‌ను నమ్ముకున్నందుకు తెలంగాణలో బీజేపీకి పట్టిన గతే ఏపీలో టీడీపీకి పడుతుంది. అధికారం, అహంకారానికి అసలైన రూపం చంద్రబాబు. సెక్రటేరియట్ సాక్షిగా నాయిబ్రాహ్మణుల తోకలు కట్ చేస్తానన్న వ్యక్తి చంద్రబాబు. సీఎం జగన్ గురించి మాట్లాడే స్థాయి పవన్‌కు లేదు’’ అని అడపా శేషు మండిపడ్డారు. పవన్ ఉన్నత వర్గాలకు కొమ్ము కాస్తున్నాడు. ఊగిపోతూ పవన్ చెప్పే ఉపన్యాసాలకు కాలం చెల్లింది. సీఎం జగన్ అందించిన సంక్షేమం వల్ల కోవిడ్ సమయంలో ఎంతో మంది ప్రాణాలతో నిలబడ్డారు. సీఎం జగన్‌కి చిరునవ్వు తప్ప.. అహంకారమంటే తెలియదు. సినిమాల నుంచి వచ్చాడు కాబట్టి ఎవరు నష్టపోయినా పవన్‌కు పట్టదు. పవన్ కచ్చితంగా జనసేన శ్రేణులకు సమాధానం చెప్పే రోజు వస్తుంది. పవన్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే ప్రతీ ఒక్క వైసీపీ కార్యకర్త మాట్లాడాల్సి వస్తుంది’’ అడపా శేషు హెచ్చరించారు. చదవండి: బాబు కూల్చారు.. జగన్ పునర్నిర్మించారు -
తెలంగాణాలో నీ పరిస్థితి...పవన్ కళ్యాణ్ కి అదిరిపోయే కౌంటర్
-
కాంగ్రెస్ గెలుపు కోసం ఒకడు బీజేపీ గెలుపు కోసం ఇంకొకడు..!
-
హరిరామజోగయ్య.. నీ పుస్తకంలో ఏం రాశావో గుర్తులేదా?: అడపా శేషు
సాక్షి, తాడేపల్లి: పవన్ కళ్యాణ్‌కు దమ్ముంటే మూడో భార్య పేరుతో ఉన్న ఇళ్లు, ఆస్తుల వివరాలు బయట పెట్టాలని కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనసేన నేత హరిరామజోగయ్యపై మండిపడ్డారు. వంగవీటి రంగ హత్య వెనుక చంద్రబాబు ఉన్నారని నీ పుస్తకంలో రాయలేదా?. ఇప్పుడు చంద్రబాబు అంత కమ్మగా ఎందుకు కనిపిస్తున్నారంటూ నిలదీశారు. ‘‘శాండ్, మైన్స్, వైన్స్ అన్నీ చంద్రబాబు సామాజిక వర్గం దోచుకున్న సంగతి తెలీదా?. అలాంటి వ్యక్తికి పవన్ మద్దతు ఇవ్వటం ద్వారా ఎంత వాటా పొందారు?. పవన్ కళ్యాణ్ రాజధానిలో బినామీల పేరుతో ఎన్ని ఆస్తులు సమకూర్చారో చెప్పాలి’’ అని శేషు డిమాండ్ చేశారు. మహిళలంటే సీఎం జగన్‌కి ఎంతో గౌరవం. అందుకే మహిళల పేరుతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న గజ దొంగ జైల్లో ఉన్నాడు. చిల్లర దొంగ పవన్ బయట ఉన్నారు’’ అంటూ అడపా శేషు మండిపడ్డారు. చదవండి: చంద్రబాబు యాక్టివ్‌గా ఉన్నారు: వైద్యులు -
‘జైల్లో బాబు.. టీడీపీ సీఎం అభ్యర్థి లోకేషా, బాలకృష్ణా, పవన్ కళ్యాణా’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నేతలు, ఆయన కుటుంబ సభ్యుల కంటే పవన్ కల్యాణ్ ఎక్కువగా స్పందించారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్నూల్ నుంచి చంద్రబాబును తాడేపల్లి తీసుకొచ్చే లోపు లూథ్రాకి ఒక ఫ్లైట్, పవన్‌కి ఒక ఫ్లైట్ బుక్ చేసారు. కేసులను మభ్యపెట్టడానికి లూథ్రా, ప్రజల్ని మభ్యపెట్టడానికి పవన్ కల్యాణ్ ఉన్నారని ప్రజలకు అర్థమైందన్నారు. ‘‘నడి రోడ్డుపై పడుకుని చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ తాపత్రయపడ్డారు. 2019లో అన్ని తిట్లు తిట్టిన తర్వాత కూడా పవన్ ఎందుకు చంద్రబాబు పంచన చేరారు. అరెస్ట్ తర్వాత పవన్.. లోకేష్‌ను ఓదార్చుతూ.. చంద్రబాబును అభిమానిస్తూ మాట్లాడారు. అమలాపురంలో 2 వేల మంది రౌడీలు జన సైనికులను చంపాలని కుట్ర పన్నినట్టు తనకి సమాచారం వచ్చిందని పవన్ మాట్లాడారు. సేమ్ అదే సీన్ పుంగనూరులో రిపీట్ అయ్యింది. చంద్రబాబు ప్రతీ కుట్రలో పవన్‌కు భాగస్వామ్యం ఉంది’’ అని అడపా శేషు పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో ఎన్నో హత్యలకు చంద్రబాబు కారకుడు. వంగవీటి రంగా మరణానికి కుట్ర చేసింది చంద్రబాబే. వంగవీటికి రంగా హత్యకు చంద్రబాబు కారకుడని ఆయనకు టీ ఇచ్చిన వ్యక్తికి తెలియదా?. ముద్రగడను రోడ్డుపై ఈడ్చినపుడు పవన్ కనిపించలేదు. పవన్‌కు ఉన్న జనాదరణకు కారణం చిరంజీవి, కాపు కులమే కారణం. కాపు కులానికి పవన్ కళ్యాణ్ చేసిందేమీ లేదు. అన్నయ్య చిరంజీవి పేరు చెప్పుకోలేని వ్యక్తి పవన్. కాపు కులస్తులందరూ గమనించాలి. పవన్ పూర్తిగా ముసుగు తీసేసాడు.’’ అని అడపా శేషు మండిపడ్డారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాపులు ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందుతున్నారు. పవన్‌కు బుక్ చేస్తున్న ఛార్టర్డ్ ఫ్లైట్లు, ఆయన ఆస్తులపై విచారణ జరపాల్సిన అవసరం ఉంది. పవన్ పొలిటికల్ ప్రొడ్యూసర్స్ ఎవరు?. రంగా హత్య నుంచి కాపులంతా చంద్రబాబు పతనం కోసం ఎదురు చూస్తున్నారు. చంద్రబాబుపై అనేక కేసులు ఉన్నాయి. ఇక బయటకు రాడు. టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి లోకేషా, బాలకృష్ణా, పవన్ కళ్యాణా తేల్చుకోవాలి’’ అంటూ అడపా శేషు వ్యాఖ్యానించారు. చదవండి: అందుకే బాబును జైల్లోనే ఉంచాలనేది: ఏఏజీ -
మా ప్రభుత్వంపై పవన్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు
-
‘ప్యాకేజీకి న్యాయం చేయడం కోసమే నీ పర్యటనలు’
సాక్షి, తాడేపల్లి: పవన్ కల్యాణ్ దండుపాళ్యం బ్యాచ్‌ను వేసుకుని రుషికొండకు వెళ్లడం కరెక్టేనా అంటూ నిలదీశారు కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు. రుషికొండపై హరిత రిసార్ట్స్ ఉండేదనే విషయం పవన్‌కు తెలుసా అంటూ ప్రశ్నించారు. హరితా రిసార్ట్స్ మరుగున పడిపోవడంతోనే నూతన భవనాలను నిర్మిస్తున్నారని స్పష్టం చేశారు అడపా శేషు. రాయలసీమలో చంద్రబాబు దండుపాళ్యం బ్యాచ్ తో అరాచకం సృష్టించాడు. పవన్ దండుపాళ్యం బ్యాచ్ ను వేసుకుని రుషికొండకు వెళ్లాడు. పవన్ ప్రజలకు తన జెండా అజెండా ఎందుకు చెప్పడు. ఈ రాష్ట్రం కోసం పవన్ పీకిందేమీ లేదు. బాలకృష్ణ వియ్యంకుడు గీతం యూనివర్శిటీ అక్రమాలు నీ కళ్లకు కనిపించలేదా?, కబ్జాదారులకు కొమ్ము కాయడానికేనా వైజాగ్ లో పర్యటిస్తున్నావ్. పవన్ నువ్వు నీచమైన పరిస్థితికి దిగజారిపోయావ్. ప్యాకేజీకి న్యాయం చేయడం కోసమే నువ్వు పనిచేస్తున్నావ్. పేదలకు సీఎం జగన్ చేస్తున్న మంచిపై దుష్ప్రచారం చేయడమే నీపనా?, దండుపాళ్యం తయారు చేసుకుని చిల్లరనాయకుడులా వ్యవహరిస్తున్నావ్. కార్లమీద ఎక్కి ఫోజులివ్వడానికి ఇదేమైనా సినిమా అనుకున్నావా పవన్ కల్యాణ్. చంద్రబాబు నీకు ఎన్ని సీట్లిస్తాడో చెప్పు’అంటూ అడపా శేషు మండిపడ్డారు. చదవండి: పవన్‌కి జై కొడుతూ పిల్ల సైనిక్స్ భవిష్యత్ పాడు చేసుకుంటున్నారు: ఎమ్మెల్యే అనిల్ -
చంద్రబాబు చేతిలో పవన్ కల్యాణ్ కీలుబొమ్మ: అడపా శేషు
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకు పవన్ ఊడిగం చేస్తున్నారని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలనేదే పవన్ తాపత్రయం.. పవన్ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ‘‘నిన్ను చూసుకోమని మేం ఏ భార్యకు చెప్పాలి పవన్.. నీ మొదటి పెళ్లానికా...రెండో పెళ్లానికా.. మూడవ పెళ్లానికా’’ అంటూ అడపా శేషు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘చంద్రబాబు చేతిలో పవన్ కీలు బొమ్మగా మారాడు. నీ కుటుంబాన్ని ఎక్కువగా తిట్టింది టీడీపీ వాళ్లే. ప్యాకేజీ వల్ల ఆ మాటలన్నీ మర్చిపోయుంటావ్. చంద్రబాబు, పరిటాల రవి చేసిన అవమానాలను మర్చిపోయావ్.. మహిళలు రోడ్డెక్కి నిరసన చేస్తే కనీసం నోరు విప్పలేదు. మహిళలంటే నీకు మరీ అంత చిన్నచూపా. స్త్రీలకు గౌరవం ఇచ్చిన చరిత్ర పవన్‌కు లేదు. స్త్రీలను గౌరవించడం సీఎం జగన్‌ను చూసి నేర్చుకో పవన్’’ అంటూ శేషు హితవు పలికారు. చదవండి: ఎగిరి గంతేసిన టీడీపీ.. తీరా చూస్తే.. అసలు గుట్టు తెలిసిందిలే.. ‘‘ప్రతీ సంక్షేమ పథకంలో మహిళలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. ప్రజల ఇంటికే వెళ్లి సంక్షేమాన్ని అందిస్తుంటే కనిపించడం లేదా?. పవన్ ద్వారా చంద్రబాబు దుర్మార్గమైన రాజకీయాలకు తెరతీశాడు. సోషల్ మీడియాలో జనసేన పార్టీ శ్రేణులు చేస్తున్న అరాచకాలను బయటపెడతాం. నిన్ను రెండు చోట్లా ఓడించింది టీడీపీ పార్టీ కాదా పవన్. రేపు మళ్లీ నిన్ను ఓడించేది కూడీ టీడీపీనే. ఎందుకు ఇంతగా దిగజారిపోయావ్. చంద్రబాబుతో తెరవెనుక నీకున్న లాలూచీ ఏంటి?’’ అంటూ అడపా శేషు ప్రశ్నించారు. చదవండి: విజయవాడ: పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు పవన్ సంస్కారహీనుడు: డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పవన్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ప్రజల మెప్పు పొందిన సీఎం జగన్‌ను విమర్శించడం ద్వారా పవన్ సంస్కారహీనుడవుతున్నాడని దుయ్యబట్టారు. రాజకీయం చేయడానికి పార్టీ పెట్టావా.. ఎవరినైనా కొమ్ము కాయడానికి పార్టీ పెట్టవా అంటూ నిప్పులు చెరిగారు. ఎవరి హయాంలో విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఎవరి హయాంలో పాఠశాలలు రూపురేఖలు మారాయి. నువ్వు ఎవరి కోసం వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నావు. జనసేన అధికారంలోకి వస్తే మంచి క్వాలిటీ మద్యం అందిస్తానని అన్నట్లుగా అర్ధమైంది’’ అని మంత్రి కొట్టు అన్నారు. చంద్రబాబు హయాంలో కోట్లాది రూపాయిల ఇసుక దోపిడీ చేశారు. నువ్వు చెప్పిన లక్ష కోట్ల లెక్కలు నాలుగింతలు చంద్రబాబుకి సరిపోతాయి. జన్మభూమి కమిటీల పేరుతో ఊర్లకి ఊర్లు దోచేస్తే ఎందుకు మాట్లాడలేకపోయావు. ఈ మాటలన్నీ ఎవరు చెప్పమంటే చెప్తున్నావు. ఇప్పటికైనా వలంటీర్ల వ్యవస్ధని గౌరవించు. వాలంటీర్ల ద్వారా కోటి 60 లక్షల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. పార్టీలు, కులాలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం’’ అని కొట్టు సత్యనారాయణ అన్నారు. వలంటీర్లపై కామెంట్లతో పవన్ పతనం ఆరంభం: మంత్రి వేణు ‘‘పవన్ వ్యాఖ్యలతో మహిళల మనోభావాలు దెబ్బ తిన్నాయని, చంద్రబాబు ఏది రాసిస్తే అది మాట్లాడటమే పవన్‌కు తెలుసు’’ అంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. పవన్ మాటలకు అర్ధం ఉందా ? పవన్ ఎన్నిసీట్లలో పోటీచేస్తాడో ఎందుకు చెప్పడు. మొన్నటి వరకూ రెండు రాష్ట్రాలకు నాయకుడిని అన్నాడు. ఇప్పుడు రెండు జిల్లాలకు నాయకుడయ్యాడు. రేపు రెండు సీట్లకు నాయకుడవుతాడు’’ అని మంత్రి వేణు ఎద్దేవా చేశారు. వాలంటీర్లపై కామెంట్లతో పవన్ పతనం ఆరంభమైందని మంత్రి అన్నారు. -
పవన్.. జనసైనికుల పరిస్థితేంటి: అడపా శేషు
సాక్షి, తాడేపల్లి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు ఫైరయ్యారు. ఏపీ ప్రజల పట్ల పవన్‌కు ఘోరమైన అభిప్రాయముంది.. నిన్నటి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. చంద్రబాబును సీఎం చేయడమే పవన్ లక్ష్యమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, అడపా శేషు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏలూరు సభలో ఏపీ ప్రజలు తనను నమ్మరనే అభిప్రాయానికి పవన్ వచ్చేశాడు. మహిళల పట్ల పవన్ చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. వాలంటరీ వ్యవస్థ వైపు ప్రపంచమంతా చూస్తోంది. 30వేల మంది మహిళలు కనిపించడం లేదంటున్న పవన్‌కు కళ్లుపోయాయా?. చంద్రబాబు సమయంలో మహిళలపై జరిగిన అకృత్యాలు పవన్‌కు కనిపించలేదా?. పవన్, బాబు, లోకేష్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటో చూస్తేనే పవన్ భయపడిపోతున్నాడు. సీఎం జగన్‌ను ఏకవచనంతో పిలుస్తావా?. పవన్ ఇష్టానుసారం మాట్లాడితే ఇక్కడెవరూ చూస్తూ ఊరుకోరు. పవన్ కల్యాణ్ ఎప్పటికీ నటుడే.. రాజకీయ నాయకుడు కాలేడు. పవన్ కేవలం ఏపీకి వచ్చి నటించి పోయేవాడే. నువ్వొక్కడివే కమ్మగా ఉంటే సరిపోతుందా పవన్.. నిన్ను నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి?. పవన్ తక్షణమే వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే పవన్‌ను తిరగనివ్వం. చంద్రబాబు నాటకంలో పవన్ కేవలం పాత్రధారే. జనసైనికుల్లారా జాగ్రత్తగా ఉండండి.. పవన్‌ను నమ్మి మోసపోకండి అంటూ హితవు పలికారు. ఇది కూడా చదవండి: పవన్‌కు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ -
పవనిజం కాదు.. బ్రోకరిజం
సాక్షి, అమరావతి: పొలిటికల్ బ్రోకర్ పవన్ కళ్యాణ్ ఓ జోకర్లా తయారయ్యాడని, ఆయనది పవనిజం కాదు.. బ్రోకరిజం, జోకరిజం అని కాపు సంక్షేమ, అభివృద్ధి సంస్థ చైర్మన్ అడపా శేషగిరి ఎద్దేవా చేశారు. ఆయన శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును ఎల్లో పేపర్‌పై రాసి నాదెండ్ల మనోహర్ అందిస్తుంటే పవన్ చదువుతుండటం సిగ్గుచేటన్నారు. వంగవీటి రాధా, రంగాలను చంపించిన వారికి రాజకీయ మేలు చేసేందుకు పవన్ పడుతున్న తాపత్రయాన్ని చూసి కాపులు రగిలిపోతున్నారన్నారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలో పవన్‌కు స్పష్టత లేదని, అది కూడా చంద్రబాబే చెప్పాలని అన్నారు. కాకినాడలో పోటీ చేయాలని ద్వారంపూడి సవాల్ చేస్తే పారిపోయాడన్నారు. కాపుల కోసం త్యాగాలు చేసిన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను బూతులు తిడుతూ జన సైనికులు రాస్తున్న లేఖలకు పవనే బాధ్యత వహించాలని అన్నారు. పిఠాపురంలో పోటీ చెయ్యాలని ముద్రగడ చేసిన సవాల్‌ను స్వీకరించాలని, కాపులు ముద్రగడ వైపో, పవన్ వైపో తేలిపోతుందని చెప్పారు. రెండు చోట్ల ఓడించారనే కక్షతో కాపులను నాశనం చేయాలని పవన్ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు, పవన్‌కు ఎప్పుడో బైబై చెప్పేశారని, మరోసారి వారికి భంగపాటు తప్పదని అన్నారు. ముద్రగడకు లేఖ రాసే స్థాయి కొబ్బరి చిప్పలు ఏరుకునే బుద్ధా వెంకన్నకు లేదన్నారు. కాపుల కోసం ఉద్యమించిన ముద్రగడతోపాటు పలువురిపై చంద్రబాబు అక్రమ కేసులు బనాయించి వేధిస్తే, సీఎం వైఎస్ జగన్ ఆ కేసులు ఎత్తివేసి అండగా నిలిచారని చెప్పారు. -
‘పవన్‌కు కావాల్సింది చంద్రబాబే.. జనసేన కార్యకర్తలు కాదు’
సాక్షి, అమరావతి: సీఎం జగన్ అంటే పవన్,చంద్రబాబు వణికిపోతున్నారని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ముఖంలో ఆనందం కోసమే పవన్ పోరాటమని, సీఎం జగన్‌కు ప్రజల్లో ఆదరణ చూసి పవన్ తట్టుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. ‘‘పవన్‌కు కావాల్సింది చంద్రబాబే..జనసేన కార్యకర్తలు కాదు.. పవన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకేం అర్థం కావడం లేదు. పేదల సంక్షేమం కోసం సీఎం జగన్ లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. చంద్రబాబు చేసిన మోసాలు పవన్‌కు కనిపించలేదా?. జనసేన పార్టీకి ఓ సిద్ధాంతం, విధానమంటూ ఏమీ లేవు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి.. హైదరాబాద్ నుంచి విజయవాడ పారిపోయివచ్చారు’’ అంటూ అడపా శేషు మండిపడ్డారు. చదవండి: ఏది నిజం?: అసలే డ్రామోజీ.. చేతిలో ‘ఛీ’నాడు