సాక్షి, తాడేపల్లి: ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా అధికారంలోకి రావాలనేది చంద్రబాబు ఆలోచన అని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అవే మాటలు మాట్లాడుతున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ పూర్తిగా దిగజారిపోయాడని, పూర్తిగా రూపాంతరం చెంది జన సైనికులను త్యాగాలకు సిద్ధం కావాలంటున్నారని మండిపడ్డారు.
‘‘పవన్ నీచ రాజకీయాలను గమనించాలి. భీమవరంలో పవన్ కళ్యాణ్ ఎవరిని కలిసాడో జన సైనికులు ఆలోచించాలి. టీడీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ పవన్ కలిశాడు. జనసేన, కాపు నాయకుల ఇళ్లకు పవన్ ఎప్పుడైనా వెళ్ళారా?. కాపులకు రాజ్యాధికారం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారనే చంద్రబాబు రంగాను అంతమొందించారు. పవన్ జనసేనను మర్చిపోయి సీనియర్ టీడీపీ నాయకుడిలా ప్రవర్తిస్తున్నారు. ఢిల్లీ వెళ్లి చీవాట్లు తిన్నానని చెప్పుకుంటున్నారు. పవన్ అసలు ఢిల్లీ వెళ్లి ఎవరిని కలిశాడు?ఎవరి కోసం కలిశాడు? అంటూ అడపా శేషు దుయ్యబట్టారు.
‘‘కాపులను ఉద్ధరించడానికి, జన సైనికులను ఎమ్మెల్యేలుగా చేయటానికి వెళ్లాడా?. పాతవాళ్లు పోతారు.. కొత్తవాళ్లు వస్తారని పవన్ చెప్తున్నారు. టీడీపీ నేతలను చేర్చుకోవడానికి పవన్ సిద్ధమయ్యారు. కాపులు తనకి ఓటు వేయరని, తనను నమ్మరని పవన్ ముందే చెప్పారు. పవన్ జనసేనను టీడీపీలో విలీనం చేస్తారనే అనుమానం కలుగుతోంది. పవన్ తెలుగుదేశం తొత్తు’’ అంటూ ఆయన ధ్వజమెత్తారు.
‘‘పవన్ వల్ల కులం భ్రష్టుపడుతుందని జోగయ్య లేఖ ద్వారా తెలిపారు. తెర వెనుక జరిగిన కుంభకోణాన్ని బయటపెట్టాలి. జగన్ పాలనలోని సంస్కరణలు కళ్లకు కనిపించట్లేదా?. మత్తులో ఉన్నాడు కాబట్టే రంగాను హత్య చేసిన టీడీపీతో పవన్ జతకట్టాడు. పేదల రక్తాన్ని పీల్చేసిన వ్యక్తి చంద్రబాబు. ప్రజాసొమ్మును పెత్తందార్లకు దోచిన వ్యక్తి చంద్రబాబు. రాబోయే కురుక్షేత్రంలో కాపులంతా టీడీపీని భూస్థాపితం చేయాలి’’ అంటూ అడపా శేషు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: సిద్ధంగా ఉన్నారా? నాలుగో సభ ఎక్కడంటే?
Comments
Please login to add a commentAdd a comment