
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత కాపుల పరిస్థితి మరింత దిగజారిపోయిందని విమర్శించారు ఏపీ కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు. జనసేన పార్టీ పెట్టి 11 ఏళ్లు అయ్యిందని.. ఈ కాలంలో కాపులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమిలో 21 సీట్లు తీసుకుని తనను నమ్ముకున్న వారిని పవన్ మోసం చేశాడని మండిపడ్డారు. జనసేనలో పవన్ వెనుక తిరిగిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
తిరువూరులో వైఎస్సారీసీపీ కాపుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు, వైఎస్సార్‌సీపీ కాపు నేత ఆకుల శ్రీనివాస్ ,తిరువూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధి నల్లగట్ల స్వామిదాస్, తిరువూరు కాపు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడపా శేషు మాట్లాడుతూ.. కాపులకు అండగా ఉంటానని పాదయాత్రలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 30 మందిని ఎమ్మెల్యేలను చేసి, మంత్రి పదవులు కూడా ఇచ్చారని తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకూ కాపులను మంత్రులు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు.
మనం కోరుకున్న రాజ్యాధికారం జగన్ మోహన్ రెడ్డి వల్లే దక్కిందన్నారు.. ఆయనకు మనకు ఏం చేయలేదని వ్యతిరేకించాలని ప్రశ్నించారు.. సీఎం చెప్పింది చేస్తారని, పార్టీలతో పనిలేకుండా మనకు మేలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు.
కొలికపూడి శ్రీనివాస్‌పై అడపా శేషు ఫైర్..
‘రంగా హత్యకు వైఎస్సార్ కారణమని కొలికపూడి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. రంగా హత్యకు కారణం ముమ్మాటికీ టీడీపీ,చంద్రబాబే. టీడీపీ పతనం వంగవీటి మోహన్ రంగా ఆశయం. వంగవీటి మోహన్ రంగా మనకు ఇచ్చిన ఆయుధం వైఎస్ జగన్. టీడీపీకి ఓటేస్తే మళ్లీ జన్మభూమి కమిటీలొస్తాయి .పథకాలు ఆగిపోతాయి. కాపులకు తిరువూరులో అండగా నిలబడే వ్యక్తి నల్లగట్ల స్వామిదాస్. మనకు రాజకీయ గురువు రంగా ఒక్కరే. చిరంజీవి, పవన్ మనకి కేవలం సినిమా హీరోలు మాత్రమే. వంగవీటి మోహన రంగా ముఖ్యమంత్రి అవుతారని తెలిసే టీడీపీ, చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారు. పవన్ జనసేన పెట్టగానే చంద్రబాబు తన దొడ్లో కట్టేసుకున్నాడు’ అని అడపా శేషు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment