సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకు పవన్ ఊడిగం చేస్తున్నారని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలనేదే పవన్ తాపత్రయం.. పవన్ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ‘‘నిన్ను చూసుకోమని మేం ఏ భార్యకు చెప్పాలి పవన్.. నీ మొదటి పెళ్లానికా...రెండో పెళ్లానికా.. మూడవ పెళ్లానికా’’ అంటూ అడపా శేషు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘‘చంద్రబాబు చేతిలో పవన్ కీలు బొమ్మగా మారాడు. నీ కుటుంబాన్ని ఎక్కువగా తిట్టింది టీడీపీ వాళ్లే. ప్యాకేజీ వల్ల ఆ మాటలన్నీ మర్చిపోయుంటావ్. చంద్రబాబు, పరిటాల రవి చేసిన అవమానాలను మర్చిపోయావ్.. మహిళలు రోడ్డెక్కి నిరసన చేస్తే కనీసం నోరు విప్పలేదు. మహిళలంటే నీకు మరీ అంత చిన్నచూపా. స్త్రీలకు గౌరవం ఇచ్చిన చరిత్ర పవన్‌కు లేదు. స్త్రీలను గౌరవించడం సీఎం జగన్‌ను చూసి నేర్చుకో పవన్’’ అంటూ శేషు హితవు పలికారు.
చదవండి: ఎగిరి గంతేసిన టీడీపీ.. తీరా చూస్తే.. అసలు గుట్టు తెలిసిందిలే..
‘‘ప్రతీ సంక్షేమ పథకంలో మహిళలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. ప్రజల ఇంటికే వెళ్లి సంక్షేమాన్ని అందిస్తుంటే కనిపించడం లేదా?. పవన్ ద్వారా చంద్రబాబు దుర్మార్గమైన రాజకీయాలకు తెరతీశాడు. సోషల్ మీడియాలో జనసేన పార్టీ శ్రేణులు చేస్తున్న అరాచకాలను బయటపెడతాం. నిన్ను రెండు చోట్లా ఓడించింది టీడీపీ పార్టీ కాదా పవన్. రేపు మళ్లీ నిన్ను ఓడించేది కూడీ టీడీపీనే. ఎందుకు ఇంతగా దిగజారిపోయావ్. చంద్రబాబుతో తెరవెనుక నీకున్న లాలూచీ ఏంటి?’’ అంటూ అడపా శేషు ప్రశ్నించారు.
చదవండి: విజయవాడ: పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు
పవన్ సంస్కారహీనుడు: డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
పవన్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ప్రజల మెప్పు పొందిన సీఎం జగన్‌ను విమర్శించడం ద్వారా పవన్ సంస్కారహీనుడవుతున్నాడని దుయ్యబట్టారు. రాజకీయం చేయడానికి పార్టీ పెట్టావా.. ఎవరినైనా కొమ్ము కాయడానికి పార్టీ పెట్టవా అంటూ నిప్పులు చెరిగారు. ఎవరి హయాంలో విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఎవరి హయాంలో పాఠశాలలు రూపురేఖలు మారాయి. నువ్వు ఎవరి కోసం వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నావు. జనసేన అధికారంలోకి వస్తే మంచి క్వాలిటీ మద్యం అందిస్తానని అన్నట్లుగా అర్ధమైంది’’ అని మంత్రి కొట్టు అన్నారు.
చంద్రబాబు హయాంలో కోట్లాది రూపాయిల ఇసుక దోపిడీ చేశారు. నువ్వు చెప్పిన లక్ష కోట్ల లెక్కలు నాలుగింతలు చంద్రబాబుకి సరిపోతాయి. జన్మభూమి కమిటీల పేరుతో ఊర్లకి ఊర్లు దోచేస్తే ఎందుకు మాట్లాడలేకపోయావు. ఈ మాటలన్నీ ఎవరు చెప్పమంటే చెప్తున్నావు. ఇప్పటికైనా వలంటీర్ల వ్యవస్ధని గౌరవించు. వాలంటీర్ల ద్వారా కోటి 60 లక్షల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. పార్టీలు, కులాలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం’’ అని కొట్టు సత్యనారాయణ అన్నారు.
వలంటీర్లపై కామెంట్లతో పవన్ పతనం ఆరంభం: మంత్రి వేణు
‘‘పవన్ వ్యాఖ్యలతో మహిళల మనోభావాలు దెబ్బ తిన్నాయని, చంద్రబాబు ఏది రాసిస్తే అది మాట్లాడటమే పవన్‌కు తెలుసు’’ అంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. పవన్ మాటలకు అర్ధం ఉందా ? పవన్ ఎన్నిసీట్లలో పోటీచేస్తాడో ఎందుకు చెప్పడు. మొన్నటి వరకూ రెండు రాష్ట్రాలకు నాయకుడిని అన్నాడు. ఇప్పుడు రెండు జిల్లాలకు నాయకుడయ్యాడు. రేపు రెండు సీట్లకు నాయకుడవుతాడు’’ అని మంత్రి వేణు ఎద్దేవా చేశారు. వాలంటీర్లపై కామెంట్లతో పవన్ పతనం ఆరంభమైందని మంత్రి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment