Kapu Corporation Chairman
-
అప్పుడు ఏం మాట్లాడావో గుర్తు చేసుకో పవన్: అడపా శేషు
సాక్షి, విజయవాడ: పవన్‌కు సిద్ధాంతాలు.. విలువలు లేవంటూ దుయ్యబట్టారు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐవీ కృష్ణారావు రాజధాని భూములపై పుస్తకం రాసినప్పుడు పవన్ ఏం మాట్లాడాడో గుర్తు చేసుకోవాలన్నారు. రాజధాని పేరుతో ఒక సామాజికవర్గం భూములు దోపిడీ చేస్తుందని మాట్లాడిన మాటలు మర్చిపోయావా పవన్ అంటూ అడపా శేషు నిలదీశారు. దోపిడీని అరికడతానని చెప్పి చంద్రబాబు పంచన చేరావా పవన్. చంద్రబాబు చేసిన దుర్మార్గాలపై నువ్వు ఏం మాట్లాడావో మర్చిపోయావా? చంద్రబాబు, లోకేష్‌పై నువ్వెంత నీచంగా మాట్లాడావో మర్చిపోయావా?. చంద్రబాబు దోపిడీ దొంగల ముఠాకు నాయకుడివి అన్నావ్ గుర్తులేదా?. పవన్‌కు తన మాట మీద నిలకడ లేదు. కాపులను చంద్రబాబుకు తాకట్టు పెట్టడానికి తప్ప నువ్వు దేనికీ పనికిరావు’’ అంటూ పవన్‌ను అడపా శేషు దుయ్యబట్టారు. ఏం సాధిద్ధామని చంద్రబాబు పంచన చేరావ్ పవన్. కాపులను ఎలా బేరం పెట్టావో అందరూ చూస్తున్నారు. అడుక్కోవద్దు...శాసించు అని హరిరామ జోగయ్య చెప్పింది వినిపించలేదా?. చంద్రబాబు నీకెన్ని సీట్లిస్తాడు..అందులో నువ్వెన్ని కాపులకు ఇస్తున్నావో చెప్పు.. నీకు దమ్ము ధైర్యం ఉంటే హరిరామజోగయ్య లేఖలో చెప్పిన పేర్లన్నీ ప్రకటించు. పవన్ నువ్వు క్లాస్‌గా కమ్మగా ఉన్నావని ప్రజలందరీకీ తెలుసు. పేద, బడుగు, బలహీన వర్గాల మాస్ లీడర్ సీఎం జగన్’’ అని అడపా శేషు పేర్కొన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబుకు మల్లాది విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ -
‘కాపు కులాన్ని నీకు ఏమైనా అద్దెకు ఇచ్చామా?’
సాక్షి,తాడేపల్లి: కాపు కులాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడానికి పవన్ కళ్యాణ్ ఎవరని ప్రశ్నించారు కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు. కాపు కులాన్ని ఏమైనా పవన్‌కు అద్దెకు ఇచ్చామా? అంటూ నిలదీశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్మీట్లో అడపా శేషు మాట్లాడుతూ.. కాపులను అణచి వేసేందుకు బాబు కుట్ర చేస్తుంటే అందులో పవన్ కళ్యాణ్ భాగస్తుడయ్యాడని ధ్వజమెత్తారు. అడపా శేషు ఇంకా ఏమన్నారంటే.. కాపుల ద్రోహి పవన్‌కళ్యాణ్ రాష్ట్రంలో కాపు సోదరులకు పవన్ ఏం న్యాయం చేశాడు? వారికి పవన్ చేసిన అన్యాయం గురించి మాట్లాడతాను. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ముసుగులో నుంచి పుట్టిందా? లేదా?. దీనికి సమాధానం చెప్పాలి. మాట్లాడితే వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకుల మీద పవన్‌కళ్యాణ్ చేస్తున్న దాడి గమనించండి. నిజానికి పవన్‌కళ్యాణ్‌కు రాష్ట్రంలో ఇల్లు లేదు. ఓటు లేదు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడ ఓటు లేదు. ఇప్పుడు ఆయన భార్య అసలు భారతీయురాలే కాదు. ఆయన రెండో భార్య పిల్లలకు కూడా ఇక్కడ ఓటు హక్కు లేదు.కేవలం చంద్రబాబుకు మేలు చేయడం కోసమే పవన్ రాజకీయాలు చేస్తున్నాడు. చంద్రబాబును సీఎం చేయడం కోసమే పవన్ ఇక్కడకు చుట్టపుచూపుగా వస్తున్నాడు. అందుకే పవన్‌కళ్యాణ్ కాపుల ద్రోహి పవన్ ఆనాడెందుకు ప్రశ్నించలేదు? కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పర్యటించి, టార్గెట్ రాజకీయాలు చేస్తున్నాడు. కాపు ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా పవన్ రాజకీయాలు చేస్తున్నాడు. దీన్ని గమనించాలి. ప్రశ్నించేందుకే తాను పార్టీ పెట్టినట్లు చెప్పే పవన్‌కళ్యాణ్, నాడు వంగవీటి రంగాను హత్య చేసిన తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయడం సిగ్గుచేటు. ముద్రగడ పద్మనాభం ఆత్మగౌరవాన్ని రోడ్డుకీడ్చినా కనీసం ప్రశ్నించలేదు.వంగవీటి రంగా గారిని చంపితే.. అది ఫ్యాక్షన్ హత్య అన్నాడు. అదే అక్కడ పరిటాల రవి హత్యను ప్రత్యర్థులు చేసిన హత్య అనడం దారుణం.ఎవరిది ఫ్యాక్షన్ హత్య? పవన్ అలా మాట్లాడడం సరికాదు. కాబట్టి ఆయన మాటలను గమనించమని కోరుతున్నాను. మనకూ ఆత్మ గౌరవం, పౌరుషం ఉంది. రొమ్ము విడిచి చెప్పగలం. కానీ ఎందుకు ఆ పని చేయలేకపోతున్నాం. కాపులపై చంద్రబాబు కుట్ర అటు ఉత్తరాంధ్ర మొదలు ఇటు రాయలసీమ జిల్లాల వరకు మనకు ఎందరో కాపు నాయకులు ఉన్నారు. వారు జిల్లాల్లో ఆధిపత్యం చేస్తుంటే.. దాన్ని అణిచి వేయడం కోసం చంద్రబాబు, పవన్చేత జనసేన పార్టీ పెట్టించి రాజకీయం చేస్తున్నాడు. అందుకే పవన్‌కళ్యాణ్ ఆయా ప్రాంతాల్లోనే పర్యటిస్తున్నాడు. కాబట్టి కాపు సోదరులు దీన్ని గమనించి, ప్రశ్నించాలని కాపు సోదరులను కోరుతున్నాను. గత మూడు రోజులుగా రాజమండ్రి రూరల్‌లో పవన్ పర్యటిస్తున్నాడు. అక్కడే ఎందుకు? కేవలం కాపు సామాజికవర్గం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే పర్యటించడం ఎందుకు? జనసేన ప్రారంభించిన రోజున కాపు సోదరులకు రాజ్యాధికార సాధన కోసం అందరూ అనుకున్నారు. కానీ కాపులు ఎక్కడా రాజ్యాధికారంలో ఉండకూడదన్నది చంద్రబాబు కుట్ర. అందుకే పవన్‌ను ఆయా చోట్లకు పంపిస్తున్నారు. పవన్.. నీవా కాపులను కాపాడేది! గతంలో మహానేత వైయస్సార్‌గారు మాత్రమే కాపులకు పెద్దపీట వేశారు. వారికి అన్నింటా ప్రాథాన్యత ఇచ్చారు. అదే చంద్రబాబునాయుడు, కాపు సోదరులను ఎక్కడికక్కడ అణిచివేసి, లోపల వేయించాడు. ఇటీవలే నారా లోకేష్ ఒక మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్ సీఎం చంద్రబాబు మాత్రమే అన్నారు. కానీ, పవన్ కనీసం దాన్ని కూడా ప్రశ్నించలేదు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరిగాయి. వాటిని పవన్ కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు వారాలబాబు మాదిరిగా రాష్ట్రానికి వారం రోజులకో, నెలకో ఒకసారి వస్తూ పవన్ రాజకీయాలు చేస్తున్నాడు. ఖమ్మంలో మంత్రి శ్రీ అంబటి రాంబాబుపై ఒక సామాజికవర్గం దాడి చేస్తే.. పవన్ కనీసం పట్టించుకోలేదు. పవన్.. నీవా కాపులను కాపాడేది? నిన్ను నమ్ముకున్న కాపు సోదరులను ఏనాడైనా పట్టించుకున్నావా? వారికి కనీసం టికెట్లు అయినా ఇప్పించావా? వారిని ఎక్కడైనా కనీసం ఆదుకున్నావా? అసలు దేనికి నీ ప్రయాణం? కేవలం చంద్రబాబు ప్రయోజనాలు కాపాడడమేనా? కాపు సోదరులు గుర్తించాలి పవన్.. నీకంటూ రాష్ట్రంలో సొంత నియోజకవర్గం ఉందా? కనీసం ఇల్లైనా ఉందా?. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కాపు సోదరులు పోరాడుతున్నారు. అలాంటి వారిని పవన్‌కళ్యాణ్ తొక్కేస్తున్నాడు. కాబట్టి, కాపు పోదరులు ఒకసారి వాస్తవాలు గుర్తించాలి. కాపులకు ఎవరు కావాలి? సీఎం జగన్ కాపు సోదరులకు రాజకీయ పదవులు ఇవ్వడమే కాకుండా, వారికి ఆర్థిక పరిపుష్టత కూడా కలిగించారు. ఇన్ని పదవులు ఇచ్చిన జగన్‌గారు కావాలా? లేక కాపులను ఏకతాటిపై అమ్మేస్తున్న పవన్‌కళ్యాణ్ కావాలా? ఒక్కసారి ఆలోచించమని కాపు సోదరులను కోరుతున్నాను. ఒక్కసారి కళ్లు తెరవండి. పవన్ అనైతిక రాజకీయాలను నిలదీయండి. టీడీపీలో భాగస్తుడు నువ్వే దైవం, నువ్వే సర్వస్వం అని తిరిగిన జన సైనికులు, వీర నారీమణుల గురించి ఏనాడైనా పట్టించుకున్నావా? వారి గురించి ఏం చెప్పదల్చుకున్నావ్?. వారికి ఒక్క పదవి అయినా ఇచ్చావా? వారి ఆర్థిక స్థితి ఏమిటన్నది పట్టించుకున్నావా?. కనీసం నీ పర్యటనల్లో ఒక్క జన సైనికుడితో అయినా మాట్లాడావా? పార్టీని, కులాన్ని పక్కన పెట్టేసి కేవలం చంద్రబాబునాయుడు పార్టీలో ఒక భాగస్తుడవయ్యావు. అందుకు ఈ ఫోటోలే నిదర్శనం.. (అంటూ టీడీపీ ప్రచురించిన పోస్టర్లు చూపిన అడపా శేషు). అసలు పవన్‌కళ్యాణ్ జనసేన నాయకుడా? లేక తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడా? లేకుంటే మేం చెబుతున్నట్లు చంద్రబాబు దత్తపుత్రుడా?. నిజానికి పవన్‌కళ్యాణ్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. కాపుల అభ్యున్నతిని అడ్డుకుంటున్న సామాజికవర్గ నాయకులను కట్టడి చేసే ప్రయత్నం కూడా చేయడం లేదు. కాపు కులాన్ని అద్దెకు ఇచ్చామా? ఇవాళ రాష్ట్రంలో చాలా చోట్ల టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తాము ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడితే, ఈరోజు అదే పార్టీని చంద్రబాబుకు, టీడీపీకి ఇస్తున్నావని వారంటే.. కనీసం సమాధానం చెప్పడం లేదు. నీకు కాపు కులాన్ని అద్దెకు ఇచ్చామా? నీవేమైనా పోటుగాడివా? కాపులను ఉద్ధరిస్తారని నిన్ను నమ్మారనుకుంటున్నావా? కాపులకు ఆర్థిక పరిపుష్టి కల్పించి, ఆదుకున్న నాయకుడు జగన్‌గారు మాత్రమే. కోవిడ్ సంక్షోభంలో కూడా వారిని ఆయన ఎంతో ఆదుకున్నారు.అదే పేదల రక్తం తాగిన చంద్రబాబుకు, పవన్ కొమ్ము కాస్తున్నాడు. కాబట్టి ఆలోచించమని కోరుతున్నాను. చంద్రబాబు ఒక్కటైనా చెప్పుకోగలరా? సీఎం జగన్ ఎక్కడికి పోయినా.. అక్కడి ప్రజలు ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఊరూరా ప్రతి ఇంట్లో నాడు వైయస్సార్, ఇప్పుడు సీఎం శ్రీ వైయస్ జగన్ వల్ల ప్రయోజనం పొందిన వారున్నారు. అదే లోకేష్ 3 వేల కిలోమీటర్లు తిరిగాడంటున్నారు కదా? కనీసం ఒక్క ఊరిలో అయినా, తన తండ్రి వల్ల ఒక్క మేలు జరిగిందని చెప్పుకోగలరా? కనీసం ఒక్క కుటుంబం అయినా ముందుకొచ్చి, తమకు చంద్రబాబు వల్ల మేలు జరిగిందని చెప్పారా?. కాపులకు నాడు–నేడు వారితోనే మేలు పేదల సంక్షేమం కోసం నాడు వైయస్సార్, ఇప్పుడు జగన్‌గారు ఎంతో చేశారు. ఇంకా చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైయస్సార్ కుటుంబానికి పేదలంటే మక్కువ. వారికి మేలు చేయడం కోసం ఎక్కడా వెనకడుగు వేయరు. అదే చంద్రబాబు ఏం చేశాడనేది చూస్తే.. పేదల రక్తంతో ఎన్నో రాష్ట్రాలలో తన సామాజిక వర్గానికి కోటలు కట్టించాడు. పవన్‌కళ్యాణ్‌తో అవసరం ఉంటే, ఛార్టర్డ్ ఫ్లైట్ పెట్టించి, పవన్‌కు ఇక్కడకు రప్పిస్తున్నాడు.కాపుల్లో కానీ, ఇతర కులాల్లోని నిరుపేదలను కానీ ఆదుకోవడంలో జగన్‌గారు ఎంతో కృషి చేశారు. పవన్ ఏనాడు ఈ దిశలో పని చేయలేదు. కేవలం చంద్రబాబుకు మేలు చేయడం కోసం కాపు సామాజికవర్గం ఉన్న ప్రాంతాల్లో తిరుగుతూ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. పవన్ రాజకీయాలు చేస్తున్నాడు. కాపులను ఎవరు గెలిపిస్తున్నారు? వారికి ఎవరు ఎక్కువ సీట్లు ఇస్తున్నారు? వారికి ఎవరు ఎక్కువ పదవులు ఇస్తున్నారు? ఇవన్నీ ఆలోచించమని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అదే సమయంలో పవన్‌కళ్యాణ్ చేస్తున్న అనైతిక రాజకీయాలను ప్రశ్నించమని కోరుతున్నాను. -
‘జన సైనికులు అప్పుడు నమ్మలేదు.. ఇప్పుడు బాధపడుతున్నారు’
సాక్షి, తాడేపల్లి: పేదల రక్తం పీల్చే వ్యక్తి చంద్రబాబు అయితే, ప్రజల కోసం తన రక్తాన్ని ధారపోసే వ్యక్తి సీఎం జగన్ అని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు, లోకేష్, పవన్‌లకు ఈ రాష్ట్ర ప్రజల గురించి అవసరం లేదంటూ దుయ్యబట్టారు. అర్జంట్‌గా అధికారంలోకి రావాలన్నదే వారి ఆలోచన. తన వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే చూసుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్. జనసేన శ్రేణుల సమస్యలు కూడా పవన్‌కు అవసరం లేదని ధ్వజమెత్తారు. పవన్‌కు కావాల్సిందల్లా కేవలం చంద్రబాబు, లోకేష్ బాగోగులే. జనసేన పార్టీ పెట్టించింది చంద్రబాబేనని మేం ఎప్పుడో చెప్పాం. జన సైనికులు అప్పుడు నమ్మలేదు.. ఇప్పుడు బాధపడుతున్నారు. పవన్ సీనియర్ టీడీపీ కార్యకర్తలా తయారయ్యాడు. పవన్ చేస్తున్న పనులతో జన సైనికులు అవమానంతో కుమిలిపోతున్నారు. చంద్రబాబు లేకపోతే తన మనుగడ సాగదని పవన్ ఆలోచన. పవన్ తన పక్కన లేకపోతే జనం రారేమోనని చంద్రబాబు భయం. చంద్రబాబు,లోకేష్,పవన్ ను నమ్మే పరిస్థితిలో జనం లేరు యువగళం ముగింపు సభ అట్టర్ ప్లాఫ్’’ అంటూ అడపా శేషు వ్యాఖ్యానించారు. చంద్రబాబే సీఎం అభ్యర్ధని ఓ ఇంటర్యూలో లోకేష్ స్పష్టంగా చెప్పాడు. పవన్‌ను ప్యాకేజ్ స్టార్ అంటే మమ్మల్ని అందరూ విమర్శించారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఎవరు సమాధానం చెబుతారు?. పవన్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే. జన సైనికులు, కాపు సామాజికవర్గ పెద్దలు ఆలోచన చేయాలి. భారతదేశంలో ఎవరూ చేయలేనంత గొప్పగా సీఎం జగన్ సంస్కరణలున్నాయి. చంద్రబాబు, పవన్, లోకేష్ చేస్తున్న రాజకీయం చూస్తుంటే సిగ్గేస్తోంది’’ అని శేషు దుయ్యబట్టారు. ప్రజల రక్తాన్ని పీల్చి కోట్లు సంపాదించిన వ్యక్తి చంద్రబాబు. ఆ సంపద కోసం ఆశపడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకి పవన్ అమ్ముడుపోయాడు. తెలంగాణ ఎన్నికల్లో ఎనిమిదిచోట్ల పోటీచేసిన పవన్ పార్టీ తుస్సుమంది. తనను నమ్ముకున్నవారిని ఇంకా పిచ్చోళ్లను చేసే ప్రయత్నంలో పవన్ ఉన్నాడు. కాపులకు ప్రాధాన్యం కల్పించింది వైఎస్సార్ కుటుంబమే. కాపులను రోడ్ల పై ఈడ్చి తన్నించిన చరిత్ర చంద్రబాబుది. కాపులకు కొమ్ముకాసిందెవరో.. అమ్ముకున్నదెవరో తెలుసుకోండి. ఛాలెంజ్ చేసి చెబుతున్నా.. కాపులను పవన్.. చంద్రబాబుకు అమ్మేశాడు’’ అంటూ అడపా శేషు ధ్వజమెత్తారు. సీఎం జగన్ 2 వేల కోట్లు కాపు నేస్తానికి ఖర్చు చేశారు. పవన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే తనకు ఎన్ని సీట్లిస్తారో ప్రకటించాలి. అచ్చెన్నాయుడికి టిక్కెట్ ఇవ్వనని చెప్పే దమ్ము చంద్రబాబుకి ఉందా?. సమర్ధవంతమైన వ్యక్తిని ప్రకటించే దమ్ము సీఎం జగన్‌కే ఉంది. సీఎం జగన్ సింహంలా సింగిల్ గానే వస్తాడు.. 175 సీట్లలో గెలుస్తారు’’ అని అడపా శేషు పేర్కొన్నారు. -
దయచేసి పవన్ ను డాక్టర్ కి చూపించండి..
-
ఒక సినిమా పోతే మరో సినిమా.. అదే పవన్ విధానం: అడపా శేషు
సాక్షి, తాడేపల్లి: తెలంగాణలో డిపాజిట్లు కోల్పోవడంతో పవన్‌కు మతి భ్రమించిందని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో పవన్‌కు ప్రజలు ఓటేయలేదని, అక్కడ ఓడిపోగానే వైజాగ్ వచ్చి ఊగిపోతున్నాడని మండిపడ్డారు. ‘‘తెలంగాణలో బీజేపీతో ఏపీలో టీడీపీతో పవన్ జతకలిశాడు. పవన్ తీరు అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాలాగే ఉంది. అక్కడ పోతే బీజేపీ పోయిందని వదిలేశాడు. ఇక్కడ చంద్రబాబు కోసం ఆరాట పడుతున్నాడు. ఒక సినిమా పోతే మరో సినిమా అదే పవన్ విధానం. కాపులను చంద్రబాబుకు తాకట్టు పెట్టాడు. ఏపీకి ఏం చేస్తాడని పవన్‌ను ప్రజలు నమ్మాలి’’ అంటూ శేషు ధ్వజమెత్తారు. చంద్రబాబుకు నిజంగా దమ్ముంటే ఎందుకు క్యాండెట్‌ను పెట్టలేదు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఫైనాన్షియర్ మాత్రమే. రేవంత్ గెలిస్తే ఏపీలో ఒక సామాజిక వర్గం సంకలు గుద్దుకుంటోంది, పవన్‌ను నమ్ముకున్నందుకు తెలంగాణలో బీజేపీకి పట్టిన గతే ఏపీలో టీడీపీకి పడుతుంది. అధికారం, అహంకారానికి అసలైన రూపం చంద్రబాబు. సెక్రటేరియట్ సాక్షిగా నాయిబ్రాహ్మణుల తోకలు కట్ చేస్తానన్న వ్యక్తి చంద్రబాబు. సీఎం జగన్ గురించి మాట్లాడే స్థాయి పవన్‌కు లేదు’’ అని అడపా శేషు మండిపడ్డారు. పవన్ ఉన్నత వర్గాలకు కొమ్ము కాస్తున్నాడు. ఊగిపోతూ పవన్ చెప్పే ఉపన్యాసాలకు కాలం చెల్లింది. సీఎం జగన్ అందించిన సంక్షేమం వల్ల కోవిడ్ సమయంలో ఎంతో మంది ప్రాణాలతో నిలబడ్డారు. సీఎం జగన్‌కి చిరునవ్వు తప్ప.. అహంకారమంటే తెలియదు. సినిమాల నుంచి వచ్చాడు కాబట్టి ఎవరు నష్టపోయినా పవన్‌కు పట్టదు. పవన్ కచ్చితంగా జనసేన శ్రేణులకు సమాధానం చెప్పే రోజు వస్తుంది. పవన్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే ప్రతీ ఒక్క వైసీపీ కార్యకర్త మాట్లాడాల్సి వస్తుంది’’ అడపా శేషు హెచ్చరించారు. చదవండి: బాబు కూల్చారు.. జగన్ పునర్నిర్మించారు -
హరిరామజోగయ్య.. నీ పుస్తకంలో ఏం రాశావో గుర్తులేదా?: అడపా శేషు
సాక్షి, తాడేపల్లి: పవన్ కళ్యాణ్‌కు దమ్ముంటే మూడో భార్య పేరుతో ఉన్న ఇళ్లు, ఆస్తుల వివరాలు బయట పెట్టాలని కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనసేన నేత హరిరామజోగయ్యపై మండిపడ్డారు. వంగవీటి రంగ హత్య వెనుక చంద్రబాబు ఉన్నారని నీ పుస్తకంలో రాయలేదా?. ఇప్పుడు చంద్రబాబు అంత కమ్మగా ఎందుకు కనిపిస్తున్నారంటూ నిలదీశారు. ‘‘శాండ్, మైన్స్, వైన్స్ అన్నీ చంద్రబాబు సామాజిక వర్గం దోచుకున్న సంగతి తెలీదా?. అలాంటి వ్యక్తికి పవన్ మద్దతు ఇవ్వటం ద్వారా ఎంత వాటా పొందారు?. పవన్ కళ్యాణ్ రాజధానిలో బినామీల పేరుతో ఎన్ని ఆస్తులు సమకూర్చారో చెప్పాలి’’ అని శేషు డిమాండ్ చేశారు. మహిళలంటే సీఎం జగన్‌కి ఎంతో గౌరవం. అందుకే మహిళల పేరుతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న గజ దొంగ జైల్లో ఉన్నాడు. చిల్లర దొంగ పవన్ బయట ఉన్నారు’’ అంటూ అడపా శేషు మండిపడ్డారు. చదవండి: చంద్రబాబు యాక్టివ్‌గా ఉన్నారు: వైద్యులు -
‘పవన్,..2019లో అమరావతి కుల రాజధాని అని నువ్వు అనలేదా?’
సాక్షి, తాడేపల్లి: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు అరెస్టు పట్ల ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని పండుగ చేసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపులపై ఎన్నో అరాచకాలు చేశారని అలాంటి వ్యక్తికి కొమ్ము కాస్తున్నందుకు ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఇద్దరికీ కలిపి బుద్ధి చెబుతారన్నారు. అడపా శేషు మాట్లాడుతూ.. చంద్రబాబును అరెస్ట్ చేసి ఇప్పటికి 24 రోజులైందని ప్రజల్లో ఆయన పట్ల ఎలాంటివో సానుభూతి లేదని పైగా వారంతా చంద్రబాబు అరెస్ట్ పట్ల చాలా ఆనందంగా ఉండడమే కాకుండా పండుగ వాతావరణంలో ఉన్నారన్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కులాలను, మతాలను ఆయన ఇబ్బంది పెట్టారన్నారు. కాపు ఉద్యమం సందర్బంగా ముద్రగడ పద్మనాభంపై అనేక తప్పుడు కేసులు పెట్టారని, వంగవీటి రంగా హత్యకు కూడా చంద్రబాబే కుట్రదారుడన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ ముగ్గురూ వారి యాత్రల్లో చాలా అసభ్యంగా మాట్లాడారని ప్రజలను పదే పదే రెచ్చగొట్టారని అన్నారు. 2014లో పవన్ కళ్యాణ్ దగ్గరుండి మరీ కాపులతో టిడిపికి ఓట్లు వేయించారు. ఆనాడు చంద్రబాబు ప్రజలకు 600 హామీలిచ్చి గద్దెనెక్కారు. అలాంటిది 2019లో అమరావతి కుల రాజధాని అని పవన్ అన్న మాటలను గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ వైసీపీలో కాపులు తనని టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు కాబట్టి ఆయనకు నాదొక సూటి ప్రశ్న.. నువ్వు కూడా వైసీపీలోని కేవలం కాపు ఎమ్మెల్యేలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నావని.. కాపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనే ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నించారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక జన సైనికులకు నువ్వు ఏం చేశావని వచ్చే ఎన్నికల్లో జన సైనికులు, కాపులు నీకు ఎందుకు సహకరిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు పెట్టే స్కీములన్నీ పెత్తందారులకోసమేనని, అసలు చంద్రబాబు పేదల కోసం ఆలోచించడం ఒక్కసారైనా చూసావా అని నిలదీశారు. హైటెక్ సిటీ పక్కన భూములు కొన్నది టీడీపీ నేతలేనని, కాపులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు మీటింగ్‌లు పెట్టిస్తున్నారన్నారు. కాపులు రాజకీయంగా ఎదగకూడదన్నది టీడీపీ కుట్రని అందుకే పవన్ కల్యాణ్‌ను వాడుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ జనసేన కలిసిన తర్వాత జరిగిన మొట్ట మొదటి సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని చంద్రబాబు అరెస్ట్ పై ఆయన కుటుంబ సభ్యుల కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువగా బాధ పడుతున్నారని చంద్రబాబు కాళ్ళకు చెప్పుల మాదిరిగా పవన్ తయారయ్యారన్నారు. మీ నాన్నే నన్నేమీ పీకలేకపోయాడన్న చంద్రబాబు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని, ఇప్పుడు వీరిద్దరూ కలిసి రాష్ట్రాభివృద్ధిని నాశనం చేయాలని చూస్తున్నారన్నారు. వీరికి అధికారం కట్టబెడితే ఇక్కడి సంపదను దోచుకెళ్ళి ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ పెట్టుబడులు పెడతారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని అన్నారు. ఇది కూడా చదవండి: పద్మనాభం పీఎస్ ఘటన.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు -
‘జైల్లో బాబు.. టీడీపీ సీఎం అభ్యర్థి లోకేషా, బాలకృష్ణా, పవన్ కళ్యాణా’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నేతలు, ఆయన కుటుంబ సభ్యుల కంటే పవన్ కల్యాణ్ ఎక్కువగా స్పందించారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్నూల్ నుంచి చంద్రబాబును తాడేపల్లి తీసుకొచ్చే లోపు లూథ్రాకి ఒక ఫ్లైట్, పవన్‌కి ఒక ఫ్లైట్ బుక్ చేసారు. కేసులను మభ్యపెట్టడానికి లూథ్రా, ప్రజల్ని మభ్యపెట్టడానికి పవన్ కల్యాణ్ ఉన్నారని ప్రజలకు అర్థమైందన్నారు. ‘‘నడి రోడ్డుపై పడుకుని చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ తాపత్రయపడ్డారు. 2019లో అన్ని తిట్లు తిట్టిన తర్వాత కూడా పవన్ ఎందుకు చంద్రబాబు పంచన చేరారు. అరెస్ట్ తర్వాత పవన్.. లోకేష్‌ను ఓదార్చుతూ.. చంద్రబాబును అభిమానిస్తూ మాట్లాడారు. అమలాపురంలో 2 వేల మంది రౌడీలు జన సైనికులను చంపాలని కుట్ర పన్నినట్టు తనకి సమాచారం వచ్చిందని పవన్ మాట్లాడారు. సేమ్ అదే సీన్ పుంగనూరులో రిపీట్ అయ్యింది. చంద్రబాబు ప్రతీ కుట్రలో పవన్‌కు భాగస్వామ్యం ఉంది’’ అని అడపా శేషు పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో ఎన్నో హత్యలకు చంద్రబాబు కారకుడు. వంగవీటి రంగా మరణానికి కుట్ర చేసింది చంద్రబాబే. వంగవీటికి రంగా హత్యకు చంద్రబాబు కారకుడని ఆయనకు టీ ఇచ్చిన వ్యక్తికి తెలియదా?. ముద్రగడను రోడ్డుపై ఈడ్చినపుడు పవన్ కనిపించలేదు. పవన్‌కు ఉన్న జనాదరణకు కారణం చిరంజీవి, కాపు కులమే కారణం. కాపు కులానికి పవన్ కళ్యాణ్ చేసిందేమీ లేదు. అన్నయ్య చిరంజీవి పేరు చెప్పుకోలేని వ్యక్తి పవన్. కాపు కులస్తులందరూ గమనించాలి. పవన్ పూర్తిగా ముసుగు తీసేసాడు.’’ అని అడపా శేషు మండిపడ్డారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాపులు ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందుతున్నారు. పవన్‌కు బుక్ చేస్తున్న ఛార్టర్డ్ ఫ్లైట్లు, ఆయన ఆస్తులపై విచారణ జరపాల్సిన అవసరం ఉంది. పవన్ పొలిటికల్ ప్రొడ్యూసర్స్ ఎవరు?. రంగా హత్య నుంచి కాపులంతా చంద్రబాబు పతనం కోసం ఎదురు చూస్తున్నారు. చంద్రబాబుపై అనేక కేసులు ఉన్నాయి. ఇక బయటకు రాడు. టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి లోకేషా, బాలకృష్ణా, పవన్ కళ్యాణా తేల్చుకోవాలి’’ అంటూ అడపా శేషు వ్యాఖ్యానించారు. చదవండి: అందుకే బాబును జైల్లోనే ఉంచాలనేది: ఏఏజీ -
చంద్రబాబు చేతిలో పవన్ కల్యాణ్ కీలుబొమ్మ: అడపా శేషు
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకు పవన్ ఊడిగం చేస్తున్నారని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలనేదే పవన్ తాపత్రయం.. పవన్ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ‘‘నిన్ను చూసుకోమని మేం ఏ భార్యకు చెప్పాలి పవన్.. నీ మొదటి పెళ్లానికా...రెండో పెళ్లానికా.. మూడవ పెళ్లానికా’’ అంటూ అడపా శేషు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘చంద్రబాబు చేతిలో పవన్ కీలు బొమ్మగా మారాడు. నీ కుటుంబాన్ని ఎక్కువగా తిట్టింది టీడీపీ వాళ్లే. ప్యాకేజీ వల్ల ఆ మాటలన్నీ మర్చిపోయుంటావ్. చంద్రబాబు, పరిటాల రవి చేసిన అవమానాలను మర్చిపోయావ్.. మహిళలు రోడ్డెక్కి నిరసన చేస్తే కనీసం నోరు విప్పలేదు. మహిళలంటే నీకు మరీ అంత చిన్నచూపా. స్త్రీలకు గౌరవం ఇచ్చిన చరిత్ర పవన్‌కు లేదు. స్త్రీలను గౌరవించడం సీఎం జగన్‌ను చూసి నేర్చుకో పవన్’’ అంటూ శేషు హితవు పలికారు. చదవండి: ఎగిరి గంతేసిన టీడీపీ.. తీరా చూస్తే.. అసలు గుట్టు తెలిసిందిలే.. ‘‘ప్రతీ సంక్షేమ పథకంలో మహిళలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. ప్రజల ఇంటికే వెళ్లి సంక్షేమాన్ని అందిస్తుంటే కనిపించడం లేదా?. పవన్ ద్వారా చంద్రబాబు దుర్మార్గమైన రాజకీయాలకు తెరతీశాడు. సోషల్ మీడియాలో జనసేన పార్టీ శ్రేణులు చేస్తున్న అరాచకాలను బయటపెడతాం. నిన్ను రెండు చోట్లా ఓడించింది టీడీపీ పార్టీ కాదా పవన్. రేపు మళ్లీ నిన్ను ఓడించేది కూడీ టీడీపీనే. ఎందుకు ఇంతగా దిగజారిపోయావ్. చంద్రబాబుతో తెరవెనుక నీకున్న లాలూచీ ఏంటి?’’ అంటూ అడపా శేషు ప్రశ్నించారు. చదవండి: విజయవాడ: పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు పవన్ సంస్కారహీనుడు: డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పవన్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ప్రజల మెప్పు పొందిన సీఎం జగన్‌ను విమర్శించడం ద్వారా పవన్ సంస్కారహీనుడవుతున్నాడని దుయ్యబట్టారు. రాజకీయం చేయడానికి పార్టీ పెట్టావా.. ఎవరినైనా కొమ్ము కాయడానికి పార్టీ పెట్టవా అంటూ నిప్పులు చెరిగారు. ఎవరి హయాంలో విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఎవరి హయాంలో పాఠశాలలు రూపురేఖలు మారాయి. నువ్వు ఎవరి కోసం వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నావు. జనసేన అధికారంలోకి వస్తే మంచి క్వాలిటీ మద్యం అందిస్తానని అన్నట్లుగా అర్ధమైంది’’ అని మంత్రి కొట్టు అన్నారు. చంద్రబాబు హయాంలో కోట్లాది రూపాయిల ఇసుక దోపిడీ చేశారు. నువ్వు చెప్పిన లక్ష కోట్ల లెక్కలు నాలుగింతలు చంద్రబాబుకి సరిపోతాయి. జన్మభూమి కమిటీల పేరుతో ఊర్లకి ఊర్లు దోచేస్తే ఎందుకు మాట్లాడలేకపోయావు. ఈ మాటలన్నీ ఎవరు చెప్పమంటే చెప్తున్నావు. ఇప్పటికైనా వలంటీర్ల వ్యవస్ధని గౌరవించు. వాలంటీర్ల ద్వారా కోటి 60 లక్షల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. పార్టీలు, కులాలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం’’ అని కొట్టు సత్యనారాయణ అన్నారు. వలంటీర్లపై కామెంట్లతో పవన్ పతనం ఆరంభం: మంత్రి వేణు ‘‘పవన్ వ్యాఖ్యలతో మహిళల మనోభావాలు దెబ్బ తిన్నాయని, చంద్రబాబు ఏది రాసిస్తే అది మాట్లాడటమే పవన్‌కు తెలుసు’’ అంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. పవన్ మాటలకు అర్ధం ఉందా ? పవన్ ఎన్నిసీట్లలో పోటీచేస్తాడో ఎందుకు చెప్పడు. మొన్నటి వరకూ రెండు రాష్ట్రాలకు నాయకుడిని అన్నాడు. ఇప్పుడు రెండు జిల్లాలకు నాయకుడయ్యాడు. రేపు రెండు సీట్లకు నాయకుడవుతాడు’’ అని మంత్రి వేణు ఎద్దేవా చేశారు. వాలంటీర్లపై కామెంట్లతో పవన్ పతనం ఆరంభమైందని మంత్రి అన్నారు. -
‘పవన్‌కు కావాల్సింది చంద్రబాబే.. జనసేన కార్యకర్తలు కాదు’
సాక్షి, అమరావతి: సీఎం జగన్ అంటే పవన్,చంద్రబాబు వణికిపోతున్నారని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ముఖంలో ఆనందం కోసమే పవన్ పోరాటమని, సీఎం జగన్‌కు ప్రజల్లో ఆదరణ చూసి పవన్ తట్టుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. ‘‘పవన్‌కు కావాల్సింది చంద్రబాబే..జనసేన కార్యకర్తలు కాదు.. పవన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకేం అర్థం కావడం లేదు. పేదల సంక్షేమం కోసం సీఎం జగన్ లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. చంద్రబాబు చేసిన మోసాలు పవన్‌కు కనిపించలేదా?. జనసేన పార్టీకి ఓ సిద్ధాంతం, విధానమంటూ ఏమీ లేవు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి.. హైదరాబాద్ నుంచి విజయవాడ పారిపోయివచ్చారు’’ అంటూ అడపా శేషు మండిపడ్డారు. చదవండి: ఏది నిజం?: అసలే డ్రామోజీ.. చేతిలో ‘ఛీ’నాడు -
పూటకో మాట.. టీడీపీతో పొత్తుపై పవన్ మాట మార్పు
-
హత్య రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్: అడపా శేషు
-
తనకు ఓట్లు వేయలేదని కాపులపై పవన్ కు ఆగ్రహం : కాపు కార్పొరేషన్ చైర్మన్
-
‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ కాపులకు ఓ వరం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు విదేశాలలో ఉన్నత చదువులు చదువుకునేందుకు ‘జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం’ ఒక వరమని రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి చెప్పారు. ఆయన బుధవారం మంగళగిరి కాపు కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాపు సామాజికవర్గంలో వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల కలలను సాకారం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. రూ. 8 లక్షల లోపు వార్షికాదాయం ఉండి, విదేశీ విద్యార్హత పరీక్షలో స్కోరు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ పథకం ద్వారా విదేశాలలో పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ చదవొచ్చని తెలిపారు. ప్రపంచంలో 1 నుంచి 100 ర్యాంకుల్లోని యూనివర్సిటీలకు ఎంపికైన విద్యార్థులకు 100 శాతం ట్యూషన్ ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందని, 200 వరకు ర్యాంకుల్లో ఉన్న వర్సిటీలకు ఎంపికైన వారికి రూ.50 లక్షలు, లేదా ట్యూషన్ ఫీజులో 50 శాతం చెల్లిస్తుందని వివరించారు. ఈ పథకం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుందన్నారు. అర్హత గలవారు సెప్టెంబర్ 30వ తేదీలోపు http:// jnanabhumi. ap. gov. in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలు, సందేహాల నివృత్తికి 63054 48393, 63051 59559 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో కాపుల సంక్షేమానికి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రూ.32 వేల కోట్లు, కాపు నేస్తం కింద మహిళలకు రూ.1,500 కోట్లు అందించామని తెలిపారు. కాపు కార్పొరేషన్ ద్వారా త్వరలో రుణాలు ఇస్తామన్నారు. విజయవాడ సింగ్‌నగర్‌లో కాపు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసిందని చెప్పారు. -
బాబు, లోకేశ్ స్క్రిప్ట్‌నే చదువుతున్న పవన్
సాక్షి, అమరావతి: వీకెండ్లో ఒకసారి వచ్చి జనవాణి అంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రభుత్వంపై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారని రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి (శేషు) విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్, పచ్చమీడియా స్క్రిప్ట్‌నే పవన్ చదువుతున్నాడని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ పథకాన్ని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శేషు మాట్లాడుతూ.. పవన్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కనీసం తాను కాపునని ధైర్యంగా చెప్పుకోలేని పవన్‌కల్యాణ్ ఇప్పుడు కాపులపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని పదేపదే చెప్పుకొనే పవన్.. కాపు సంక్షేమానికి నిధులు కేటాయించకుండా దగాచేసిన, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా వేధించిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. వారానికోసారి బయటకు వచ్చి అవాకులు చెవాకులు పేలుతున్న పవన్‌కల్యాణ్ ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకువస్తే కాపులకు నిజంగా మేలు చేసిందెవరో రుజువులతో సహా వివరిస్తానని చెప్పారు. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ నిజమైన హీరో అని పేర్కొన్నారు. బాబు హయాంలో అక్రమాలు చంద్రబాబు హయాంలో విదేశీ విద్య అమల్లో జరిగిన అక్రమాలను, లోపాలను విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం గుర్తించిందని తెలిపారు. 2016–17 నుంచి విదేశీ విద్య కోసం చెల్లించాల్సిన రూ.318 కోట్లను గత ప్రభుత్వం బకాయి పెట్టిందన్నారు. 2014 నుంచి 2017 వరకు కాపు కార్పొరేషన్‌కు అప్పటి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు. కాపు కార్పొరేషన్‌ను చంద్రబాబు నిర్వీర్యం చేస్తే, కాపునేస్తంతోపాటు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన నిజమైన కాపునేస్తం సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. కాపునేస్తం ద్వారా ఏడాదికి రూ.500 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.2,500 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. -
కాపుల అభ్యున్నతికి జగన్ కట్టుబడి ఉన్నారు : అడపా శేషు
-
AgriGold: 300 మంది ఆత్మహత్యలకు చంద్రబాబే కారణం
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలోనే అగ్రిగోల్డ్ వ్యవస్థ పుట్టిందని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలోనే అగ్రిగోల్డ్ బాధితులకు శఠగోపం పెట్టారని తెలిపారు. సోమవారం ఏర్పాటుచేసిన ఓ సమావేవంలో ఆయన మాట్లాడారు.. 300 మంది అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యలకు చంద్రబాబే కారణమని చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే వైఎస్ జగన్మోహన్రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా ఇచ్చారని గుర్తుచేశారు. -
ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ గా శేషగిరిరావు ప్రమాణస్వీకారం
-
అన్ని వర్గాలకు సీఎం జగన్ ప్రాధాన్యత: పేర్ని నాని
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా అడపా శేషు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్బంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టిందని గుర్తు చేశారు. ఇక మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. కాపుల ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టిన బాబుకు తగిన శాస్తి జరిగిందని విమర్శించారు. అందరూ బాగుండాలి.. అందులో కాపులు ఉండాలి అనే సిద్ధాతంతో కొనసాగుతామని అన్నారు. -
‘సీఎం జగన్ కాపులకు పెద్ద పీట వేశారు’
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేత అడపా శేషుకు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం నామినేటెడ్ పోస్టులను ప్రకటించారు. దీనిలో భాగంగా అడపా శేషుకు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. తనకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అడపా శేషు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఎప్పుడూ మరువలేదు. రాష్ట్రంలో సీఎం జగన్ కాపులకు పెద్ద పీట వేశారు. పార్టీకి మంచి పేరు తీసుకుని వచ్చే విధానంగా పని చేస్తాను’’ అని అడపా శేషు తెలిపారు. ‘‘రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్ కాపు కార్పొరేషన్. నిబద్ధతతో పని చేస్తాను. కాపు కులానికి అండగా ఉంటాను. ముఖ్యమంత్రి జగనన్నను నమ్ముకుంటే కచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. రాష్ట్రంలో సీఎం జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం జగన్ కాపు కార్పొరేషన్‌కే ఎక్కువగా నిధులు ఇచ్చారు’’ అని అడపా శేషు తెలిపారు. -
కాపు విద్యార్థుల కోసం విదేశీ విద్యా దీవెన పథకం
-
‘టీడీపీ కాపులకు నమ్మక ద్రోహం చేసింది’
సాక్షి, విజయవాడ : గత టీడీపీ ప్రభుత్వం కాపులకు నమ్మక ద్రోహం చేసిందని కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా విమర్శించారు. సంవత్సరానికి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి.. ఐదేళ్లలో పదిహేడు వందల కోట్లు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. విదేశి విద్య పథకంలో లబ్ధికోసం 400 మంది దరఖాస్తు చేసుకున్నారని, రెండు రోజులపాటు సర్టిఫెకేట్ల వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. విదేశి విద్యకు దరకాస్తు చేసుకున్న అర్హులైన కాపులందరికీ అవాకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాపుల కోసం ఒక్క ఏడాదిలోనే రెండు వేల కోట్లు కేటాయించారని వెల్లడించారు. సీఎం జగన్ సూచనలతో కాపు సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులంలోని ప్రతి ఒక్కరికీ కాపు కార్పొరేషన్ న్యాయం చేస్తుందని జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. -
కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా ‘జక్కంపూడి’
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం : రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు విజయవాడలోని ఎ–1 కన్వెన్సన్ సెంటర్లలో పార్టీ నాయకులు, జక్కంపూడి అభిమానులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. కాపు కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ఎవరిని నియమించాలనే దానిపై పలువురు పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ యువకుడు, దివంగత జక్కంపూడి తనయుడు కావడం, పార్టీలో యువజన విభాగంలో క్రియాశీలకంగా ఉండటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే రాజా వైపే మొగ్గుచూపించారు. పార్టీ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు కూడా రాజాకు చైర్మన్ పదవి కట్టబెట్టే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేయడంతో చైర్మన్ పదవి ఖాయమైంది. కాపులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి అయ్యాక తొలి బడ్జెట్లోనే రూ.2000 కోట్లు కాపు కార్పొరేషన్‌కు కేటాయించి కాపుల అభ్యున్నతికి తొలి అడుగు వేశారు. ఈ క్రమంలోనే ఇటీవలనే కాపు కార్పొరేషన్‌ను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించే దిశగా ముఖ్యమంత్రి జగన్ ఐఏఎస్ అధికారి హరీంద్రప్రసాద్‌ను ఎండీగా నియమించారు. ఇందుకు భిన్నంగా గత చంద్రబాబు పాలనలో కాపు కార్పొరేషన్లో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బడ్జెట్ కేటాయింపుల్లో కూడా కోత పెట్టి బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు చెప్పి మాట తప్పారు. ఈ క్రమంలోనే యువకుడైన రాజా కార్పొరేషన్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తారనే నమ్మకంతో కేటాయించారు. రాజా ప్రమాణస్వీకారోత్సవానికి రాష్ట్రంతోపాటు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు శనివారమే విజయవాడ తరలివెళ్లారు. -
కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జక్కంపూడి రామ్మెహన్ తనయుడే రాజా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జక్కంపూడి కుటుంబం...ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటే ఉన్నారు. మరోవైపు జక్కంపూడి రాజాను కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించడంపై కాపు సామాజిక వర్గనేతలు హర్షం వ్యక్తం చేశారు. -
కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా యువ ఎమ్మెల్యే?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ యువ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమించబోతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకుని రాజాకు తెలియజేసినట్లు సమాచారం. రెండు లేదా మూడు రోజుల్లో రాజాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర పీపీగా శ్రీనివాసరెడ్డి రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)గా కొనకంటి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఈ పోస్టులో కొనసాగుతారు. క్రిమినల్ కేసులను వాదించడంలో శ్రీనివాసరెడ్డికి మంచి పేరుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు భర్తీకి సర్కారు ఇటీవల ముగ్గురు న్యాయవాదుల ప్యానెల్‌ను హైకోర్టుకు పంపింది. నిబంధనల ప్రకారం ఈ ప్యానెల్ నుంచి హైకోర్టు శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేసి, అందుకు సంబంధించిన లేఖను ఈనెల 16న రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. హైకోర్టు సిఫారసు మేరకు ప్రభుత్వం శ్రీనివాసరెడ్డిని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాసరెడ్డి హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రాసిక్యూషన్లు, అప్పీళ్లు, ఇతర ప్రొసీడింగ్స్ చేపడతారు. శ్రీనివాసరెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.