కాపునాడు చైర్మన్‌ను అడ్డుకున్న సంఘాలు | kapu corporation chairman Chalamalasetty Ramanujaya visits westgodavari | Sakshi
Sakshi News home page

కాపునాడు చైర్మన్‌ను అడ్డుకున్న సంఘాలు

Published Mon, Jan 18 2016 12:41 PM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM

kapu corporation chairman Chalamalasetty Ramanujaya visits westgodavari

ఆర్‌ఆర్‌పేట: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణానికి వచ్చిన కాపునాడు కార్పొరేషన్ చైర్మన్ జలమలశెట్టి రామానుజయను సోమవారం కాపునాడు నగర శాఖ నిలదీసింది. సంఘం నగర అధ్యక్షుడు జెల్లా హరికృష్ణ ఆధ్వర్యంలో సంఘం నాయకులు జిల్లా పరిషత్ గెస్ట్‌హౌస్ వద్ద కాపునాడు చైర్మన్‌ను అడ్డగించారు.
 
కాపులకు రిజర్వేషన్లపై ఇప్పటి వరకూ అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదని ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్లకు సంబంధించి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో జారీ చేసిన జీవో 30ని అమలు చేయాలని కోరారు. కాపునాడు కార్పొరేషన్‌కు ఏటా రూ.1,000 కోట్లు ఇస్తామని చెప్పి.. కేవలం రూ.100 కోట్లు ఇచ్చారని, అవి 13 జిల్లాలకు ఎలా పంచుతారని ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement