సాక్షి, తాడేపల్లి: పేదల రక్తం పీల్చే వ్యక్తి చంద్రబాబు అయితే, ప్రజల కోసం తన రక్తాన్ని ధారపోసే వ్యక్తి సీఎం జగన్ అని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు, లోకేష్, పవన్‌లకు ఈ రాష్ట్ర ప్రజల గురించి అవసరం లేదంటూ దుయ్యబట్టారు. అర్జంట్‌గా అధికారంలోకి రావాలన్నదే వారి ఆలోచన. తన వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే చూసుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్. జనసేన శ్రేణుల సమస్యలు కూడా పవన్‌కు అవసరం లేదని ధ్వజమెత్తారు.
పవన్‌కు కావాల్సిందల్లా కేవలం చంద్రబాబు, లోకేష్ బాగోగులే. జనసేన పార్టీ పెట్టించింది చంద్రబాబేనని మేం ఎప్పుడో చెప్పాం. జన సైనికులు అప్పుడు నమ్మలేదు.. ఇప్పుడు బాధపడుతున్నారు. పవన్ సీనియర్ టీడీపీ కార్యకర్తలా తయారయ్యాడు. పవన్ చేస్తున్న పనులతో జన సైనికులు అవమానంతో కుమిలిపోతున్నారు. చంద్రబాబు లేకపోతే తన మనుగడ సాగదని పవన్ ఆలోచన. పవన్ తన పక్కన లేకపోతే జనం రారేమోనని చంద్రబాబు భయం. చంద్రబాబు,లోకేష్,పవన్ ను నమ్మే పరిస్థితిలో జనం లేరు
యువగళం ముగింపు సభ అట్టర్ ప్లాఫ్’’ అంటూ అడపా శేషు వ్యాఖ్యానించారు.
చంద్రబాబే సీఎం అభ్యర్ధని ఓ ఇంటర్యూలో లోకేష్ స్పష్టంగా చెప్పాడు. పవన్‌ను ప్యాకేజ్ స్టార్ అంటే మమ్మల్ని అందరూ విమర్శించారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఎవరు సమాధానం చెబుతారు?. పవన్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే. జన సైనికులు, కాపు సామాజికవర్గ పెద్దలు ఆలోచన చేయాలి. భారతదేశంలో ఎవరూ చేయలేనంత గొప్పగా సీఎం జగన్ సంస్కరణలున్నాయి. చంద్రబాబు, పవన్, లోకేష్ చేస్తున్న రాజకీయం చూస్తుంటే సిగ్గేస్తోంది’’ అని శేషు దుయ్యబట్టారు.
ప్రజల రక్తాన్ని పీల్చి కోట్లు సంపాదించిన వ్యక్తి చంద్రబాబు. ఆ సంపద కోసం ఆశపడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకి పవన్ అమ్ముడుపోయాడు. తెలంగాణ ఎన్నికల్లో ఎనిమిదిచోట్ల పోటీచేసిన పవన్ పార్టీ తుస్సుమంది. తనను నమ్ముకున్నవారిని ఇంకా పిచ్చోళ్లను చేసే ప్రయత్నంలో పవన్ ఉన్నాడు. కాపులకు ప్రాధాన్యం కల్పించింది వైఎస్సార్ కుటుంబమే. కాపులను రోడ్ల పై ఈడ్చి తన్నించిన చరిత్ర చంద్రబాబుది. కాపులకు కొమ్ముకాసిందెవరో.. అమ్ముకున్నదెవరో తెలుసుకోండి. ఛాలెంజ్ చేసి చెబుతున్నా.. కాపులను పవన్.. చంద్రబాబుకు అమ్మేశాడు’’ అంటూ అడపా శేషు ధ్వజమెత్తారు.
సీఎం జగన్ 2 వేల కోట్లు కాపు నేస్తానికి ఖర్చు చేశారు. పవన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే తనకు ఎన్ని సీట్లిస్తారో ప్రకటించాలి. అచ్చెన్నాయుడికి టిక్కెట్ ఇవ్వనని చెప్పే దమ్ము చంద్రబాబుకి ఉందా?. సమర్ధవంతమైన వ్యక్తిని ప్రకటించే దమ్ము సీఎం జగన్‌కే ఉంది. సీఎం జగన్ సింహంలా సింగిల్ గానే వస్తాడు.. 175 సీట్లలో గెలుస్తారు’’ అని అడపా శేషు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment