
సాక్షి, విజయవాడ: పవన్‌కు సిద్ధాంతాలు.. విలువలు లేవంటూ దుయ్యబట్టారు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐవీ కృష్ణారావు రాజధాని భూములపై పుస్తకం రాసినప్పుడు పవన్ ఏం మాట్లాడాడో గుర్తు చేసుకోవాలన్నారు. రాజధాని పేరుతో ఒక సామాజికవర్గం భూములు దోపిడీ చేస్తుందని మాట్లాడిన మాటలు మర్చిపోయావా పవన్ అంటూ అడపా శేషు నిలదీశారు.
దోపిడీని అరికడతానని చెప్పి చంద్రబాబు పంచన చేరావా పవన్. చంద్రబాబు చేసిన దుర్మార్గాలపై నువ్వు ఏం మాట్లాడావో మర్చిపోయావా? చంద్రబాబు, లోకేష్‌పై నువ్వెంత నీచంగా మాట్లాడావో మర్చిపోయావా?. చంద్రబాబు దోపిడీ దొంగల ముఠాకు నాయకుడివి అన్నావ్ గుర్తులేదా?. పవన్‌కు తన మాట మీద నిలకడ లేదు. కాపులను చంద్రబాబుకు తాకట్టు పెట్టడానికి తప్ప నువ్వు దేనికీ పనికిరావు’’ అంటూ పవన్‌ను అడపా శేషు దుయ్యబట్టారు.
ఏం సాధిద్ధామని చంద్రబాబు పంచన చేరావ్ పవన్. కాపులను ఎలా బేరం పెట్టావో అందరూ చూస్తున్నారు. అడుక్కోవద్దు...శాసించు అని హరిరామ జోగయ్య చెప్పింది వినిపించలేదా?. చంద్రబాబు నీకెన్ని సీట్లిస్తాడు..అందులో నువ్వెన్ని కాపులకు ఇస్తున్నావో చెప్పు.. నీకు దమ్ము ధైర్యం ఉంటే హరిరామజోగయ్య లేఖలో చెప్పిన పేర్లన్నీ ప్రకటించు. పవన్ నువ్వు క్లాస్‌గా కమ్మగా ఉన్నావని ప్రజలందరీకీ తెలుసు. పేద, బడుగు, బలహీన వర్గాల మాస్ లీడర్ సీఎం జగన్’’ అని అడపా శేషు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చంద్రబాబుకు మల్లాది విష్ణు స్ట్రాంగ్ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment