జక్కంపూడి రాజా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ యువ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమించబోతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకుని రాజాకు తెలియజేసినట్లు సమాచారం. రెండు లేదా మూడు రోజుల్లో రాజాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర పీపీగా శ్రీనివాసరెడ్డి
రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)గా కొనకంటి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఈ పోస్టులో కొనసాగుతారు. క్రిమినల్ కేసులను వాదించడంలో శ్రీనివాసరెడ్డికి మంచి పేరుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు భర్తీకి సర్కారు ఇటీవల ముగ్గురు న్యాయవాదుల ప్యానెల్‌ను హైకోర్టుకు పంపింది. నిబంధనల ప్రకారం ఈ ప్యానెల్ నుంచి హైకోర్టు శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేసి, అందుకు సంబంధించిన లేఖను ఈనెల 16న రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. హైకోర్టు సిఫారసు మేరకు ప్రభుత్వం శ్రీనివాసరెడ్డిని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాసరెడ్డి హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రాసిక్యూషన్లు, అప్పీళ్లు, ఇతర ప్రొసీడింగ్స్ చేపడతారు. శ్రీనివాసరెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment