public prosecutor
-
చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలకు డీజీపీ లీగల్ నోటీసులు
సాక్షి, అమరావతి: కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) గుజరాత్లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేకున్నా అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడంతోపాటు తమ ప్రతిష్టకు భంగం కలిగించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేశ్, పలువురు టీడీపీ నేతలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ లీగల్ నోటీసులు జారీ చేశారు. నిరాధార ఆరోపణలతో కథనాలు.. ‘రాష్ట్రంలో జోరుగా డ్రగ్స్ రవాణా– గుజరాత్లో పట్టుబడ్డ హెరాయిన్ సీఎం ఇంటి సమీపంలో సంస్థలదే’, ‘దీనికి సీఎం, డీజీపీ ఏమని సమాధానం చెబుతారు?’, ‘మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై డీజీపీ అవాస్తవాలు’ అనే శీర్షికలతో ఈనాడు పలు కథనాలను ప్రచురించింది. ‘జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి’, డ్రగ్స్ మాఫియాకు రాష్ట్రాన్ని నిలయంగా మార్చారు. దీనికి జగన్, డీజీపీ ఏం చెబుతారు?, చంద్రబాబు ధ్వజం’ అనే శీర్షికలతో ఆంధ్రజ్యోతి వార్తలు ప్రచురించింది. నిరాధారమైన ఆరోపణలు చేయడం, వాటిని ప్రచురించడంపై చంద్రబాబు, లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, బొండా ఉమా, బుద్దా వెంకన్న, కొమ్మారెడ్డి పట్టాభి, ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీరావు, ఆయన కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్, ఉషోదయ పబ్లికేషన్స్, ఈనాడు ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, ఆ పత్రిక బ్యూరో చీఫ్‌తోపాటు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఆమోద పబ్లికేషన్స్, ప్రింటర్–పబ్లిషర్ కోగంటి వెంకట శేషగిరిరావు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, ఆ పత్రిక బ్యూరో చీఫ్‌లకు డీజీపీ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరెడ్డి లీగల్ నోటీసులు ఇచ్చారు. దురుద్దేశపూర్వకంగానే.. డీఆర్ఐ గుజరాత్లో స్వాధీనం చేసుకున్న రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదని విజయవాడ పోలీస్ కమిషనర్ స్పష్టం చేసినప్పటికీ చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు ప్రభుత్వ ప్రతిష్టకు విఘాతం కలిగించడంతోపాటు పోలీసు శాఖ నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేలా అసత్య ఆరోపణలు చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ హెరాయిన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదని డీఆర్ఐ ప్రకటించినా, డీజీపీ కూడా స్పష్టత ఇచ్చినా దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. ఆ నిరాధార ఆరోపణలపై వాస్తవాలను నిర్ధారించుకోకుండానే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రముఖంగా ప్రచురించి పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించాయన్నారు. దురుద్దేశపూరిత చర్యలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖకు క్షమాపణలు చెప్పడంతోపాటు ఆ వార్తను ఆయా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించాలని నోటీసులో పేర్కొన్నారు. లేనిపక్షంలో వారిపై డీజీపీ న్యాయపరమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. చదవండి: తెలుగు అకాడమీ స్కాంలో వెలుగుచూసిన కొత్త కోణం -
తెలంగాణలో ఏపీపీ ఉద్యోగాలు.. నెలకు 54 వేల జీతం
హైదరాబాద్‌లోని లక్డీకపూల్లో ఉన్న తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(టీఎస్ఎల్పీఆర్బీ).. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 151(మల్టీ జోన్–1–68, మల్టీ జోన్–2–83). ► అర్హత: ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీతోపాటు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా (ఎల్ఎల్బీ/బీఎల్)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఇంటర్మీడియట్ తర్వాత ఐదేళ్ల లా కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 04.07.2021 నాటికి అభ్యర్థులు రాష్ట్రంలోని ఏదైనా క్రిమినల్ కోర్టులో మూడేళ్లకు తగ్గకుండా.. అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తుండాలి. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 34 ఏళ్లు మించకూడదు. ► వేతనం: నెలకు రూ.54,220 నుంచి 1,33,630 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో పేపర్–1, 100 మార్కులకు(200 ప్రశ్నలు), పేపర్–2, 100 మార్కులకు ఉంటుంది. పేపర్–1 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో.. పేపర్–2 డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం 3 గంటలు. రెండు పేపర్లకు సంబంధించిన ఈ పరీక్షను ఇంగ్లిష్ మీడియంలో నిర్వహిస్తారు. పేపర్–1లో అర్హులైన అభ్యర్థులకు మాత్రమే పేపర్–2 మూల్యాంకనం చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:31.07.2021 ► వెబ్సైట్: https://www.tslprb.in -
కీచక న్యాయవాది: కన్న కూతురిపై..
సాక్షి, రంగారెడ్డి : పవిత్రమైన న్యాయవాద వృత్తికి.. తండ్రి అనే మాటకు కలంకం తెచ్చేడో వ్యక్తి. కీచకుడిలా మారి కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... హైదర్షాకోట్, కపిల నగర్ కాలనీలో నివాసం ఉంటున్న సత్యనారాయణ గౌడ్ వరంగల్ జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పదవ తరగతి చదువుకుంటున్న కన్న కూతుర్ని బెదిరించి తరచూ లైంగిక దాడికి పాల్పడేవాడు.( విచక్షణ కోల్పోయి: భార్య, కుమారుడిపై...) ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించింది. ఇది గమనించిన తల్లి మంజుల కూతుర్ని గట్టిగా నిలదీసింది. దీంతో కన్న తండ్రి చేస్తున్న నీచమైన పనులను తల్లికి చెప్పింది. మంజుల దీనిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భర్తతో కూతురికి రక్షణ లేదని ఆమె పోలీసులకు తెలిపింది. -
కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా యువ ఎమ్మెల్యే?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ యువ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమించబోతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకుని రాజాకు తెలియజేసినట్లు సమాచారం. రెండు లేదా మూడు రోజుల్లో రాజాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర పీపీగా శ్రీనివాసరెడ్డి రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)గా కొనకంటి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఈ పోస్టులో కొనసాగుతారు. క్రిమినల్ కేసులను వాదించడంలో శ్రీనివాసరెడ్డికి మంచి పేరుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు భర్తీకి సర్కారు ఇటీవల ముగ్గురు న్యాయవాదుల ప్యానెల్‌ను హైకోర్టుకు పంపింది. నిబంధనల ప్రకారం ఈ ప్యానెల్ నుంచి హైకోర్టు శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేసి, అందుకు సంబంధించిన లేఖను ఈనెల 16న రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. హైకోర్టు సిఫారసు మేరకు ప్రభుత్వం శ్రీనివాసరెడ్డిని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాసరెడ్డి హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రాసిక్యూషన్లు, అప్పీళ్లు, ఇతర ప్రొసీడింగ్స్ చేపడతారు. శ్రీనివాసరెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. -
లంచం.. నిర్బంధం
కర్ణాటక, తుమకూరు: బాధితులకు న్యాయం చేయాల్సిన హోదాలో ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏకంగా కోర్టు ఆవరణలోనే లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టిబడ్డారు. ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని తిపటూరు తాలుకా న్యాయాలయం ఆవరణలో మంగళవారం చోటుచేసుకుంది. కేఇబీ ఇంజనీర్ గురుబసవ స్వామినుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా పీపీ పూర్ణిమను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 2015వ సంవత్సరంలో జిల్లాలో భారీగా వచ్చిన ఈదురు గాలులకు, వర్షాలకు కూలిపోయిన చెట్లు, కరెంట్ స్తంభాలను తొలగించడానికి అటవీ శాఖ, బెస్కాం అధికారులు పనులు చేపట్టారు. ఆ పనుల్లో వృద్ధుడు ఒకరు అధికారుల నిర్లక్ష్యం వల్ల తీవ్రంగా గాయపడటం జరిగింది. దాంతో ఆయన కుటుంబసభ్యులు అటవీ శాఖ, బెస్కాం అధికారులపైన తిపటూరు పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూ.40వేలకు ఒప్పందం ఈ కేసుకు సంబంధించి అనుకూలంగా పనిచేయాలంటే సొమ్ము ముట్టజెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్న పూర్ణిమా రూ. రూ.40 వేలను అటవీ, విద్యుత్ అధికారులను డిమాండు చేశారు. అందులో బాగంగా బెస్కాం ఇంజనీర్ గురుబసవ స్వామి ఇప్పటికే పూర్ణిమా బ్యాంకు ఖాతాలో రూ. 20 వేలను వేశారు. మిగిలిన రూ. 20 వేలను మంగళవారం కోర్టు ఆవరణలో పూర్ణిమాకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు వచ్చి నగదుతో పాటు పూర్ణిమాను అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఆమె చిక్కమగళూరులో, కడూరులో విధులు నిర్వహించినప్పుడు కూడా అవినీతికి పాల్పడిన కేసులున్నట్లు అధికారులు తెలిపారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీదేవి కేసు క్లోజ్.. దర్యాప్తు ముగిసింది
దుబాయి : ఎట్టకేలకు ప్రముఖ నటి శ్రీదేవి కేసు ముగిసింది. ఓ పక్క ఆమె హఠాన్మరణమే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేయగా ఆమె చనిపోవడానికి గల కారణాలపై వచ్చిన కథనాలు అనుక్షణం సంచలనాన్ని రేపాయి. ఎన్నోమలుపులు, ఎన్నో అనుమానాల చుట్టూ తిరిగి చివరకు ప్రమాదవశాత్తు జరిగినా మరణం తప్ప ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదని దుబాయ్ ప్రాసీక్యూషన్ అధికారులు తేల్చేశారు. దర్యాప్తు ఇక ముగిసిందని, కేసును క్లోజ్ చేశామని, ఇక ఎలాంటి అనుమానాలు లేవంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రాసిక్యూషన్ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. శనివారం రాత్రి 11 దాటిని తర్వాత శ్రీదేవి హఠాన్మరణం చెందారు. అయితే, ఆమె గుండెపోటుతో చనిపోయారని తొలుత అనుకున్నారు. అయితే, ఆమెకు పోస్టు మార్టం నిర్వహించిన తర్వాత వైద్యులు చేసిన పరీక్షల్లో ఆమె ప్రమాదవ శాత్తు నీటిలో పడి ఊపిరి ఆడక చనిపోయారని తేల్చేశారు. ఆమె దేహంలో ఆల్కహాల్‌కు సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయని, బహుశా స్నానానికి వెళ్లిన ఆమె పట్టును కోల్పోయి కాలు జారీ టబ్‌లో పడిపోయి ఉంటారని, ఆ క్రమంలోనే ఊపిరి ఆడక చనిపోయారని అన్నారు. అయితే, ఈ క్రమంలో బోనీ కపూర్‌ను కొన్ని గంటలపాటు మూడుసార్లు విచారించడం, ఆమె మృతదేహాన్ని అప్పగించేందుకు తొలుత ప్రాసీక్యూషన్ అధికారులు అంగీకరించకపోవడంతో బహుశా ఏవో బలమైన కారణాలే ఆమె చావుకు కారణం అయి ఉంటాయని భిన్న కథనాలు మరోసారి వేగం పుంజుకున్నాయి. ఆమె బాత్ టబ్‌లో అనుకోకుండా పడ్డారా? ఎవరైనా తోసేశారా? లేకుంటే ఏవైనా సమస్యలతో శ్రీదేవినే బలవన్మరణానికి పాల్పడ్డారా? బోనీ కపూర్ ఇండియాకు వచ్చి మళ్లీ సర్ప్రైజ్ పేరుతో దుబాయ్ వెళ్లడం ఏమిటి? ఆయన వెళ్లిన తర్వాత శ్రీదేవి చనిపోవడం ఏమిటి? పోలీసులు స్వాధీనం చేసుకున్న బోనీ కపూర్ కాల్ డేటాలో ఏమున్నాయి? ఆయన ఎవరితో మాట్లాడారు? శ్రీదేవి చివరి సారిగా ఎవరితో మాట్లాడారు? ఎక్కువగా ఎన్నిసార్లు ఎవరికి ఫోన్ చేశారు? అంటూ దాదాపు దర్యాప్తు బృందం లేవనెత్తెన్ని అనుమానాలతో మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. అయితే, వాటన్నింటికి పుల్‌స్టాప్ పెడుతూ దర్యాప్తు క్లియర్ అయిందని, ఇక ఎలాంటి అనుమానం లేదని, ఆమె అనుకోకుండా బాత్‌డబ్‌లో పడి ఊపిరి ఆడక చనిపోయారంటూ దుబాయ్ విచారణ అధికారులు తేల్చేయడంతో ఇక శ్రీదేవిని భారత్‌కు తీసుకురావడం, ఆమె అంత్యక్రియలకు సంబంధించిన అంశాలు మాత్రం మిగిలి ఉన్నాయి. -
జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా దబ్బర నారాయణస్వామి
అనంతపురం లీగల్ : జిల్లా కోర్టు పబ్లిక్‌ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది దబ్బర నారాయణ స్వామిని నియమిస్తూ రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన పదవీ కాలం మూడు సంవత్సరాల పాటు వుంటుంది. వజ్రకరూరు మండలం ధర్మపురి గ్రామం రైతు కుటుంబానికి చెందిన నారాయణస్వామి 1985 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాలు ఏపీఎస్ ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో చురుకుగా పాల్గొని కొంతకాలం టీడీపీ లీగల్‌సెల్‌కు ప్రాతిని«థ్యం వహించారు. -
‘ కస్టడీని మేజిస్ట్రేట్180రోజులకు పెంచొచ్చ్చు’
చెన్నై: చట్ట విరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి కస్టడీని 180 రోజుల వరకు పొడిగించే అధికారం కోర్టుకు ఉంటుందని మద్రాసు హైకోర్టు స్పష్టంచేసింది. అయితే దర్యాప్తు పురోగతిని పేర్కొంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమర్పించిన నివేదిక కోర్టును సంతృప్తి పరచినప్పుడే అది సాధ్యమవుతుందని తెలిపింది. రిమాండ్ ఖైదీ రిశ్వాన్ షరీఫ్‌కు 90 రోజుల కస్టడీ ముగిసినందున ఈ విషయంలో మేజిస్ట్రేట్ జోక్యం చేసుకోలేరని, అతడిని కోర్టు ముందు హాజరుపరచేలా అధికారులకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. -
న్యాయవాది ఇంట్లో భారీ చోరీ
కారంచేడు: న్యాయవాది ఇంట్లో భారీ చోరీ జరిగిన ఘటన శుక్రవారం తెల్లవారు జామున గుంటూరు జిల్లాలో జరిగింది. జిల్లాలోని కారంచేడులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పనిచేస్తున్నయార్లగడ్డ వెంకటేశ్వరరావు కుటుంబం పైఅంతస్తులో నిద్రిస్తుండగా కింది అంతస్తులోని దొంగలు చొరబడ్డారు. రూ.20 లక్షల70 వేల నగదు, 29.4 సవర్ల బంగారం చోరీకి గురైంది. చోరీ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
’సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది’
-
'బెయిల్ నిశ్చితార్థం కోసం కాదు'
-
'బెయిల్ నిశ్చితార్థం కోసం కాదు'
రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తానని స్వయంగా ఆయనే మీడియాకు చెప్పారని, అలాంటి వ్యక్తికి మధ్యంతర బెయిల్ ఇస్తే సాక్ష్యాలను పూర్తిగా ప్రభావితం చేస్తారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. రేవంత్ రెడ్డికి బెయిలిస్తే సాక్ష్యాధారాలను మాయం చేసే అవకాశం ఉందని పీపీ కోర్టుకు విన్నవించారు. అయితే.. ఆయన కూతురి నిశ్చితార్థం కోసం ఎస్కార్టుతో కూడిన ఒకరోజు బెయిల్ ఇస్తే మాత్రం తమకు అభ్యంతరం లేదన్నారు. నిశ్చితార్థం కోసం కాకుండా ఇతర ఉద్దేశాలతోనే బెయిల్ అడుగుతున్నారనే అనుమానం తమకు కలుగుతోందని ఆయన చెప్పారు. లంచం ఇవ్వడం ఎన్నుకున్న ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయమేనని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డిపై ఇప్పటికే కొన్ని క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని, ఆయన డ్రైవర్ ఇంకా తప్పించుకునే తిరుగుతున్నారని తెలిపారు. ఈకుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి వివిధ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించారని, వాటికి వెళ్లేటప్పుడు గన్‌మెన్‌ను కూడా వదిలి వెళ్లేవారని పీపీ కోర్టుకు చెప్పారు. ముగ్గురు నిందితులను విచారించాక దొరికిన ఆధారాలతోనే వాళ్ల ఇళ్లలోసోదాలు చేశామని, ఉదయసింహ ఇంట్లో భారీగా డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని, దాంతోపాటు రేవంత్ రెడ్డికి సంబంధించిన లావాదేవీల డాక్యుమెంట్లు కూడా దొరికాయని అన్నారు. కేవలం వీడియో ఫుటేజి ఆధారంగానే కేసులు పెట్టలేదని, తమవద్ద కచ్చితమైన ఆధారాలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఇచ్చిన 50 లక్షలు కాకుండా మిగిలిన రూ. 4.50 కోట్లు ఎక్కడున్నాయనే కోణంలో విచారణ చేపడుతున్నామన్నారు. -
పద్మనాభరెడ్డికి హైకోర్టు ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ న్యాయ కోవిదుడు, సీనియర్ న్యాయవాది సి.పద్మనాభరెడ్డికి హైకోర్టు మంగళవారం ఘనంగా నివాళులు అర్పించింది. న్యాయ వ్యవస్థకు ఆయన చేసిన సేవలను కొనియాడింది. పద్మనాభరెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటని విచారం వ్యక్తంచేసింది. గుండెపోటుతో ఈనెల 4న కన్నుమూసిన పద్మనాభరెడ్డికి నివాళులు అర్పించేందుకు మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా నేతృత్వంలో న్యాయమూర్తులందరూ సమావేశయ్యారు. అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, అదనపు ఏజీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రభుత్వ న్యాయవాదులతో పాటు న్యాయవాదులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తిలోకి వచ్చిన కొత్తలోనే మానవ హక్కుల రక్షణ కోసం పద్మనాభరెడ్డి ఎంతో తపనపడ్డారని, చివరి వరకు అలాగే పనిచేశారని కొనియాడారు. ‘‘వృత్తిపట్ల అంకితభావం, క్రిమినల్ లా పట్ల అపారమైన విజ్ఞానం, వెరసి ఆయనకు భారీస్థాయిలో కేసులు తీసుకొచ్చాయి. హైకోర్టులో అపారమైన ప్రాక్టీస్ దృష్ట్యా ఆయన క్రిమినల్ లాలో నడిచే ఎన్సైక్లోపీడియాగా పేరుపొందారు. తన వ్యక్తిత్వంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు పద్మనాభరెడ్డి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. పేదలు, అణగారిన వర్గాల న్యాయవాదిగా పేరుపొందారు. ’అని జస్టిస్ సేన్‌గుప్తా ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని తన తరఫున, తన సహచర న్యాయమూర్తుల తరఫున ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పద్మనాభరెడ్డి మృతికి సంతాపంగా మధ్యాహ్నం నుంచి కోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు.