
‘ కస్టడీని మేజిస్ట్రేట్180రోజులకు పెంచొచ్చ్చు’
చెన్నై: చట్ట విరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి కస్టడీని 180 రోజుల వరకు పొడిగించే అధికారం కోర్టుకు ఉంటుందని మద్రాసు హైకోర్టు స్పష్టంచేసింది. అయితే దర్యాప్తు పురోగతిని పేర్కొంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమర్పించిన నివేదిక కోర్టును సంతృప్తి పరచినప్పుడే అది సాధ్యమవుతుందని తెలిపింది.
రిమాండ్ ఖైదీ రిశ్వాన్ షరీఫ్‌కు 90 రోజుల కస్టడీ ముగిసినందున ఈ విషయంలో మేజిస్ట్రేట్ జోక్యం చేసుకోలేరని, అతడిని కోర్టు ముందు హాజరుపరచేలా అధికారులకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను డివిజన్ బెంచ్ కొట్టివేసింది.