
సాక్షి, రంగారెడ్డి : పవిత్రమైన న్యాయవాద వృత్తికి.. తండ్రి అనే మాటకు కలంకం తెచ్చేడో వ్యక్తి. కీచకుడిలా మారి కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... హైదర్‌షాకోట్, కపిల నగర్ కాలనీలో నివాసం ఉంటున్న సత్యనారాయణ గౌడ్ వరంగల్ జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పదవ తరగతి చదువుకుంటున్న కన్న కూతుర్ని బెదిరించి తరచూ లైంగిక దాడికి పాల్పడేవాడు.( విచక్షణ కోల్పోయి: భార్య, కుమారుడిపై...)
ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించింది. ఇది గమనించిన తల్లి మంజుల కూతుర్ని గట్టిగా నిలదీసింది. దీంతో కన్న తండ్రి చేస్తున్న నీచమైన పనులను తల్లికి చెప్పింది. మంజుల దీనిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్తతో కూతురికి రక్షణ లేదని ఆమె పోలీసులకు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment