అనంతపురం లీగల్ : జిల్లా కోర్టు పబ్లిక్‌ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది దబ్బర నారాయణ స్వామిని నియమిస్తూ రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన పదవీ కాలం మూడు సంవత్సరాల పాటు వుంటుంది. వజ్రకరూరు మండలం ధర్మపురి గ్రామం రైతు కుటుంబానికి చెందిన నారాయణస్వామి 1985 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాలు ఏపీఎస్ ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో చురుకుగా పాల్గొని కొంతకాలం టీడీపీ లీగల్‌సెల్‌కు ప్రాతిని«థ్యం వహించారు.