‘పవన్‌కు కావాల్సింది చంద్రబాబే.. జనసేన కార్యకర్తలు కాదు’ | Kapu Corporation Chairman Adapa Seshu Fires On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

‘పవన్‌కు కావాల్సింది చంద్రబాబే.. జనసేన కార్యకర్తలు కాదు’

Published Sat, Jun 17 2023 1:39 PM | Last Updated on Sat, Jun 17 2023 1:54 PM

Kapu Corporation Chairman Adapa Seshu Fires On Pawan Kalyan - Sakshi

సీఎం జగన్‌ అంటే పవన్‌,చంద్రబాబు వణికిపోతున్నారని కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌ అడపా శేషు అన్నారు.

సాక్షి, అమరావతి: సీఎం జగన్‌ అంటే పవన్‌,చంద్రబాబు వణికిపోతున్నారని కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌ అడపా శేషు అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ముఖంలో ఆనందం కోసమే పవన్‌ పోరాటమని, సీఎం జగన్‌కు ప్రజల్లో ఆదరణ చూసి పవన్‌ తట్టుకోలేకపోతున్నారని ఆయన అన్నారు.

‘‘పవన్‌కు కావాల్సింది చంద్రబాబే..జనసేన కార్యకర్తలు కాదు.. పవన్‌ ఏం మాట్లాడుతున్నారో ఆయనకేం అర్థం కావడం లేదు. పేదల సంక్షేమం కోసం సీఎం జగన్‌ లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. చంద్రబాబు చేసిన మోసాలు పవన్‌కు కనిపించలేదా?. జనసేన పార్టీకి ఓ సిద్ధాంతం, విధానమంటూ ఏమీ లేవు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ పారిపోయివచ్చారు’’ అంటూ అడపా శేషు మండిపడ్డారు.
చదవండి: ఏది నిజం?: అసలే డ్రామోజీ.. చేతిలో ‘ఛీ’నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement