
సాక్షి, తాడేపల్లి: పవన్ కళ్యాణ్‌కు దమ్ముంటే మూడో భార్య పేరుతో ఉన్న ఇళ్లు, ఆస్తుల వివరాలు బయట పెట్టాలని కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనసేన నేత హరిరామజోగయ్యపై మండిపడ్డారు. వంగవీటి రంగ హత్య వెనుక చంద్రబాబు ఉన్నారని నీ పుస్తకంలో రాయలేదా?. ఇప్పుడు చంద్రబాబు అంత కమ్మగా ఎందుకు కనిపిస్తున్నారంటూ నిలదీశారు.
‘‘శాండ్, మైన్స్, వైన్స్ అన్నీ చంద్రబాబు సామాజిక వర్గం దోచుకున్న సంగతి తెలీదా?. అలాంటి వ్యక్తికి పవన్ మద్దతు ఇవ్వటం ద్వారా ఎంత వాటా పొందారు?. పవన్ కళ్యాణ్ రాజధానిలో బినామీల పేరుతో ఎన్ని ఆస్తులు సమకూర్చారో చెప్పాలి’’ అని శేషు డిమాండ్ చేశారు. మహిళలంటే సీఎం జగన్‌కి ఎంతో గౌరవం. అందుకే మహిళల పేరుతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న గజ దొంగ జైల్లో ఉన్నాడు. చిల్లర దొంగ పవన్ బయట ఉన్నారు’’ అంటూ అడపా శేషు మండిపడ్డారు.
చదవండి: చంద్రబాబు యాక్టివ్‌గా ఉన్నారు: వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment