Adapa Seshu Slams Pawan Kalyan - Sakshi
Sakshi News home page

‘ప్యాకేజీకి న్యాయం చేయడం కోసమే నీ పర్యటనలు’

Published Mon, Aug 14 2023 12:53 PM | Last Updated on Mon, Aug 14 2023 4:12 PM

Adapa Seshu Slams Pawan Kalyan - Sakshi

సాక్షి,  తాడేపల్లి:  పవన్‌ కల్యాణ్‌ దండుపాళ్యం బ్యాచ్‌ను వేసుకుని రుషికొండకు వెళ్లడం కరెక్టేనా అంటూ నిలదీశారు కాపు కార్పోరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు.  రుషికొండపై హరిత రిసార్ట్స్‌ ఉండేదనే విషయం పవన్‌కు తెలుసా అంటూ ప్రశ్నించారు. హరితా రిసార్ట్స్‌ మరుగున పడిపోవడంతోనే నూతన భవనాలను నిర్మిస్తున్నారని స్పష్టం చేశారు అడపా శేషు. 

రాయలసీమలో చంద్రబాబు దండుపాళ్యం బ్యాచ్ తో అరాచకం సృష్టించాడు. పవన్ దండుపాళ్యం బ్యాచ్ ను వేసుకుని రుషికొండకు వెళ్లాడు. పవన్ ప్రజలకు తన జెండా అజెండా ఎందుకు చెప్పడు. ఈ రాష్ట్రం కోసం పవన్ పీకిందేమీ లేదు. బాలకృష్ణ వియ్యంకుడు గీతం యూనివర్శిటీ అక్రమాలు నీ కళ్లకు కనిపించలేదా?, కబ్జాదారులకు కొమ్ము కాయడానికేనా వైజాగ్ లో పర్యటిస్తున్నావ్.  

పవన్ నువ్వు నీచమైన పరిస్థితికి దిగజారిపోయావ్. ప్యాకేజీకి న్యాయం చేయడం కోసమే నువ్వు పనిచేస్తున్నావ్. పేదలకు సీఎం జగన్‌ చేస్తున్న మంచిపై దుష్ప్రచారం చేయడమే నీపనా?, దండుపాళ్యం తయారు చేసుకుని చిల్లరనాయకుడులా వ్యవహరిస్తున్నావ్. కార్లమీద ఎక్కి ఫోజులివ్వడానికి ఇదేమైనా సినిమా అనుకున్నావా పవన్ కల్యాణ్. చంద్రబాబు నీకు ఎన్ని సీట్లిస్తాడో చెప్పు’అంటూ అడపా శేషు మండిపడ్డారు. 

చదవండి: పవన్‌కి జై కొడుతూ పిల్ల సైనిక్స్ భవిష్యత్‌ పాడు చేసుకుంటున్నారు: ఎమ్మెల్యే అనిల్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement