
సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషు సీరియస్ అయ్యారు. పవన్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఏపీ ప్రజలను కించపరిచేలా పవన్ మాట్లాడుతున్నాడంటూ ఫైరయ్యారు.
కాగా, అడపా శేషు తాడేపల్లిలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీ మంత్రులు తెలంగాణ ప్రజలను ఏమీ అనలేదు. కేవలం మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలకే బదులిచ్చారు. ఇక్కడ అభివృద్ధి గురించి హరీష్ మాట్లాడితే.. తెలంగాణలో పరిస్థితి గురించి వారు మాట్లాడారు. ఏపీ ప్రజలను కించపరిచేలా పవన్ మాట్లాడుతున్నారు. రాజకీయ కక్షతో మంత్రులపై పవన్ బురద చల్లుతున్నారు. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ దగ్గర ప్యాకేజీ తీసుకున్నారు. ఏపీ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పి రాష్ట్రానికి రావాలి’ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment