![Conspiracy in Minister Peddireddy Convoy Accident: Adapa Seshu - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/18/CAR-2.jpg.webp?itok=61tkd-E_)
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ రోడ్డు ప్రమాదానికి గురికావడం వెనుక కుట్ర కోణం దాగి ఉందని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై విచారణ కమిషన్ వేసి నిజనిర్ధారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
తన ప్రయోజనాల కోసం చంద్రబాబు చేసే నీచ రాజకీయాలు, హత్యా రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. చదువుకునే రోజుల నుంచి పెద్దిరెడ్డిని ఎదుర్కోలేని చంద్రబాబు ప్రతిసారి కుట్రలు చేసేవాడని ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పాలనను ప్రజలకు వివరించి వారి నుంచి విశేష ఆదరణ పొందుతున్న పెద్దిరెడ్డిని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్ పెట్టినా తాను సీఎం అవుతానని చెప్పడంలేదని, బాబును సీఎం చేయడానికే తాపత్రయ పడుతున్నట్టు అర్థమవుతోందన్నారు.
చదవండి: (మంత్రి పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం)
Comments
Please login to add a commentAdd a comment