Kapu, Kamma And Reddy Corporations Chairmans React On Pawan Kalyan Rekky Issue - Sakshi
Sakshi News home page

‘పవన్‌ కల్యాణ్‌ మీద రెక్కీ చేసింది చంద్రబాబు మనుషులే’

Published Fri, Nov 4 2022 4:28 PM | Last Updated on Fri, Nov 4 2022 5:16 PM

Kapu Kamma And Reddy Corporations Chairmans React On Pawan Kalyan Issue - Sakshi

సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మీద రెక్కీ చేయించింది చంద్రబాబు మనుషులేనని రెడ్డి, కమ్మ, కాపు కార్పోరేషన్ల చైర్మన్లు స్పష్టం చేశారు.  పవన్‌ కల్యాణ్‌పై వైఎస్సార్‌సీపీ రెక్కీ నిర్వహించిందంటూ వచ్చిన వార్తలను రెడ్డి, కమ్మ, కాపు కార్పోరేషన్ల చైర్మన్లు  ఖండించారు. ‘ పవన్‌పై రెక్కీ చేసింది చంద్రబాబు మనుషులే. సోషల్‌ మీడియాలో మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. వంగవీటి రంగా హత్య​ వెనుక ఎవరున్నారో ప్రజలు ఆలోచించాలి. కోనసీమ, తిరుపతి ఘటనల వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. అల్లర్ల వెనుక పవన్‌ కల్యాణ్‌ మనుషులే ఉన్నారు’ అని రెడ్డి కార్పోరేషన్‌ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు.

‘రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. విజయ్‌, ఆదిత్య చౌదరి, సాయికృష్ణ చౌదరి రెక్కీ నిర్వహించారు. రెక్కీ నిర్వహించిన వారు చంద్రబాబుతో ఫొటోలు దిగారు. కులాల కుంపట్లతో పవన్‌ను చంద్రబాబు బలి పశువును చేస్తున్నారు’ అని కమ్మ కార్పోరేషన్ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ తెలిపారు.

‘పవన్‌ సభకు జనసమీకరణం చేసింది టీడీపీ కాదా?,   కుట్ర పూరిత రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్‌ అడ్రస్‌. రెడ్డి, కాపుల మధ్య గొడవలు పెట్టి చంద్రబాబు లబ్ది పొందాలని చూస్తున్నారు. జనం అన్నీ గమనిస్తూనే ఉన్నారు.  చీఫ్ ట్రిక్స్ చేస్తే జనం పట్టించుకోరు. సీఎం జగన్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచిస్తామే తప్ప కుట్రల గురించి కాదు.  కాపు సామాజికవర్గం మీద కుట్ర జరుగుతుంది’ ’ అని కాపు కార్పోరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement