
సాక్షి, అమరావతి: పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ఒక సామాజిక వర్గానికి న్యాయం చేసేలా వ్యవహరిస్తున్నారని ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు ధ్వజమెత్తారు. పవన్ ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తున్నారని ఒక ప్రకటనలో విమర్శించారు.
ఉత్తరాంధ్ర ఉద్యమాన్ని నీరు గార్చే లక్ష్యంతో విశాఖ ప్రాంతంలో మూడు రోజులు పర్యటన పెట్టుకొన్నారని చెప్పారు. జనసేన ముసుగులో చంద్రబాబు కనుసైగలతో పవన్ పనిచేస్తున్నారని విమర్శించారు. విశాఖ గర్జన కార్యక్రమాన్ని ముందుగానే ప్రకటించినప్పటికీ, పవన్ హడావుడిగా అదే సమయంలో యాత్ర చేపట్టి ఏం సాధించదలుచుకున్నారని ప్రశ్నించారు.