uttarandra
-
ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి వైఎస్సార్సీపీ ‘సామాజిక సాధికారత బస్సు యాత్ర’.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఉత్తరాంధ్రలో టీడీపీకి భారీ షాక్..
సాక్షి, తాడేపల్లి: ఉత్తరాంధ్రలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో టీడీపీ సీనియర్ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ పార్టీ కండువా కప్పి సీఎం జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వివరాల ప్రకారం.. ఉత్తరాంధ్రలో టీడీపీ సీనియర్ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో అనకాపల్లి టీడీపీ నేత మలశాల భరత్, పాలకొండ మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, విశాఖ డెయిరీ డైరెక్టర్ రమణరావు, మాజీ ఎంపీపీ ధనమ్మ, విశాఖ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రాజా ఉన్నారు. సీఎం జగన్‌కు వీరికి వైఎస్సార్సీపీ పార్టీ కండువా తప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రీజనల్ ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: మీ నాన్ననే ఉరికించాం.. నువ్వెంత..: మంత్రి జోగి రమేష్ -
మూలపేట పోర్టుకు భూమి పూజ.. పోర్టు విశేషాలివే..
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెరవేరుస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చి, సమగ్ర అభివృద్ధికి బాటలు వేసే విధంగా సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్ల వ్యయంతో మూలపేట పోర్టు పనులకు బుధవారం సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయనున్నారు. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తులను నిర్మించనున్నారు. జనరల్ కార్గోకు, బొగ్గుకు, కంటైనర్‌తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగించేలా 30 నెలల్లో ఈ పోర్టును పూర్తిచేయాలని నిర్ణయించారు. విష్ణుచక్రం, మూలపేట గ్రామాలకు చెందిన 594 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాసానికి ప్రభుత్వం రూ.109 కోట్లు కేటాయించింది. అంతేగాక వీరికోసం నౌపడలో 55 ఎకరాల్లో ఆధునిక వసతులతో ఆర్ అండ్ ఆర్ కాలనీని సైతం నిర్మిస్తోంది. మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు అత్యంత కీలకంగా మారనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25,000 మందికి ఉపాధి లభించనుంది. మరికొన్ని ప్రాజెక్టులకు కూడా శ్రీకారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్ నుంచి హిర మండలం రిజర్వాయర్‌కు రూ.176.35 కోట్లతో వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు, రూ.852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పనులకు కూడా బుధవారం సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభం కాగా, కాకినాడ సెజ్ పోర్టులో శరవేగంగా పనులు సాగుతున్నాయి. వచ్చే నెలలో మచిలీపట్నం (బందరు) పోర్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. పదేళ్లలో ఒక పోర్టు కడితేనే గొప్ప అనుకునే పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగేళ్ల లోపే నాలుగు పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం విశేషం. సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ సెజ్, మూలపేట పోర్టుల నిర్మాణం చేపట్టింది. వీటి ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా ఖర్చుకే ఎగుమతులు జరగనున్నాయి. మూలపేట పోర్టు విశేషాలు – పోర్టు సామర్థ్యం ఏడాదికి 23.5 మిలియన్ టన్నులు – బెర్తుల సంఖ్య 4 – ఎన్‌హెచ్ 16ను అనుసంధానం చేస్తూ 13.8 కి.మీ నాలుగు లైన్ల రహదారి – నౌపడ జంక్షన్ నుంచి పోర్టు దాకా 10.6 కి.మీ రైల్వే లైన్ నిర్మాణం – గొట్టా బ్యారేజ్ నుంచి 50 కి.మీ. పైప్‌లైన్‌తో 0.5 ఎంఎల్డీ నీటి సరఫరా – పోర్టుకు అనుబంధంగా 5,000 ఎకరాల విస్తీర్ణంలో కార్గో హ్యాండ్లింగ్, పోర్టు ఆధారిత పరిశ్రమలు సిక్కోలు మత్స్యకారులకు బాసటగా.. 2018 నవంబర్ 27న పాకిస్తాన్ భద్రతా దళాలకు పట్టుబడి 13 నెలలు కరాచీలో జైలు జీవితం గడిపిన 20 మంది మత్స్యకారులను గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం విదేశాంగ శాఖతో పలుసార్లు మంతనాలు జరిపి 2020, జనవరి 6న వారిని విడుదల చేయించడంలో సఫలీకృతమైంది. అలాగే కరోనాతో లాక్డౌన్ విధించినప్పుడు గుజరాత్లో చిక్కుకున్న 3,064 మంది శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులను రూ.3 కోట్ల ఖర్చుతో 46 బస్సుల ద్వారా ప్రభుత్వం స్వస్థలాలకు చేర్చింది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదనే సంకల్పంతో రాష్ట్రంలో 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 3 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ప్రతి 50 కి.మీ.కి ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉన్న 6 పోర్టులతో పాటు త్వరలో నిర్మాణం కానున్న 4 పోర్టులతో ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా ఆంధ్రప్రదేశ్ విలసిల్లనుంది. మారనున్న ఉత్తరాంధ్ర ముఖచిత్రం ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. వచ్చే నెలలో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్నారు. భోగాపురం–విశాఖపట్నం మధ్య ఆరు లైన్ల రహదారి పూర్తయింది. మంచినీళ్లపేట ఫిషింగ్ హార్బర్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అదేవిధంగా వచ్చే నెలలోనే విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల, పాడేరులో వైఎస్సార్ గిరిజన వైద్య కళాశాల, అనకాపల్లి, విజయనగరం వైద్య కళాశాలల పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పార్వతీపురం వైద్య కళాశాల పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ఏకంగా రూ.700 కోట్లతో వంశధార నీటితో ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో ఇళ్లకు నీరందించే పనులు 95 శాతం పూర్తయ్యాయి. దీన్ని త్వరలో జాతికి అంకితం చేయనున్నారు. అలాగే దీన్ని పాతపట్నం నియోజకవర్గానికి కూడా విస్తరిస్తూ మరో రూ.265 కోట్ల పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తారు. సాలూరులో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీకి జూన్‌లో ప్రభుత్వం శంకుస్థాపన చేయనుంది. శ్రీకాకుళం జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాల పరిధిలో విస్తారంగా లభిస్తున్న మత్స్య సంపద, టెక్కలి ప్రాంతంలో ప్రపంచ ఖ్యాతి గాంచిన నీలి గ్రానైట్‌కు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ సదుపాయం కల్పించనుంది. కీలక పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు, థర్మల్ కోల్, కోకింగ్ కోల్, ఎరువులు, ముడి జీడి గింజలు, సున్నపురాయి, వంటనూనెల దిగుమతికి మూలపేట పోర్టు కేంద్రం కానుంది. అదేవిధంగా ఉక్కు తయారీ కంపెనీలకు కావాల్సిన బొగ్గు, ముడి ఇనుము ఎగుమతి, దిగుమతులకు, మత్స్య ఎగుమతులకు, మినరల్ శాండ్, ముడి ఇనుము, జీడిపప్పు, సోయా మీల్, గ్రానైట్, ఫెర్రో ఉత్పత్తులు, జూట్, ఐరన్ అండ్ స్టీల్ ఉత్పత్తుల ఎగుమతికి ఇక్కడి నుంచి అవకాశముంటుంది. పోర్టు అనుసంధానిత లాజిస్టిక్స్ ఏర్పాటు ద్వారా రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునే సౌలభ్యం కూడా లభిస్తుంది. సుమారు రూ.35 కోట్లతో తీరప్రాంత–పోర్టు పరిసర ప్రాంతాల అభివృద్ధి, పారిశ్రామికీకరణ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అతి పెద్ద సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకెళుతోంది. -
ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌లో నవ్వులు పూయించిన తాత.. వీడియో వైరల్..
ఈ రోజుల్లో పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ సర్వసాధారణమైపోయింది. వధూవరులు అందమైన లోకేషన్లకు వెళ్లి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లను పెట్టుకుని ఫొటోలు దిగుతున్నారు. దీని కోసం వేల రుపాయలు, అవసరమైతే లక్షలు కూడా ఖర్చు చేస్తున్నారు. ఉత్తరాంద్రలో కూడా ఓ జంట ఇలాగే ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్‌కు వెళ్లింది. కాస్త ఢిపరెంట్‌గా ఆలోచింది నాటు పడవలో ఓ నదిలో ఫొటోలు దిగాలనుకుంది. అయితే ఇక్కడే వాళ్లకు వింత అనుభవం ఎదురైంది. నాటు పడవ నడిపిన ఓ తాత టాలెంట్ చూసి ఈ జంట అవాక్కైంది. అమ్మాయి అబ్బాయి ఫొటో ఎలా దిగాలి, ఏ ఫోజు ఇవ్వాలో కూడా తాత చెప్పేస్తున్నాడు. చేతి ఇలా పెట్టు, కాలు ఇలా పెట్టు, అమ్మాయిని ఇలా పట్టుకో, ఇద్దరూ అటు చూసి ఫోజు ఇవ్వండి అంటూ డైరెక్షన్లు ఇచ్చేస్తున్నాడు. ఉత్తరాంద్ర యాసలో మాట్లాడుతూ తాత ఫోజులు చెప్పడం చూస్తుంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. పడవ నడిపే తాతే ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లా కన్పిస్తున్నాడని నెటిజన్లు చమత్కరిస్తున్నారు. ఈయన టాలెంట్ సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోను మీరూ చూసేయండి. భలే భలే ఓ అమ్మాయీ - పాత రోజులు మారాయీ ఆడపిల్లా తిరిగినచో - పట్టుకొనునూ అబ్బాయీ భలే భలే ఓ అబ్బాయీ - ఈ ఒక్క రోజే నీది పైచేయీ ఆ పిల్ల వేలెత్తినచో - నీకు మూడెను తెలుసుకోవోయీ భలే భలే ఓ అమ్మాయీ - ఈ ఒక్క రోజు నే చెప్పినట్టు చేయీ వాడి మీదకు కాలెత్తాలీ - లేకపోతే వాడికి భయముండదమ్మాయీ వాడిదేముంది వెధవాయి పట్టుకుంటాడులే బడుద్దాయి — రామ్ కేసరి, అమెరికా (ఆరుద్ర గారికి సన్నాయి) -
‘ఉత్తరాంధ్ర బాగుపడటం పవన్‌కు ఇష్టం లేదా?’
శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర బాగుపడటం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఇష్టం లేదనే విషయం నిన్నటి సభ ద్వారా మరోసారి అర్ధమైందని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. అసలు పవన్ మాటలకు చేతలకు పొంతనే లేదని ధర్మాన విమర్శించారు.ఈరోజు (శుక్రవారం) మాట్లాడిన ధర్మాన.. ‘ ఉత్తరాంధ్ర బాగుపడటం పవన్‌కు ఇష్టం లేదా?, పవన్ మాటలకు చేతలకు పొంతన లేదు. ప్రజా నాయకులు హుందాగా ఉండాలి. పుస్తకాలు చదవడం కాదు.. అందులో ఉండే భావజాలాన్నిఅర్థం చేసుకోవాలి. అమరావతిలో రాజధాని అనేది రియల్టర్ల కోసమే. విశాఖ రాజధానితో మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టినష్టపోయాం. అలాంటి తప్పు మళ్లీ జరగకూడదనే వికేంద్రీకరణ. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం.కిడ్నీ బాధితుల కోసం పలాసలోనే ఆస్పత్రి ఏర్పాటు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అన్ని వర్గాలు ఆత్మ గౌరవంగా ఉండేలా సీఎం జగన్ పాలన.’ అని మంత్రి ధర్మాన తెలిపారు. -
ఉత్తరాంధ్ర చర్చా వేదిక అట్టర్ ప్లాప్
-
‘ఏపీలోనే ఉనికిలేని చంద్రబాబు.. తెలంగాణలో ఏం చేస్తారు?’
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి విడదల రజని సీరియస్ అయ్యారు. చంద్రబాబు నాయుడు ఏ మొహం పెట్టుకుని ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. చంద్రబాబుకు ఉత్తరాంధ్రలో తిరిగే హక్కు లేదంటూ ఫైరయ్యారు. కాగా, మంత్రి విడదల రజని మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధిని వ్యతిరేకించే చంద్రబాబుకు ఉత్తరాంధ్రలో తిరిగే హక్కు లేదు. విశాఖ పాలనా రాజధానికి చంద్రబాబు అడ్డుపడుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రను పట్టించుకోలేదు. ఏపీలోనే ఉనికిలేని చంద్రబాబు.. తెలంగాణలో ఏం చేస్తారు?. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు ద్వారా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావిస్తుంటే చంద్రబాబు అడుగడుగునా అడ్డుకుంటున్నారు అని కామెంట్స్ చేశారు. -
ప్రధాని మోడీ టూర్ తో ఉత్తరాంధ్రకు మేలు : ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్
-
KSR కామెంట్ : రాజధానిపై కృత నిశ్చయం
-
పొలిటికల్ కారిడార్ : విశాఖ ఇమేజ్ దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు
-
‘అచ్చం.. టీడీపీకి నువ్వొక్కడివి చాలూ!’
సాక్షి, అమరావతి: పాలనా రాజధాని విశాఖకు అడ్డుపడుతూ.. ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం తలపెడుతున్న టీడీపీపై అక్కడి ప్రజాగ్రహం పెల్లుబిక్కుతోంది. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ సీనియర్ నేతకు ట్విట్టర్ ద్వారా చురకలంటించారు. ఉత్తరాంధ్రలో టీడీపీ ఒక్క అసెంబ్లీ, లోక్‌సభ స్థానం కూడా గెలవకుండా చేయడానికి నీలాంటి ఒక్కడు చాలు అచ్చం అని వ్యంగ్యం ప్రదర్శించారు విజయసాయిరెడ్డి. ‘టెక్కలిలో నీ ‘టెంకాయ’ ఈసారి ఎలాగూ ముక్కలు అవుతుంది. పాలనా రాజధానిగా వైజాగ్ కాకుండా భ్రమరావతి రియల్ ఎస్టేట్ మాఫియాకు దళారిలా మాట్లాడుతున్నావ్. చరిత్ర హీనుడిగా మిగిలిపోతావ్’ అంటూ విమర్శ గుప్పించారు. ఉత్తరాంధ్రలో టీడీపీకి ఒక్క అసెంబ్లీ, లోక్ సభ స్థానం కూడా గెలవకుండా చేయడానికి నీలాంటి ఒక్కడు చాలు అచ్చం. టెక్కలిలో నీ ‘టెంకాయ’ ఈసారి ఎలాగూ ముక్కలవుతుంది. పాలనా రాజధానిగా వైజాగ్ కాకుండా భ్రమరావతి రియల్ ఎస్టేట్ మాఫియాకు దళారిలా మాట్లాడుతున్నావు. చరిత్ర హీనుడిగా మిగిలిపోతావు. — Vijayasai Reddy V (@VSReddy_MP) November 2, 2022 మరో ట్వీట్లో.. బీసీలకు దక్కుతున్న ప్రాముఖ్యత ఓర్వలేకున్నాడంటూ చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బీసీలు జడ్జిలుగా పనికిరారని కొలీజియానికి లేఖ రాశావే చంద్రం! చెప్పులు మోసేవారిని అందలమెక్కించావు తప్ప పేదలను మనుషులుగా చూశావా? జనాభా ప్రాతిపదికన బీసీలకు ప్రాతినిధ్యం కల్పించిన చరిత్ర జగన్ గారిది. ‘వెన్నుపోటు’ మాత్రమే తెలిసినవాడివి. బ్యాక్ బోన్ కులాల గురించి నీకెందుకు బాబూ? అంటూ టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేతకు చురకలు అంటించారు. గంజాయి పాత్రుడు, బొల్లి రవీంద్ర, మలమల రాముడు, బండ సత్తిలకు కళ్లు నెత్తికెక్కితే బీసీల స్థితిగతులు మారినట్టా చంద్రం? వీళ్లను అడ్డం పెట్టుకుని బిసిలను మోసం చేశావు. నీ 14 ఏళ్ల పాలనలో బీసీలను నానా రకాలుగా అవమానించినందుకే వారు గుణపాఠం నేర్పారు. మళ్లీ చిత్తుచిత్తుగా ఓడిస్తారు నిన్ను. pic.twitter.com/M6xZnjg5Zs — Vijayasai Reddy V (@VSReddy_MP) November 2, 2022 -
ఉత్తరాంధ్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడమే చంద్రబాబు లక్ష్యం : ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
-
ఎల్లో మీడియా ఆటలు ఇక సాగవు : మంత్రి పెద్దిరెడ్డి
-
రాష్ట్ర విభజన చట్టం చేసినప్పుడు ఏపీకి అన్యాయం జరిగింది : మంత్రి ధర్మాన
-
సీఎం వైఎస్ జగన్ తో మంత్రి ధర్మాన భేటీ
-
అనాధిగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడింది : మంత్రి బొత్స
-
ఏపీ మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తో " స్ట్రెయిట్ టాక్ "
-
గన్ షాట్ : ఉత్తరాంధ్రకు ఊపిరి...
-
ఉత్తరాంధ్ర ఊపిరి పీల్చుకో ...
-
Visakha Garjana: దిక్కులు పిక్కటిల్లేలా గర్జించిన విశాఖ (ఫొటోలు)
-
జన సంద్రాన్ని తలపించిన ‘ విశాఖ గర్జన’
విశాఖ గర్జన.. జన సంద్రాన్ని తలపించింది. వికేంద్రీకరణకే మా ఓటు అంటూ నినదించింది. విశాఖ జన తుఫాన్లో వర్షం కూడా ‘చిన్న’ బోయింది. ప్రజా పోరాటంతో ఉత్తరాంధ్ర మురిసి ముద్దయ్యింది. వెరసి వికేంద్రీకరణే లక్ష్యంగా చేపట్టిన నేటి(శనివారం) విశాఖ గర్జన విజయవంతమైంది. ఈరోజు ఉదయం విశాఖ గర్జన ఎలా? అనే ప్రశ్న మొదలైంది. దానికి కారణం గర్జన సమయానికి వర్షం పడుతూ ఉండటమే. కానీ దాన్ని సైతం ప్రజలు లెక్క చేయలేదు. తరతరాల తమ వెనుకబాటుతనంపై పోరాటం చేసే అవకాశం రావడంతో జనం వర్షం అన్న సంగతే మరిచారు. వారిలో ఉన్నది ఒకే ఒక్క సంకల్పం. విశాఖ గర్జన సక్సెస్ చేయడమే. తమ నినాదాన్ని, తమ ఆత్మగౌరవ పోరాటాన్ని విశాఖ గర్జన వేదికగా చాటాలనుకున్నారు.. అది చేసి చూపించారు. విశాఖ గర్జనలో లక్షకు మందికి పైగా ర్యాలీలో పాల్గొనడమే ఇందుకు ఉదాహరణ. కుల, మత, వర్గ భేషజాలం లేకుండా ప్రజలంతా నడుంబిగించారు. అమరావతి పేరుతో చేస్తున్న పాదయాత్రకి తమ నిరసన ఎలా ఉంటుందో చూపించారు. వికేంద్రీకరణే లక్ష్యంగా తమ గొంతు వినిపించే క్రమంలో ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తమ ఆకాంక్షలను బలంగా చాటేందుకు నడుం బిగించారు. దీనిలో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘విశాఖ గర్జన’లో పాల్గొనడానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. విశాఖ గర్జనకు విశాఖ పరిపాలనా రాజధానిగా కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు. విశాఖ అంబేద్కర్ సర్కిల్ నుంచి బీచ్‌రోడ్డు వరకూ చేపట్టిన ర్యాలీలో అశేష జనవాహిని పాల్గొంది. భారీ వర్షంలోనూ సుమారు రెండున్నర గంటల పాటు ర్యాలీ కొనసాగింది. దారి పొడవునా ర్యాలీకి విశాఖ ప్రజల సంఘీభావం తెలపగా, విశాఖకు రాజధాని రావాలంటూ నినాదించారు. ఈ ర్యాలీలో ప్రజలు, ప్రజా సంఘాలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేఏసీ నేతలు, మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
వికేంద్రీకరణే లక్ష్యంగా విశాఖ గర్జన
-
Visakha Garjana: విశాఖ గర్జన గ్రాండ్ సక్సెస్
Updates విశాఖ గర్జనలో జన తుఫాన్ విశాఖ గర్జన గ్రాండ్ సక్సెస్ జనసంద్రమైన విశాఖ, ర్యాలీకి లక్షమందికి పైగా హాజరు సభలో మంత్రి విడదల రజని మాట్లాడుతూ.. అందరూ బాగుండాలనే మా ఆలోచన అన్ని ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యం అమరావతి పాదయాత్ర చేస్తున్నది చంద్రబాబు బినామిలే: మేరుగ నాగార్జున అందరూ అభివృద్ధి చెందాలంటే 3 రాజధానుల అవసరం: మేరుగ నాగార్జున విశాఖ సభలో మంత్రి రోజా మాట్లాడుతూ.. మూడు రాజధానులతో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది జగనన్న సంకల్పం దానికి ఉత్తరాంధ్ర ప్రజలంతా సంఘీభావం తెలపాలి మీ జన సునామీలో చంద్రబాబు, పవన్‌లు కొట్టుకుపోవాలి ఉత్తరాంధ్ర ప్రజలకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించండి 2024... జగనన్న వన్స్‌మోర్ కలెక్షన్లు, షూటింగ్‌ల కోసం పవన్‌కు విశాఖ కావాలి పోటీ చేయడానికి విశాఖ కావాలి కానీ విశాఖలో రాజధాని వద్దా: మంత్రి రోజా పెయిడ్ ఆర్టిస్ట్‌లను సపోర్ట్ చేస్తున్న పవన్‌ను తరిమికొట్టాలి ఉత్తరాంధ్ర ప్రజలు తొడగొడితే ఎలా ఉంటుందో పవన్‌కు చూపించాలి అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ.. ఒకవైపు జడివాన.. మరో వైపు జనవాన ఉత్తరాంధ్ర గర్జన ముందు బాబు గర్జన బలాదూర్ ఉత్తరాంధ్ర అన్ని రకాలుగా వివక్షకు గురైంది భావితరాల కోసమే ఉత్తరాంధ్ర ప్రజల పోరాటం అంబేడ్కర్ సర్కిల్ నుంచి బీచ్‌రోడ్డుకు చేరిన ర్యాలీ. నేతలు వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. భారీ వర్షంలో రెండున్నర గంటలు సాగిన ర్యాలీ దారి పొడవునా ర్యాలీకి విశాఖ ప్రజల సంఘీభావం. విశాఖకు రాజధాని రావాలంటూ హోరెత్తిన నినాదాలు. జనసంద్రమైన విశాఖ, ర్యాలీకి లక్షమందికి పైగా హాజరు విశాఖ పరిపాలనా రాజధాని అంటూ హోరెత్తిన నినాదాలు మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి అంటూ ప్రజల నినాదాలు 29 గ్రామాలు కాదు.. 26 జిల్లాలు అభివృద్ధి చెందాలంటూ నినాదాలు అమరావతి పేరుతో దాడులు చేస్తే సహించేది లేదు అంటూ హెచ్చరిక చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి: మంత్రి ధర్మాన ఉత్తరాంధ్ర కోసం అందరూ గొంతెత్తి నినదించాలి: మంత్రి ధర్మాన ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు: మంత్రి ధర్మాన ఉత్తరాంధ్ర కోసం రాజకీయ పోరాటం చేస్తాంఫ మంత్రి ధర్మాన ప్రస్తుత పరిస్థితుల్లో వికేంద్రీకరణ చాలా అవసరం: బుగ్గన అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ద్రోహి అచ్చెన్నాయుడికి రాజకీయ సమాధి తప్పదు చంద్రబాబుకు అచ్చెన్నాయుడు బానిస: దువ్వాడ శ్రీనివాస్ ఆ బానిసకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది: ప్రొఫెసర్లు ప్రపంచంలోని అద్భుత నగరాల్లో విశాఖ ఒకటి: ప్రొఫెసర్లు విశాక రాధానిని ప్రజలంతా స్వాగతిస్తున్నారు: ప్రొఫెసర్లు ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలు ఇంకెన్నాళ్లు: ప్రొఫెసర్లు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే రాజధాని రావాలి వర్షంలోనే కొనసాగుతున్న ‘విశాఖ గర్జన’ ర్యాలీ భారీ వర్షంలోనే కొనసాగుతున్న ర్యాలీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీగా తరలివచ్చిన ప్రజానీకం మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. చంద్రబాబుకు 29 గ్రామాల అభివృద్ధే కావాలి మేం అందరి అభివృద్ధిని కోరుకుంటున్నాం మేం చేసేది ప్రజా పోరాటం చంద్రబాబు చేసేది రియల్ ఎస్టేట్ పోరాటం విశాఖ గర్జనకు భారీ ప్రజా స్పందన రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు 3 రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి అంటూ ప్రజా సంఘాల నినాదాలు కొడాలి నాని మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర వెనుకబాటను రూపుమాపేందుకే విశాఖ రాజధాని ప్రజల ఆకాంక్షలకు అందరూ మద్దతు తెలుపుతున్నారు అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం ఆస్తుల సంపాదనే చంద్రబాబు ధ్యేయం ఆ నలుగురి అభివృద్ధే చంద్రబాబుకు కావాలి మహిళలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు వికేంద్రీకరణే లక్ష్యంగా ప్రజా గళం.. వికేంద్రీకరణే లక్ష్యంగా తమ గొంతు వినిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. తమ ఆకాంక్షలను బలంగా చాటేందుకు నడుం బిగించారు. దీనిలో భాగంగా శనివారం జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘విశాఖ గర్జన’లో పాల్గొనడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. విశాఖ గర్జనకు విశాఖ పరిపాలనా రాజధానిగా కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రజలు, ప్రజా సంఘాలతో పాటు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేఏసీ నేతలు, మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు పాల్గొంటున్నారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వైఎస్సార్ విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగుతోంది. రాజకీయాలకతీతంగా భారీ ప్రదర్శన చేపట్టగా దీనికి అన్ని వర్గాల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోంది. ఈ మేరకు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని వివరిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తరతరాల వెనుకబాటు తనంపై ఒక్కటైన ఉత్తరాంధ్ర ప్రజానీకం వికేంద్రకరణతోనే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నినదిస్తున్నారు. ‘టీడీపీ- జనసేనకు ఉత్తరాంధ్ర ఇప్పడు గుర్తుకువచ్చింది’ ‘విశాఖ గర్జన భయంతో ఇప్పుడు టీడీపీ- జనసేనకు ఉత్తరాంధ్ర గుర్తుకు వచ్చింది. విశాఖ గర్జన విజయవంతం ఖాయం. విశాఖ రాజధాని అవకాశాన్ని వదులుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరు’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ‘ఉత్తరాంధ్రలో ఉన్న వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకే విశాఖ పరిపాలన రాజధాని. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞతతో ఒక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ పరిపాల రాజధానిగా ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. విశాఖ గర్జనకు విశేషమైన స్పందన లభిస్తోంది’ అని మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ తెలిపారు. ఇక వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తున్న వారికి కనువిప్పు కలగాలని విశాఖ గర్జన ర్యాలీ. వర్షం వచ్చినా విశాఖ గర్జన ర్యాలీ ఆగదు.వర్షం కంటే ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మస్థైర్యం గొప్పది. ఉత్తరాంధ్రకు టిడిపి నాయకులు ఏం చేశారో సమాధానం చెప్పాలి.రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను టిడిపి నేతలు దోచుకున్నారు.జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత ఉత్తరాంధ్ర పై టిడిపి నేతలకు ప్రేమ పుట్టుకొచ్చింది’ అని పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న పవన్
సాక్షి, అమరావతి: పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ఒక సామాజిక వర్గానికి న్యాయం చేసేలా వ్యవహరిస్తున్నారని ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు ధ్వజమెత్తారు. పవన్ ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తున్నారని ఒక ప్రకటనలో విమర్శించారు. ఉత్తరాంధ్ర ఉద్యమాన్ని నీరు గార్చే లక్ష్యంతో విశాఖ ప్రాంతంలో మూడు రోజులు పర్యటన పెట్టుకొన్నారని చెప్పారు. జనసేన ముసుగులో చంద్రబాబు కనుసైగలతో పవన్ పనిచేస్తున్నారని విమర్శించారు. విశాఖ గర్జన కార్యక్రమాన్ని ముందుగానే ప్రకటించినప్పటికీ, పవన్ హడావుడిగా అదే సమయంలో యాత్ర చేపట్టి ఏం సాధించదలుచుకున్నారని ప్రశ్నించారు. -
విశాఖ అత్యంత అనుకూలం.. అందరి మాటా అదే
సాక్షి, విశాఖపట్నం: ‘పరిపాలన రాజధానిగా విశాఖకే జై కొడతాం.. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం వికేంద్రీకరణకే సై అంటాం..’ అంటూ విశాఖ సహా ఉత్తరాంధ్ర అభివృద్ధిని కాంక్షించే మేధావి, వ్యాపార, పారిశ్రామిక, విద్యా, ఉద్యోగ, కార్మిక, కర్షక లోకం గొంతెత్తుతోంది. వికేంద్రీకరణ వద్దంటూ అమరావతి రైతుల పేరిట చేస్తున్న యాత్రపై భగ్గుమంటోంది. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధిని కాదని, కేవలం అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ నేతలు నడిపిస్తున్న ఈ యాత్రను ఉత్తరాంధ్రలోకి చొరబడనీయమని స్పష్టం చేస్తోంది. వడ్డించిన విస్తరిలాంటి విశాఖలో తక్కువ పెట్టుబడితోనే పాలన రాజధానికి అవసరమైన అన్ని సదుపాయాలూ కల్పించవచ్చని వివరిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయానికి ముక్త కంఠంతో మద్దతు పలుకుతోంది. విశాఖను పాలన రాజధాని చేయడం చారిత్రక అవసరమని నినదిస్తోంది. ఒకే ప్రాంతంలో రాజధాని ఉంటే రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోయిన వైనాన్ని గుర్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో వికేంద్రీకరణకు మద్దతుగా శనివారం విశాఖ నగరంలో భారీగా నిర్వహించ తలపెట్టిన ‘విశాఖ గర్జన’ను విజయవంతం చేస్తామని ప్రతి గొంతూ గర్జిస్తోంది. అదే సమయంలో అమరావతి యాత్రను తక్షణమే విరమించుకోవాలని అభ్యర్థిస్తోంది. లేదంటే విశాఖ పరిపాలన రాజధాని అయ్యే వరకు మున్ముందు ఎలాంటి ఉద్యమాలకైనా, త్యాగాలకైనా సిద్ధమని, వెనకడుగు వేయబోమని ప్రతిన బూనుతోంది. వికేంద్రీకరణ, విశాఖ పాలన రాజధాని ఆవశ్యకతపై వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. చారిత్రక అవసరం.. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడం చారిత్రక అవసరం. అప్పుడే ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతుంది. వలసల నిర్మూలనకు వీలవుతుంది. రాజధానికి అవసరమైన అన్ని హంగులూ విశాఖలోనే ఉన్నాయి. ఇన్నాళ్లూ గత పాలకులు ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదు. ఇప్పుడు వికేంద్రీకరణలో భాగంగా విశాఖను పరిపాలన రాజధాని చేయాలన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయం హర్షణీయం. – కృష్ణమోహన్, జేఏసీ సభ్యుడు, న్యాయవాది, ఏపీ బార్ కౌన్సిల్ విశాఖ అంటే వడ్డించిన విస్తరి రాజధానిగా విశాఖ ఎంతో అనుకూలం. విశాఖ అంటే వడ్డించిన విస్తరి. రాజధానికి అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రైలు, వాయు, రోడ్డు, సముద్ర మార్గాలున్న ఏకైక నగరమిది. పరిశ్రమలతోపాటు అన్ని రంగాలు అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలున్నాయి. రాష్ట్రంలో అత్యధిక రెవెన్యూ లభిస్తున్న నగరం విశాఖపట్నం. రాష్ట్రంలో వచ్చే ప్రతి వంద రూపాయల్లో 75 రూపాయలు ఇక్కడ్నుంచే వస్తున్నాయనడం అతిశయోక్తి కాదు. – సత్యనారాయణరెడ్డి (రఘు), చైర్మన్, ఐలా, గాజువాక వైద్యులందరి మాటా అదే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ముందుచూపుతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. వికేంద్రీకరణతో విశాఖ సహా అన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకుంటాయి. సీఎం నిర్ణయానికి మా వైద్యుల సంఘం సంపూర్ణంగా మద్దతు తెలుపుతోంది. విశాఖ గర్జనను అన్ని వర్గాలూ విజయవంతం చేసి విశాఖ రాజధాని ఆవశ్యకతను చాటాలి. – డా.సుందరరాజు, అధ్యక్షుడు, ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం కేజీహెచ్ యూనిట్ మూడు రాజధానులతో మేలు వికేంద్రీకరణతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఇక్కడ పెట్టుబడులు పెరుగుతాయి. ఫలితంగా ఉపాధి, ఉద్యోగావకాశాలతో పాటు మౌలిక వసతులు వృద్ధి చెందుతాయి. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో వెనుకబడిన ఈ ప్రాంతంలో ఆర్థిక అసమానతలు రూపుమాపడానికి దోహదపడుతుంది. ప్రభుత్వ విధానాన్ని మా చాంబర్ ఆఫ్ కామర్స్ పూర్తిగా స్వాగతిస్తోంది. – సతీష్, అధ్యక్షుడు, ది వైజాగ్ చాంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్ గుణపాఠం కావాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ ఒక్కటే రాజధానిగా ఉండటంతో అభివృద్ధి అంతా హైదరాబాద్‌కు పరిమితమైంది. దీంతో రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు అమరావతి ఒక్కటే రాజధాని అయితే మళ్లీ అదే ప్రమాదం పొంచి ఉంది. భవిష్యత్తులో మళ్లీ రాష్ట్ర విభజన సమస్యలు తలెత్తితే మిగిలిన ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయి. గతాన్ని చూసైనా వికేంద్రీకరణకు అందరూ మద్దతివ్వాలి. – డి.వి.రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి, డీవీఆర్ స్టీల్ ఎంప్లాయిస్ యూనియన్ పారిశ్రామికంగా మరింత అభివృద్ధి రాష్ట్రంలో మూడు రాజధానుల ఆవశ్యకత ఎంతో ఉంది. విశాఖ పరిపాలన రాజధాని అయితే పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో కొన్ని పరిశ్రమలు వచ్చాయి. విశాఖ పరిసరాల్లో అనేక పరిశ్రమలు రావడానికి ఆసక్తి చూపుతున్నాయి. రాజధాని అయితే మరిన్ని పరిశ్రమలు రావడంతో పాటు ఉత్తరాంధ్రలో అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విశాఖ పరిపాలనా రాజధాని అయ్యే వరకు ఉద్యమానికి వెనకాడం. – మంత్రి రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి, ఐఎన్టీయూసీ ఉత్తరాంధ్రులు ఉద్యమించాల్సిన తరుణమిదే ఉత్తరాంధ్ర ఎప్పట్నుంచో వెనుకబాటుతో ఉంది. ఈ ప్రాంతీయుల్లో అధికులు పేదలు. విశాఖ పాలన రాజధాని అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. రాజధానిగా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. విశాఖ పాలన రాజధాని, వికేంద్రీకరణ కోసం పార్టీలకు అతీతంగా ఉద్యమించాల్సిన తరుణమిదే. ఇది ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరి బాధ్యత. శనివారం నాటి విశాఖ గర్జనలో వికేంద్రీకరణ కోసం అంతా నినదించాలి. – పైడిరాజు, రాష్ట్ర కార్యదర్శి, ఎస్టీయూ అన్ని విధాలా ఉత్తరాంధ్ర అభివృద్ధి విశాఖ కార్యనిర్వాహక రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. విశాఖలో వ్యాపారాలు మరింతగా విస్తరించి మరెందరికో ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ హోల్‌సేల్ మార్కెట్లు లేవు. విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే ఉన్నాయి. ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే అవి కూడా వస్తాయి. హైదరాబాద్‌ను మించి ఇక్కడ వ్యాపారాలు జరుగుతాయి. హెల్త్ సిటీగా విశాఖ మరింత ప్రాచుర్యం పొందుతుంది. – రాపర్తి సుబ్బారావు, వస్త్ర వ్యాపారి, గాజువాక. విశాఖ గర్జనలో పాల్గొంటున్నాం మాది గుంటూరు జిల్లా. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయ విద్య అభ్యసిస్తున్నాను. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందితేనే అందరికీ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వికేంద్రీకరణతోనే అది సాధ్యం. గతంలో ఒక్క హైదరాబాద్‌నే అభివృద్ధి చేయడం వల్ల విభజనతో అన్నింటినీ వదిలేసి రావాల్సి వచ్చింది. ఆ తప్పు పునరావృతం కాకూడదు. అందువల్లే మేమంతా వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతూ శనివారం జరిగే విశాఖ గర్జనలో పాల్గొంటున్నాం. – కర్నేటి సాయికృష్ణ, న్యాయ విద్యార్థి, ఏయూ, విశాఖపట్నం వికేంద్రీకరణతో ఏపీ అభివృద్ధి రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలున్న నగరం విశాఖ. ఓ వైపు అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఆరు వరుసల జాతీయ రహదారి, రైలు, జల రవాణా ఉన్న ఏకైక సిటీ. పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సాధించింది. విద్య, వైద్య రంగాలకు పెట్టింది పేరు. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకుంటున్న వైజాగ్.. పరిపాలన రాజధానిగా మారితే ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. దేశంలోనే ఆత్యధిక జీడీపీ కలిగిన పది నగరాల్లో మన విశాఖ ఒకటి. విశాఖ రాజధాని కావాలి. ఇందుకు అందరూ మద్దతు పలకాలి. – మేడపాటి రమేష్ రెడ్డి, ఎండీ, స్వాతి ప్రమోటర్స్ -
విశాఖకు జై!.. దిక్కులు పిక్కటిల్లేలా గర్జన
సాక్షి, విశాఖపట్నం: తరతరాల వెనుకబాటు తనంపై తమ గొంతు వినిపించేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధమయ్యారు. తమ ఆకాంక్షలను బలంగా చాటేందుకు దిక్కులు పిక్కటిల్లేలా గర్జించడానికి వేచి చూస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా శనివారం నిర్వహించనున్న విశాఖ గర్జనలో పాల్గొనడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. 1956లోనే రాజధానిగా విశాఖ ఏర్పాటు కావాల్సి ఉన్నప్పటికీ వీలు కాలేదని, ఇన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడు తమ చిరకాల కోరిక నెరవేరబోతున్న సమయంలో అడ్డుకునే వారికి బుద్ది చెప్పేలా శాంతియుతంగా గర్జనను నిర్వహిచేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడంటూ నినదిస్తున్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న విశాఖ గర్జనకు మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థి లోకం పూర్తి మద్దతు తెలిపింది. విశాఖ గర్జన విజయవంతానికి వైఎస్సార్సీపీ నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు, భారతీయ జనతా పార్టీలు మాత్రం గర్జనకు దూరంగా ఉంటున్నాయి. గత ఎన్నికల్లో గాజువాకలో ఘోరంగా ఓడించారన్న అక్కసుతో ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా తన వాణిని కాస్త జనవాణిగా వినిపించేందుకు జనసేన నేత పవన్ కల్యాణ్ విశాఖకు శనివారమే వస్తుండడం గమనార్హం. టీడీపీ నేతలు కూడా ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతంపై విషం చిమ్ముతున్నారు. తమ హయాంలో జరిగిన భూకబ్జాలను కప్పిపుచ్చుకుంటూ.. దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్టుగా.. భూకబ్జాలకు పాల్పడిన టీడీపీ నేతలే వాటి గురించి మాట్లాడుతుండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పైగా ఇదే రోజు ఉత్తరాంధ్ర నేతలందరూ ఆ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యేందుకు సిద్ధమవ్వడంపై మరింత ఆగ్రహం వ్యక్తమవుతోంది. శుక్రవారం ఉత్తరాంధ్ర నాన్‌పొలిటికల్ జేఏసీ చైర్మన్ లజపతిరాయ్, మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు పలువురు జేఏసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మేధావులు ర్యాలీ జరిగే రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ‘విశాఖ గర్జన’ జెండాను, పాటను ఆవిష్కరించారు. నియోజకవర్గాల వారీ రూట్‌మ్యాప్‌ను పోలీసులకు అందజేశారు. ఉత్తరాంధ్ర, ఉమ్మడి విశాఖ జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలిరానున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల వారీగా వెళ్లేలా వలంటీర్లను కూడా ఏర్పాటు చేశారు. యాత్రలో పాల్గొనే వారందరికీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా వలంటీర్లు సహాయ పడతారు. సాగర తీరాన మూడున్నర కిలోమీటర్ల మేర సుమారుగా లక్ష మందితో గర్జన జరగనుంది. ర్యాలీ సాగేదిలా.. ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘విశాఖ గర్జన’ ర్యాలీ శనివారం ఉదయం 9 గంటలకు ఎల్ఐసీ బిల్డింగ్.. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభం కానుంది. జైలు రోడ్డు జంక్షన్, సెవెన్ హిల్స్ హాస్పిటల్ జంక్షన్, వాల్తేర్ క్లబ్, సిరిపురం జంక్షన్, చిన వాల్తేర్ జంక్షన్ మీదుగా ఆర్కే బీచ్ రోడ్డులోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు సుమారు మూడున్నర కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ముందుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ సభ్యులు, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, మేధావులు నివాళులర్పించి.. ర్యాలీ ప్రారంభిస్తారు. ర్యాలీ సందర్భంగా ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం, ఇక్కడ ప్రజలు పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండటం, ఇతరత్రా సమస్యలు ఎదుర్కొంటుండటంపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. విశాఖ గర్జన నేపథ్యంలో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. -
విశాఖ గర్జన పాటలతో ఉద్యమ స్ఫూర్తి నింపుతున్న కళాకారులు
-
బిగ్ క్వశ్చన్ : చంద్రబాబు డైరెక్షన్ ... పవన్ కళ్యాణ్ యాక్షన్
-
ఉత్తరాంధ్ర వెనుక బాటుతనంపై రౌండ్ టేబుల్ సమావేశం
-
ఉత్తరాంధ్ర అభివృద్ధితోనే వలసలు ఆగిపోతాయి : మేధావులు
-
అది సక్సెస్ చేస్తే.. వారిరువురికి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్‌కు గ్రీన్‌సిగ్నల్!
ఉత్తరాంధ్ర టీడీపీ నేతల గొంతు చంద్రబాబు నొక్కేస్తున్నారా? ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించాలని వారిమీద తీవ్ర ఒత్తిడి తెస్తున్నారా? గతంలో విశాఖను పరిపాలనా రాజధానిగా స్వాగతించిన టీడీపీ నేతలు ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారు?. పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చంద్రబాబు తమ పార్టీ నేతలకు హెచ్చరిస్తున్నారా?. విశాఖ నగరాన్ని పరిపాలనా రాజధానిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించినపుడు అందరికంటే ముందు స్వాగతించింది ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులే. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం వల్ల వెనుకబడిన ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఒక హోటల్లో సమావేశమైన విశాఖ టీడీపీ నేతలు పరిపాలనా రాజధానిగా విశాఖకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా వ్యవహరించిన టీడీపీ నేతలపై చంద్రబాబు నాయుడు కన్నెర్ర చేస్తున్నారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని పార్టీ నిర్ణయం తీసుకుందని.. ఆ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా పార్టీలైన్‌కు భిన్నంగా వ్యవహరిస్తే వారిని వదులుకునేందుకు కూడా సిద్ధమని సంకేతాలు పంపుతున్నారు పచ్చ పార్టీ బాస్ చంద్రబాబు. ఇటీవల ఉత్తరాంధ్ర టీడీపీ నేతలతో జూమ్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు అమరావతి రైతుల పాదయాత్రను విజయవంతం చేయాలని ఆదేశించారు. విశాఖ జిల్లాలో పాదయాత్ర ప్రవేశిస్తున్న తరుణంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలకాలని సూచించారు. పాదయాత్రకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టీడీపీ శ్రేణులు రక్షణ కవచంగా ఉండాలన్నారు. ఈ బాధ్యతలను మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణకు అప్పగించారు. పాదయాత్రను ఉమ్మడి విశాఖ జిల్లాలో విజయవంతం చేస్తే.. వచ్చే ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడి కుమారుడికి ఎంపీ సీటు, బండారు సత్యనారాయణ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కూడా చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు తీరును ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక సామాజికవర్గ ప్రయోజనాల కోసం ఏర్పాటుచేసిన రాజధాని కోసం ఉత్తరాంధ్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజసమని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. విశాఖ నగరం పరిపాలనా రాజధానిగా వస్తే తమ పిల్లల భవిష్యత్ బాగుపడటంతోపాటు, భూములకు కూడా మంచిరేట్లు వస్తాయని అభిప్రాయపడతున్నారు. దశాబ్దాలుగా వెనకబడిన ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుందని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారు. చంద్రబాబు బెదిరించి, భయపెట్టి తమ గొంతును నొక్కిపెట్టొచ్చు.. కానీ ప్రజల ఆకాంక్షను మాత్రం అడ్డుకోలేరని టీడీపీ నేతలే హెచ్చరిస్తున్నారు. గతంలో విశాఖ నగర టీడీపీ అధ్యక్షుడిగా వాసుపల్లి గణేష్ ఉన్న సమయంలో ఆయనకు తెలియకుండానే ఆయన పేరుమీద ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఒక దొంగ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో వాసుపల్లి విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. లేఖ చూసి కంగుతిన్న వాసుపల్లి పరిపాలనా రాజధానిగా విశాఖను వ్యతిరేకిస్తూ తాను ఎటువంటి లేఖ రాయలేదంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు. విశాఖపై చంద్రబాబు చేస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తూ టీడీపీకి వాసుపల్లి గుడ్‌బై చెప్పారు. మరో సీనియర్ నేత రెహ్మాన్ కూడా పరిపాలనా రాజధానిగా విశాఖను స్వాగతిస్తూ.. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీని వీడారు. రానున్న రోజుల్లో ఇంకా చాలా మంది నేతలు టీడీపీకి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తమకు రాజకీయంగా జన్మనిచ్చిన ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే తెలంగాణలో పట్టిన గతే ఉత్తరాంధ్రలోనూ టీడీపీకి పడుతుందని ఇప్పటికైనా చంద్రబాబు తన సామాజికవర్గ ప్రయోజనాలను పక్కనపెట్టి రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తే పార్టీకి మంచిదని సూచిస్తున్నారు. -
పొలిటికల్ కారిడార్ : ఉత్తరాంధ్ర నేతలకు చంద్రబాబు బెదిరింపులు
-
KSR కామెంట్ : ఉత్తరాంధ్రలో వ్యక్తమవుతున్న వ్యతిరేకత
-
ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న టీడీపీ నేతలు
-
ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులకు ఆత్మగౌరవం లేదు
సాక్షి, అమరావతి: టీడీపీ నేతలు ఉత్తరాంధ్రమనోభావాలను దెబ్బ తీస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో పుట్టిన టీడీపీ నేతలకు ఆత్మగౌరవం లేదని, వారు అదే తీరులో ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వారు కట్టుబడి లేరన్నారు. ఉత్తరాంధ్రకు ఏ పరిశ్రమా అవసరం లేదని, రాజధాని కూడా వద్దని, ప్రభుత్వం పెట్టాల్సిన రూ.లక్షల కోట్లు కేవలం అమరావతిలోనే పెట్టండని, ఆ అప్పునంతా అందరితో కలిసి తీరుస్తామని ఉత్తరాంధ్ర టీడీపీ బంట్రోతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విశాఖలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ సమావేశంలో మేధావులు ఎవరూ అమరావతిని వ్యతిరేకించలేదని చెప్పారు. అమరావతితో పాటు, విశాఖ, కర్నూలును కూడా రాజధానులుగా అభివృద్ధి చేయాలని కోరారన్నారు. అక్కడి ప్రజలకు ఆత్మగౌవరం ఉన్నట్టే ఉత్తరాంధ్ర వారికీ ఉంటుందని చెప్పారు. ఎప్పుడూ ఉత్తరాంధ్ర నష్టపోతూనే ఉందన్నారు. హైదరాబాద్‌ను కోల్పోయిన తర్వాత అలాంటి పరిస్థితి తలెత్తకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. సీఎం నిర్ణయానికి అందరి మద్దతు ఉందని, వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. ఎందుకు రెచ్చగొడుతున్నారు? అమరావతి రైతుల పేరుతో జరుగుతున్న పాదయాత్ర సజావుగా సాగేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని చెప్పారు. కానీ, కార్లు ఎక్కి తొడలు కొట్టమని, చెప్పులు చూపించమని కోర్టు చెప్పిందా అని ప్రశ్నించారు. ఎవరిని రెచ్చగొట్టడానికి ఆ పని చేస్తున్నారని అన్నారు. పాదయాత్ర చేస్తున్నారా లేక తొడల యాత్ర చేస్తున్నారా అని నిలదీశారు. ప్రజల మధ్య నడుస్తూ విద్వేషాలు రెచ్చగొట్టొద్దని చెప్పారు. రాజకీయ అజెండాతో జరుగుతున్న క్యాపిటలిస్ట్ ఉద్యమంలో ఏదైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత అన్నారు. మీరు ఎంత రెచ్చగొడుతున్నా.. సంయమనం పాటించాలని ఉత్తరాంధ్రవాసులను కోరుతున్నామన్నారు. పాదయాత్రను నిజంగా అడ్డుకోవాలనుకొంటే ప్రభుత్వానికి ఎంతసేపని అన్నారు. విశాఖపట్నంలో అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్నప్పుడే గంజాయి సాగు ఎక్కువగా జరిగిందని, వాళ్లు దానిపైనే బతికారని విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు బూట్లు నాకే పని మానేయాలని టీడీపీ నేతలకు చెప్పారు. -
కరువు ప్రాంతాల్లో అనుసంధానం
-
‘అసని’ తుపాను : ఏపీలోని పలుప్రాంతాల్లో భారీ వర్షాలు, పెనుగాలులు (ఫొటోలు)
-
తీవ్ర రూపం దాల్చుతున్న అసనీ తుపాను... భారీ నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు, కాకినాడకి 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని, ఆ తర్వాత క్రమంగా దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుపాను కారణంగా ఈ రోజు రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, ఒడిశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాన్ హెచ్చరికల అధికారి జగన్నాథ కుమార్ సూచించారు. విమాన కార్యకలాపాలు రద్దు ఈ తుపాను కారణంగా మే 10న చెన్నై, విశాఖపట్నంలో పలు విమానయాన సంస్థలతో వివిధ విమాన కార్యకలాపాలను రద్దు చేసినట్లు ఏమియేషన్ అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా 23 ఇండిగో విమానాలు రాకపోకలను రద్దు చేసినట్లు విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అంతేకాదు నాలుగు ఎయిర్ఏషియా విమానాలు కూడా రద్దు చేసినట్లు కూడా వెల్లడించారు. (చదవండి: బెంబేలెత్తిస్తున్న ‘అసని’ తుపాన్.. అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే?) -
ఉత్తరాంధ్రలో ‘అసని’ తుపాను అలజడి.. (ఫొటోలు)
-
Cyclone Asani: తీరంలో ‘అసని’ అలజడి
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంపై ఉన్న ‘అసని’ తీవ్ర తుపాను గంటకు 25 కి.మీ. వేగంతో వాయవ్య దిశగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఇది కాకినాడకు ఆగ్నేయంగా 390 కి.మీ., విశాఖçకు ఆగ్నేయంగా 390 కి.మీ., గోపాల్‌పూర్‌కు 510 కి.మీ., పూరీకి దక్షిణ దిశగా 580 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మంగళవారం వాయవ్య దిశగా ప్రయాణించి.. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకుంటుంది. అనంతరం యూటర్న్ తీసుకుని ఉత్తర–ఈశాన్య దిశగా ప్రయాణించి.. తిరిగి ఒడిశా తీరం సమీపంలోని వాయవ్య బంగాళాఖాతం వైపునకు మరలనుంది. తదుపరి 48 గంటల్లో క్రమంగా సముద్రంలోనే తుపానుగా బలహీనపడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. కాగా, బలహీనపడిన అనంతరం కాకినాడ, విశాఖపట్నం మధ్య కూడా తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో సోమవారం సముద్రంలో గంటకు 100 నుంచి 110 కి.మీ., గరిష్టంగా 120 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కి.మీ., గరిష్టంగా 65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి. చాలాచోట్ల విద్యుత్ వైర్లు తెగిపడి సరఫరా నిలిచిపోయింది. విశాఖ జిల్లాలో కొన్నిచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. సహాయ చర్యల నిమిత్తం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. పలు విమానాల రద్దు.. రైళ్ల దారి మళ్లింపు గాలుల తీవ్రత కారణంగా విశాఖపట్నం రావాల్సిన పలు విమానాల్ని రద్దు చేశారు. మరికొన్ని విమానాల్ని దారి మళ్లించారు. విశాఖ విమానాశ్రయానికి రావాల్సిన 10 విమానాలు రద్దయ్యాయని, 7 విమానాలను మళ్లించామని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తుపాను ప్రభావం ఉత్తరాం«ధ్ర, ఒడిశాపై ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే జోన్, వాల్తేరు డివిజన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాక్‌లు దెబ్బతిని ప్రమాదాలు సంభవించకుండా ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. ఒడిశా వైపు వెళ్లే మూడు రైళ్లని దారి మళ్లించారు. ఉత్తరాం«ధ్ర జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమై.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తుపాను తీవ్రత తగ్గుముఖం పట్టేంత వరకూ మండలస్థాయి అధికారులు, సిబ్బంది హెడ్ క్వార్టర్స్‌లోనే అందుబాటులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు భారత నౌకాదళం అప్రమత్తమైంది. ఇండియన్ కోస్ట్‌గార్డ్‌షిప్ ఐసీజీఎస్ వీరా సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. 20 మంది కోస్ట్ గార్డు సిబ్బందితో పాటు 5 విపత్తు సహాయ బృందాలు సహాయక సామగ్రితో సన్నద్ధంగా ఉన్నాయి. మత్స్యకారులెవరైనా సముద్రంలో చిక్కుకుపోయారేమోనన్న అనుమానాలతో కోస్ట్‌గార్డు, నౌకాదళ బృందాలు బంగాళాఖాతాన్ని జల్లెడ పట్టాయి. విశాఖపట్నం, భీమునిపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కోస్తాకు రెండ్రోజుల పాటు వర్ష సూచన రాగల రెండ్రోజులపాటు కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. పలుచోట్ల 12 నుంచి 20 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నట్లు వివరించారు. ఉత్తరాం«ధ్ర జిల్లాలతో పాటు కోస్తా తీర ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని తీరప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ఉప్పాడ తీరానికి కొట్టుకొచ్చిన స్టీల్ బార్జి పిఠాపురం:కాకినాడ జిల్లాలోని తీర ప్రాంతంపై తుపాను ప్రభావం చూపుతోంది. సోమవారం ఉదయం నుంచి సముద్రం అల్లకల్లోలంగా మారింది. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. తీరప్రాంతం కోతకు గురవుతోంది. ఈదురు గాలుల ప్రభావంతో కాకినాడ పోర్టులో లంగరు వేసిన స్టీల్ బార్జి ఉప్పాడ తీరానికి కొట్టుకు వచ్చి ఇసుకలో కూరుకుపోయింది. దానిని తిరిగి సముద్రంలోకి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. సముద్ర కెరటాలు ఉప్పాడ తీరంపై విరుచుకుపడ్డాయి. కాకినాడ లైట్‌హౌస్ నుంచి ఉప్పాడ వరకు ఉన్న బీచ్ రోడ్డు తీవ్ర కోతకు గురయ్యింది. సుమారు 6 మీటర్ల ఎత్తున కెరటాలు బీచ్ రోడ్డుపై విరుచుకుపడడంతో వాహనాల రాకపోకలను నిషేధించారు. పోలీసు గస్తీ ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లించారు. కెరటాల తాకిడికి ఉప్పాడ శివారు ఎన్టీపీసీ సమీపంలోని పెద్దవంతెన పక్కకు ఒరిగిపోయి కూలిపోడానికి సిద్ధంగా ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉరకలేస్తున్న ఉత్తరాంధ్ర పారిశ్రామిక రంగం
సాక్షి, అమరావతి: రాయలసీమ, కోస్తాంధ్రలకు దీటుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలను పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. విశాఖ, గంగవరం పోర్టులకు అదనంగా శ్రీకాకుళం జిల్లా భావనపాడు వద్ద నూతన ఓడరేవు నిర్మిస్తుండటంతో పోర్టు ఆధారిత పరిశ్రమలు ఉత్తరాంధ్రవైపు చూస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు ఉత్తరాంధ్రలో 33 భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయి. మరో 20 యూనిట్ల ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయి. ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్ల ద్వారా రూ.5,801.37 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 8,226 మందికి ఉపాధి లభించింది. వీటిలో రెయిన్ సీఐఐ కార్బన్ వైజాగ్ లిమిటెడ్, చెట్టినాడ్ సిమెంట్ కార్పొరేషన్, శ్రీమాన్ కెమికల్స్, డాక్టర్ రెడ్డీస్, దివీస్ ల్యాబ్, నాట్కో, డెక్కన్ ఫైన్ కెమికల్స్ తదితర కంపెనీలున్నాయి. వివిధ దశల్లో ఉన్న 20 యూనిట్ల ద్వారా ఉత్తరాంధ్రలోకి మరో రూ.18,,235.5 కోట్ల పెట్టుబడులతో పాటు 24,380 మందికి ఉపాధి లభించనుంది. జపాన్‌కు చెందిన యకోమా గ్రూపునకు చెందిన ఏటీసీ టైర్స్ రూ.1,750 కోట్లతో భారీ టైర్ల తయారీ యూనిట్, రూ.2,000 కోట్లతో సెయింట్ గోబిన్ విస్తరణ, రూ.6,700 కోట్లతో అన్‌రాక్ అల్యూమినియం, రూ.485 కోట్లతో కనాŠస్య్ నెర్లాక్ పెయింట్స్, రూ.750 కోట్లతో జిందాల్ ఇండియా ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి కాకుండా ఒక్క హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) రూ.28,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. విజయనగరం జిల్లాలో కొత్తవలస ఇన్ఫ్రా వెంచర్స్ రూ.2,000 కోట్లు, శారద మెటల్స్ రూ.1,500 కోట్ల పెట్టుబడితో స్థాపించే పరిశ్రమల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఐటీ రంగంలో అదానీ గ్రూపు 130 ఎకరాల్లో రూ14,000 కోట్లతో డేటా, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం చేపడుతోంది. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఇప్పటికే రెండు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు విశాఖలో ఏర్పాటయ్యాయి. గడిచిన 30 నెలల కాలంలో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో 2,412 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.1,866.53 కోట్ల విలువైన పెట్టుబడులతో పాటు 21,212 మందికి ఉపాధి లభించింది. రూపు మారనున్న భోగాపురం పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా పలు చర్యలు చేపట్టింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పర్యాటకాభివృద్ధిలో కీలకపాత్ర పోషించే విశాఖ ఓ హబ్‌గా ఎదిగేలా చర్యలు చేపడుతోంది. భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే భూ సేకరణ సమస్యలను పరిష్కరించి జీఎంఆర్‌కు కాంట్రాక్టు అప్పగించింది. దీని నిర్మాణానికి కేంద్రం నుంచి నిరభ్యంతర సర్టిఫికెట్ కోసం స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. భోగాపురం నుంచి భీమిలి వరకు ఆరులేన్ల రహదారిని అభివృద్ధి చేసి, దానికి ఇరువైపులా పారిశ్రామికంగా అభివృద్ధి చేయనున్నారు. ఇదే సమయంలో విశాఖకు పర్యాటకులను ఆకర్షించేలా భారీ పర్యాటక ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. వేగంగా విశాఖ నోడ్ అభివృద్ధి విశాఖ–చెన్నై కారిడార్‌లో భాగంగా ఏడీబీ నిధులతో విశాఖ నోడ్‌ను ఏపీఐఐసీ వేగంగా అభివృద్ధి చేస్తోంది. అచ్చుతాపురం, రాంబిల్లి, నక్కపల్లిలో పారిశ్రామిక పార్కుల్లో అన్ని మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే మొదటి దశ పనులు చివరికి వచ్చాయి. రెండో దశ పనులు వేగంగా సాగుతున్నాయి. వీటికి అదనంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కోసం బొబ్బిలి వద్ద 661.33 ఎకరాల్లో గ్రోత్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో ఇప్పటికే 206 యూనిట్లకు భూములు కేటాయించగా అందులో 131 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించాయి. -
ఉత్తరాంధ్ర చిన్నారులకు బాల పురస్కారాలు
శ్రీకాకుళం (పాత బస్టాండ్)/దొండపర్తి (విశాఖ దక్షిణ)/న్యూఢిల్లీ/: ఉత్తరాంధ్రకు చెందిన ముగ్గురు చిన్నారులు ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’లను అందుకున్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా సోమవారం వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 29 మంది రాష్ట్రీయ బాల పురస్కార్ గ్రహీతలతో మాట్లాడిన ప్రధాని మోదీ, అనంతరం బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీకాకుళం మండలం పొన్నాం గ్రామానికి చెందిన గురుగు హిమప్రియ పురస్కారాన్ని అందుకుంది. హిమప్రియకు రూ.లక్ష నగదు, ప్రశంసా పత్రం అందజేశారు. 2018లో జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదుల దాడిలో ధైర్యసాహసాలు చూపినందుకు హిమప్రియను ఈ పురస్కారం వరించింది. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ మాట్లాడుతూ.. అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సిక్కోలు బాలికకు పురస్కారం దక్కడం గర్వకారణమన్నారు. పురస్కార గ్రహీత హిమప్రియ మాట్లాడుతూ సైనిక కుటుంబంలో జన్మించినందుకు ఎంతో గర్వంగా ఉందని చెప్పింది. తన తండ్రే తనకు ఆదర్శమని తెలిపింది. నాడు ఏం జరిగిందంటే.. హిమప్రియ తండ్రి సత్యనారాయణ ఆర్మీ ఉద్యోగి. ఉద్యోగ రీత్యా వీరి కుటుంబం జమ్మూ కశ్మీర్‌లోని ఆర్మీ క్వార్టర్స్‌లో నివాసం ఉండేది. 2018 ఫిబ్రవరి 10వ తేదీన జమ్మూకశ్మీర్‌లోని ఆర్మీ క్వార్టర్స్‌పై వేకువజామున ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఆ సమయంలో హిమప్రియ తల్లితో పాటు ఇంట్లోనే ఉంది. తండ్రి 60 కిలోమీటర్ల దూరంలో విధి నిర్వహణలో ఉన్నారు. నాలుగైదు గంటలపాటు ఉగ్రవాదులు తూటాలు కురిపిస్తూ ఉండగా.. హిమప్రియ సాహసం చేసి ఉగ్రవాదులతో పోరాడింది. దాడిలో ఆమెతోపాటు ఆమె తల్లికి కూడా గాయమైనా.. వెరవకుండా ఉగ్రమూకలకు ఎదురెళ్లి క్వార్టర్స్‌లోని మరికొంత మందిని కాపాడింది. అమేయ, వీర్‌కాశ్యప్‌లకు పురస్కారాల ప్రదానం విశాఖకు చెందిన శాస్త్రీయ నృత్యకారిణి అమేయ, నేవల్ స్కూల్ విద్యార్థి వీర్‌కాశ్యప్ ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్–2021’ అందుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరఫున విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున సోమవారం వీటిని అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో అమేయను ప్రధాని మోదీ ప్రశంసించారు. వీరంతా ఢిల్లీలోని రాజ్‌పథ్‌పై జరిగే గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొననున్నారు. -
వణికిస్తున్న వరుణుడు
సాక్షి, విశాఖపట్నం: మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తదుపరి 48 గంటల్లో ఇది వాయవ్య దిశగా పయనించి.. 3 రోజుల తర్వాత దిశ మార్చుకొని ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. రేపు శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. సముద్రం వెంబడి గంటకు గరిష్టంగా 60 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు రెండు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. అవనిగడ్డ, తణుకు 6 సెం.మీ., అమలాపురం, ఏలూరు, బొబ్బిలి, మంగళగిరి, తునిలో 5సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
నేడు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం ఇది ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలోని వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిసే సూచనలున్నాయని విశాఖ వాతావరణ విభాగం వెల్లడించింది. సోమవారం ఉత్తరకోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. అల్పపీడనం కారణంగా కోస్తా తీరం వెంబడి సోమ, మంగళవారాల్లో బలమైన గాలులు వీచే సూచనలున్నాయి. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. -
‘కొట్టేసిన భూముల కోసమే ఆయన ఆరాటం’
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర ప్రజలంతా అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణను స్వాగతిస్తున్నారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. సోమవారం ఉదయం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలని.. తరతరాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లే పరిస్థితి ఉందన్నారు. విశాఖకు పరిపాలన రాజధానిగా అన్ని అర్హతలు, సౌకర్యాలున్నాయని పేర్కొన్నారు. వలసల ఉత్తరాంధ్ర.. ఇప్పుడు అభివృద్ధి ఉత్తరాంధ్ర గా మారుతుందన్నారు. శివరామకృష్ణన్ కమిటీ, జిఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలు అన్ని ఇదే విషయం చెప్పాయన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యతిరేకించడం దారుణమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలంతా చంద్రబాబు తీరును తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు సామాజికవర్గం కోసమే అభివృద్ధి వికేంద్రీకరణ ను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ లో కొట్టేసిన భూముల కోసమే ఆయన ఆరాటం అని మండిపడ్డారు. రాజధానిని తరలించడం లేదు..పెంచుతున్నాం.. రాజధానిని తరలించడం లేదని.. పెంచుతున్నామని పుష్ప శ్రీవాణి తెలిపారు. చంద్రబాబు తమ భూముల కోసమే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ రావడం వల్ల వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. -
రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం
సాక్షి, అమరావతి: రాజధాని విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని నేపథ్యంలో.. ఇప్పటికప్పుడు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే.. రాజధాని, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ వేసిన పిటిషన్ అపరిపక్వమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించాకే తగిన విధంగా స్పందిస్తామని, జనవరి 21లోపు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీఎన్ రావు కమిటీ, బోస్టస్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికలను తమ ముందుంచాలని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను జనవరి 23కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ ఎం.వెంకటరమణలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానితో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 585ని సవాలు చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి రామారావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కమిటీ నివేదికను అమలు చేయకుండా చూడాలని.. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ వంటివన్నీ అమరావతిలోనే కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రెండు అనుబంధ వ్యాజ్యాలు కూడా దాఖలు చేశారు. భూముల అభివృద్ధి, రాజధానిపై నిర్ణయం వేర్వేరు అంశాలు: హైకోర్టు పిటిషనర్ తరఫు న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపిస్తూ, జీఎన్ రావు కమిటీ ఏర్పాటు జీవో, తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ జీవోలో ఎక్కడా సీఆర్డీఏ చట్టం ప్రస్తావన లేదన్నారు. దాని ప్రస్తావన లేకుండా రాజధాని విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ఈ చట్టంలో ఎక్కడా నిర్ణీత కాల వ్యవధిలోగా భూముల్ని అభివృద్ధి చేసి ఇవ్వాలని లేదని.. రైతుల భూముల్ని అభివృద్ధి చేయడం గురించి మాత్రమే ఉందని పేర్కొంది. రైతుల భూములను అభివృద్ధి చేసి ఇవ్వడం, రాజధాని విషయంలో నిర్ణయాలు తీసుకోవడం వేర్వేరు అంశాలని వ్యాఖ్యానించింది. భూములిచ్చిన రైతులకు వారి భూములను అభివృద్ధి చేసి ఇవ్వడమే ముఖ్యమని, మిగిలిన భూమి విషయంలో ప్రభుత్వ నిర్ణయాలను మీరెలా తప్పు పట్టగలరని ప్రశ్నించింది. ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించకుండా.. తామెలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. ఇంకా బీసీజీ నివేదిక రావాల్సి ఉందని.. ఈ దశలో ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదన్నారు. మా వాదనలూ వినండి ఉత్తరాంధ్ర, రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలన్న జీఎన్ రావు కమిటీ సిఫార్సులను సమర్ధిస్తూ నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలకు చెందిన కొందరు హైకోర్టులో అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ధర్మాసనం ఈ వ్యాజ్యాలను అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది. -
ఉత్తరాంధ్ర వలసలపై స్పీకర్ కన్నీళ్లు
పొందూరు: ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై మాట్లాడుతూ స్పీకర్ తమ్మినేని సీతారాం కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం స్పీకర్ పర్యటించారు. ఈ సందర్భంగా తండ్యాం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ విజయవాడ, చెన్నై, ఢిల్లీ, ముంబై.. ఇలా ఏ నగరాలకెళ్లినా అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు వచ్చి పలకరిస్తుంటే సంతోషించాలో, బాధపడాలో తెలీని పరిస్థితి దాపురించిందని కన్నీరు పెట్టుకున్నారు. ఇంతమంది వలస వెళుతుంటే.. ఇక ఈ పదవులెందుకు?.. అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర రాజధాని అయితేనే ఈ పరిస్థితిని పారదోలవచ్చని.. రాజధానిగా ప్రకటించిన సీఎం వైఎస్ జగన్‌కు చేతులెత్తి నమస్కరిస్తున్నానంటూ ఉద్వేగానికి లోనయ్యారు. విశాఖ రాజధానిని కలిసి పోరాడి సాధించుకుందామని స్పీకర్ పిలుపునిచ్చారు. -
300 గ్రామాల్లో అంధకారం
సాక్షి, అమరావతి: ఫొని తుపాను ఉత్తరాంధ్రలో విద్యుత్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. మొత్తం 2 వేల విద్యుత్ స్తంభాలు నేలకూలగా, దాదాపు 300 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, కంతిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, పలాస, కవిటి, నందిగాం, టెక్కలి, సంతబొమ్మాళి, గార, పొలాకీ మండలాల్లో విద్యుత్ నష్టాలు భారీగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. 32 కేవీకి చెందిన 19 ఫీడర్లలోని 733 గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థకు అంతరాయం కలిగినట్టు, అయితే శుక్రవారం సాయంత్రానికి చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) సీఎండీ రాజబాపయ్య వివరించారు. కడపటి వార్తలు అందే సమయానికి విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చురుకుగా కొనసాగుతున్నాయి. విద్యుత్ శాఖ సలహాదారు రంగనాథం, ఏపీ ట్రాన్స్‌కో డైరెక్టర్ ఆడమ్స్ పరిస్థితిని చక్కదిద్దడానికి శ్రీకాకుళంలోనే మకాం వేశారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యే వరకూ తుపాను బాధిత ప్రాంతాల్లోనే ఉంటామని ఆడమ్స్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 2,600 మంది సిబ్బందిని రప్పించామని, వాళ్ళంతా రాత్రింబవళ్ళు విద్యుత్ పునరుద్ధరణకే కృషి చేస్తున్నారని రంగనాథం వివరించారు. తిత్లీ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలకు వీలుగా 400 ట్రాన్స్ఫార్మర్లు సిద్ధంగా ఉంచారు. అయితే, వీటి అవసరం పెద్దగా కన్పించలేదని, విద్యుత్ స్తంభాలు విరిగిపడటం తప్ప ట్రాన్స్ఫార్మర్లకు నష్టం వాటిల్లలేదని ఈపీడీసీఎల్ సీఎండీ రాజబాపయ్య తెలిపారు. వజ్రపుకొత్తూరు, పలాస, టెక్కలి మండలాల్లో కొన్ని నెలల క్రితమే తిత్లీ బీభత్సం సృష్టించింది. ఆ సమయంలో ఈ ప్రాంతాల్లో కొత్తగా విద్యుత్ స్తంభాలు, తీగలు వేశారు. ప్రస్తుతం గాలికి వీటిల్లో చాలా వరకు నేలకూలాయి. కొద్ది నెలల్లోనే వీటిని మళ్ళీ వేయాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. తుపాను తగ్గుముఖం పట్టిన కారణంగా శనివారం సాయంత్రానికి అన్ని గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరించే అవకాశం ఉందని ఈపీడీసీఎల్ అధికారులు తెలిపారు. -
లోకేశా.. ఇది లోకల్ ప్రేమేనా?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఉత్తరాంధ్ర ఔత్సాహికులు ఐటీ కంపెనీల ఏర్పాటుకు ముందుకు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ప్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి విదేశీ సంస్థలకే విలువైన భూములు ఇస్తోందన్న విమర్శలపై ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటనలు, ట్విట్టర్ వేదికగా ఇస్తున్న సమాధానాలు మరింత వివాదంగా మారుతున్నాయి. ఐటీ రంగంలో విశాఖలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పించే వారికి ఎర్ర తివాచీ వేస్తామని, ఆ మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ పారిశ్రామికవేత్త శ్రీనుబాబు.. పల్సస్ కంపెనీ పెట్టేందుకు వస్తే ప్రభుత్వం భూములు కేటాయించిందని లోకేష్ ఆర్భాటంగా ప్రకటించారు. వాస్తవానికి పల్సస్ కంపెనీకి ఇప్పటికీ గజం భూమి కూడా కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు కూడా పొందిన పల్సస్ సంస్థ ఐటీ రంగంలో మూడు వేల మందికి ఉపాధి కల్పిస్తామని దరఖాస్తు చేసి రెండేళ్లయినా ఇంకా పరిశీలనలోనే ఉంది. ఐదు నుంచి పది ఎకరాల్లోపు కేటాయించగలమని, ఎకరం ధర రూ.3 కోట్ల మేర ఉంటుందని సదరు పల్సస్ సంస్థకు సర్కారు చెబుతూ వస్తోంది. అయితే ఇప్పటికీ కేటాయింపుపై స్పష్టత లేకపోగా, నారా లోకేష్ మాత్రం పల్సస్ సంస్థకు కేటాయించేశామని చెప్పడం గమనార్హం. ఇదే విషయం ఇప్పుడు ఐటీరంగంలో చర్చనీయాంశమైంది. ప్రాంక్లిన్ టెంపుల్టన్కు అడ్డగోలు కేటాయింపులు ప్రాంక్లిన్ టెంపుల్టన్కు భూముల కేటాయింపులపై విమర్శలకు సమాధానంగానే లోకేష్ పల్సస్ ప్రస్తావన తెచ్చి.. మరిన్ని విమర్శలకు తావిచ్చారు. రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టే టెంపుల్టన్ రెండువేల ఉద్యోగాలు కల్పిస్తుందని లోకేష్ చెప్పారు. అందుకే 40 ఎకరాల భూములు కట్టబెట్టామని పేర్కొన్నారు. కానీ వాస్తవానికి టెంపుల్టన్ 25 ఎకరాలే కోరితే.. అత్యంత ఉదారంగా 40ఎకరాలు కేటాయించడంపై ఇప్పటికీ వివాదం చెలరేగుతోంది. తొలుత మల్టీనేషనల్ కంపెనీ టెంపుల్టన్, దేశీయ సంస్థ ఇన్నోవా సొల్యూషన్స్‌కు కలిపి 40 ఎకరాలు కేటాయిస్తున్నట్టు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రెండు సంస్థలు సంయుక్తంగా భూమిని అడగడంపై వివాదంతో పాటు.. ఇన్నోవా సొల్యూషన్స్ సంస్థ బాధ్యుడు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడని బయటకు రావడంతో సర్కారు వెనక్కి తగ్గి జీవోలో మార్పులు చేసింది. ఇన్నోవా సొల్యూషన్స్‌ను తప్పించి మొత్తం 40ఎకరాలూ టెంపుల్టన్‌కే కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులిచ్చింది. ఎకరానికి 40 రూ.లక్షలు చొప్పున రిషికొండలోని ఐటీ హిల్స్‌లో భూమి కేటాయిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ కేటాయింపుల్లోనూ అక్రమాలు దాగున్నాయి. 40 ఎకరాలు ధారాదత్తం చేస్తున్నా..రెండున్నరవేల ఉద్యోగాలేనా? ఐటీ నిబంధనల ప్రకారం.. భూములు తీసుకున్న కంపెనీలు ఎకరానికి 500మందికి ఉద్యోగాలు కల్పించాలి. ఆ మేరకు టెంపుల్టన్ 40ఎకరాలకు గానూ 20వేల మందికి ఉద్యోగాలివ్వాలి. కానీ లోకేష్ మాత్రం టెంపుల్టన్ కంపెనీ 2500 ఉద్యోగాలిస్తుందని గొప్పగా చెప్పారు. 20వేలమందికి ఇవ్వాల్సిన కంపెనీ 2,500మందికి ఇస్తామంటే సదరు మంత్రి ఘనంగా ప్రకటించడం విమర్శలపాలవుతోంది. మరోవైపు 3వేల ఉద్యోగాలు కచ్చితంగా కల్పిస్తామని చెబుతున్న శ్రీకాకుళం యువ పారిశ్రామికవేత్తకు చెందిన పల్సస్ కంపెనీకి ఐదు నుంచి పది ఎకరాల్లోపే ఇస్తామని చెబుతున్నా.. ఇంకా సాగదీస్తుండటం గమనార్హం. ఇక విదేశీ సంస్థ అయిన టెంపుల్టన్కు రిషికొండ ఐటీ హిల్స్‌లో ప్రైమ్ లొకేషన్లో ఎకరం రూ.40 లక్షలకు కట్టబెట్టిన సర్కారు.. పల్సస్‌కు మాత్రం ఎకరం రూ. 3కోట్ల ధర చెబుతోంది. ఇప్పుడు ఇదే విషయం ఐటీ వర్గాల్లో చర్చకు తెరలేపింది. ఇప్పటివరకు స్థానికులకు ఒక్కరికి కూడా భూములు కేటాయించకపోవడం కూడా చర్చకు తెరలేపింది. విశాఖ నగరానికే చెందిన 12మంది ఐటీ ప్రతినిధులు భూముల కోసం దరఖాస్తు చేసుకోగా, టీడీపీ సర్కారు కొలువుదీరిన నాలుగేళ్లలో ఒక్క దరఖాస్తుకు కూడా మోక్షం కలగలేదు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే లోకేష్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ప్రకటనలు చేయడం నవ్వులపాలవుతోంది. -
రాయలసీమలో సమ్మర్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలి
రాయలసీమలో సమ్మర్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని రాయలసీమ ఉత్తరాంధ్ర హక్కుల ఐక్య వేదిక మానవ హారం నిర్వహించారు. దీంతో పాటు రాయలసీమ ఉత్తరాంధ్రలలో హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు ఓల్డ్ సిటీలోని పాత బస్టాండ్ వద్దగల తెలుగు తల్లి విగ్రహం ఎదుట బుధవారం వందల మంది విద్యార్థులతో మానవ హారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. -
గబ్బర్ సింగ్, బాహుబలి..వినాయకుడి ప్రతిమలేంటి?
-
ఉపమాకకు పర్యాటక శోభ!
రూ. 2 కోట్లతో కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు ప్రతిపాదనలపై ముఖ్య కార్యదర్శితో నేతల చర్చలు తొలివిడతలో రూ. 25 లక్షల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ నక్కపల్లి : ఉత్తరాంద్రలో ప్రాచీన పుణ్యక్షేత్రమైన ఉపమాక వేంకటేశ్వరస్వా మి ఆలయాన్ని పర్యాటకపరంగా అభివృద్ధి చేసేం దుకు కసరత్తు వేగవంతమైంది. ఈ క్షేత్రాన్ని రూ. 2 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు కేంద్ర పర్యాటక శాఖకు వెళ్లాయి. కొండపైకి ఘాట్‌రోడ్, డార్మిటరీలు, బందుర సరస్సు పక్కగా రెయిలింగ్, తాగునీటి సదుపాయం కల్పనకు నిధులు మం జూరు చేయాలని జిల్లా కలెక్టర్ పర్యాటక శాఖకు తొలుత ప్రతిపాదించారు. అయితే నిధులు మంజూరు కాకపోవడంతో ఆ పనులేవీ ప్రారంభం కాలేదు. రెండుసార్లు ఇక్కడకు దర్శనానికి వచ్చిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్ దృష్టికి ఆ ప్రతిపాదనలను స్థానిక నాయకులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఉపమాకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంపై పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి చందనాఖన్‌తో ఎంపీ ముత్తంశెట్టితో పాటు జిల్లా మంత్రి అయ్యన్నపాత్రు డు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్ తదితరులు చర్చించినట్లు తెలిసింది. ఈ విషయమై దేవస్థానం ఈవో పైలా శేఖర్‌బాబును వివరణ కోరగా... ఉపమాకకు రూ. 25 లక్షలు కేటాయించాలని ప్రతిపాదించినట్లు పర్యాటక శాఖ అధికారులు చెప్పారన్నారు. ఈ నిదులు త్వరలో విడుదలవుతాయన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతిపాదించిన రూ. 2 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందని చెప్పారు.