ఉత్తరాంధ్ర వలసలపై స్పీకర్‌ కన్నీళ్లు | Tammineni Sitaram tears over Uttarandra people migration | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్ర వలసలపై స్పీకర్‌ కన్నీళ్లు

Published Tue, Dec 31 2019 4:20 AM | Last Updated on Tue, Dec 31 2019 4:20 AM

Tammineni Sitaram tears over Uttarandra people migration - Sakshi

భావోద్వేగంతో మాట్లాడుతున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం

పొందూరు: ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై మాట్లాడుతూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం స్పీకర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా తండ్యాం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ విజయవాడ, చెన్నై, ఢిల్లీ, ముంబై.. ఇలా ఏ నగరాలకెళ్లినా అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు వచ్చి పలకరిస్తుంటే సంతోషించాలో, బాధపడాలో తెలీని పరిస్థితి దాపురించిందని కన్నీరు పెట్టుకున్నారు.

ఇంతమంది వలస వెళుతుంటే.. ఇక ఈ పదవులెందుకు?.. అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర రాజధాని అయితేనే ఈ పరిస్థితిని పారదోలవచ్చని.. రాజధానిగా ప్రకటించిన సీఎం వైఎస్‌ జగన్‌కు చేతులెత్తి నమస్కరిస్తున్నానంటూ ఉద్వేగానికి లోనయ్యారు. విశాఖ రాజధానిని కలిసి పోరాడి సాధించుకుందామని స్పీకర్‌ పిలుపునిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement