
సాక్షి, తాడేపల్లి: ఉత్తరాంధ్రలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ సీనియర్ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ పార్టీ కండువా కప్పి సీఎం జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
వివరాల ప్రకారం.. ఉత్తరాంధ్రలో టీడీపీ సీనియర్ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో అనకాపల్లి టీడీపీ నేత మలశాల భరత్, పాలకొండ మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, విశాఖ డెయిరీ డైరెక్టర్ రమణరావు, మాజీ ఎంపీపీ ధనమ్మ, విశాఖ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రాజా ఉన్నారు. సీఎం జగన్‌కు వీరికి వైఎస్సార్‌సీపీ పార్టీ కండువా తప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రీజనల్ ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: మీ నాన్ననే ఉరికించాం.. నువ్వెంత..: మంత్రి జోగి రమేష్
Comments
Please login to add a commentAdd a comment