శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర బాగుపడటం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఇష్టం లేదనే విషయం నిన్నటి సభ ద్వారా మరోసారి అర్ధమైందని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. అసలు పవన్ మాటలకు చేతలకు పొంతనే లేదని ధర్మాన విమర్శించారు.ఈరోజు (శుక్రవారం) మాట్లాడిన ధర్మాన.. ‘ ఉత్తరాంధ్ర బాగుపడటం పవన్‌కు ఇష్టం లేదా?, పవన్ మాటలకు చేతలకు పొంతన లేదు. ప్రజా నాయకులు హుందాగా ఉండాలి. పుస్తకాలు చదవడం కాదు.. అందులో ఉండే భావజాలాన్నిఅర్థం చేసుకోవాలి.
అమరావతిలో రాజధాని అనేది రియల్టర్ల కోసమే. విశాఖ రాజధానితో మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టినష్టపోయాం. అలాంటి తప్పు మళ్లీ జరగకూడదనే వికేంద్రీకరణ. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం.కిడ్నీ బాధితుల కోసం పలాసలోనే ఆస్పత్రి ఏర్పాటు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అన్ని వర్గాలు ఆత్మ గౌరవంగా ఉండేలా సీఎం జగన్ పాలన.’ అని మంత్రి ధర్మాన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment