
( ఫైల్ ఫోటో )
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి విడదల రజని సీరియస్ అయ్యారు. చంద్రబాబు నాయుడు ఏ మొహం పెట్టుకుని ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. చంద్రబాబుకు ఉత్తరాంధ్రలో తిరిగే హక్కు లేదంటూ ఫైరయ్యారు.
కాగా, మంత్రి విడదల రజని మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధిని వ్యతిరేకించే చంద్రబాబుకు ఉత్తరాంధ్రలో తిరిగే హక్కు లేదు. విశాఖ పాలనా రాజధానికి చంద్రబాబు అడ్డుపడుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రను పట్టించుకోలేదు. ఏపీలోనే ఉనికిలేని చంద్రబాబు.. తెలంగాణలో ఏం చేస్తారు?. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు ద్వారా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తుంటే చంద్రబాబు అడుగడుగునా అడ్డుకుంటున్నారు అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment