
నారా లోకేష్ తో కూటమి బలపరిచిన అభ్యర్థి రఘువర్మ
సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడు గెలుపొందారు. కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఓడిపోయారు. దీంతో ఓటమిని అంగీకరిస్తూ రఘువర్మ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేశారు. ఓడిపోయినప్పటికీ టీచర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వంపై ప్రభుత్వ టీచర్ల వ్యతిరేకత
ఉత్తరాంధ్ర టీచర్ ఎన్నికల ఫలితాలతో 9 నెలలకే ప్రభుత్వంపై టీచర్ల వ్యతిరేకత సుస్పష్టమైంది. ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తిరుగుబాటు ప్రకటించారు. అందుకు ఊతం ఇచ్చేలా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ టీచర్లు కూటమికి ఓటమి రుచి చూపించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘు వర్మను ఓడించారు. పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడిని గెలిపించారు.
చంద్రబాబుకు ఓటమి రుచి చూపించిన ప్రభుత్వ టీచర్లు
రఘువర్మను కూటమి అభ్యర్థిగా టీడీపీ, జనసేన,బీజేపీలు పోటీకి పెట్టాయి. తొలి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యతలోనూ కూటమి అభ్యర్థి వెనకపడ్డారు. బ్యాలెట్ ఓటింగ్‌లో కూటమి పార్టీ అభ్యర్థికి భంగపాటు ఎదురైంది. దీంతో చరిత్రలో ఏ ప్రభుత్వానికి ఎదురుకాని చేదు అనుభవం కూటమి ప్రభుత్వానికి ఎదురైంది. ఎన్నికల్లో గెలిచాక ఉద్యోగులు, ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ ఇవ్వలేదు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఊసెత్తలేదు. దీంతో ప్రభుత్వ టీచర్లలో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. ఫలితంగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు ఓటమి అనివార్యమైంది.
Comments
Please login to add a commentAdd a comment