తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలి: వినాయక్‌ | Director Vinayak Speak Kapu Corporation Chairman Swearing Program | Sakshi
Sakshi News home page

తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలి

Published Sun, Aug 11 2019 4:39 PM | Last Updated on Tue, Aug 13 2019 1:37 PM

director Vinayak speak Kapu Corporation Chairman swearing program - Sakshi

సాక్షి, విజయవాడ: దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్‌రావు వారసుడిగా రాజా కీర్తి ప్రతిష్టతలు ఇనుమడింప చేయాలని సినీ దర్శకుడు వి.వి. వినాయక్‌ ఆకాక్షించారు. కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా ఆదివారం విజయవాడలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన వినాయక్‌ మాట్లాడుతూ.. ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న గొప్ప నాయకుడిగా జక్కంపూడి రామ్మోహన్‌రావును ప్రస్తుతించారు. తండ్రి బాటలో నడిచి ఆయన ఆశయాలను రాజా నెరవేర్చాలని అన్నారు. జక్కంపూడి రాజాకు కాపు కార్పొరేషన్‌ పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement