Director VV Vinayak
-
తిరగబడరా...
రాజ్ తరుణ్ హీరోగా, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడరా సామీ’. ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ని డైరెక్టర్ వీవీ వినాయక్ విడుదల చేసి, సినిమా మంచి విజయం సాధించాలని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జేబీ, కెమెరా: జవహర్ రెడ్డి. -
ఐదు లక్షలు విరాళం
కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో రోజువారీ వేతనంతో బతికే పేద కళాకారులు, సాంకేతిక నిపుణులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివారికి సాయం చేసేందుకు డైరెక్టర్ వీవీ వినాయక్ ఐదు లక్షలు విరాళం అందించారు. నటుడు కాదంబరి కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ‘మనం సైతం’ ఫౌండేషన్‌కు ఆయన ఈ నగదును అందజేశారు. ఈ సందర్భంగా వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘ఈరోజు అందర్నీ వణికిస్తోన్న కరోనా వైరస్‌ను మనం ఇళ్లల్లో ఉండి వణికించాలి. షూటింగ్స్ లేకపోవడంతో నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకు నిత్యావసర వస్తువులను అందజేసే నిమిత్తం నా వంతుగా రూ. 5 లక్షల చెక్కును కాదంబరి కిరణ్‌కి అందజేశా. అవసరమైనవారు కిరణ్‌ని సంప్రదించి నిత్యావసర వస్తువులను తీసుకోవాలి’’ అన్నారు. నిర్మాత రామసత్యనారాయణ, వల్లభనేని అనిల్ పాల్గొన్నారు. -
తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలి: వినాయక్
సాక్షి, విజయవాడ: దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్రావు వారసుడిగా రాజా కీర్తి ప్రతిష్టతలు ఇనుమడింప చేయాలని సినీ దర్శకుడు వి.వి. వినాయక్ ఆకాక్షించారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా ఆదివారం విజయవాడలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన వినాయక్ మాట్లాడుతూ.. ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న గొప్ప నాయకుడిగా జక్కంపూడి రామ్మోహన్‌రావును ప్రస్తుతించారు. తండ్రి బాటలో నడిచి ఆయన ఆశయాలను రాజా నెరవేర్చాలని అన్నారు. జక్కంపూడి రాజాకు కాపు కార్పొరేషన్ పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
అఖిల్
ఏ హీరోకీ దక్కని సువర్ణావకాశం అఖిల్‌కి దక్కింది. తొలి సినిమా టైటిలే తన పేరు మీద రావడమనేది ఇంతవరకూ ఏ హీరోకీ జరగలేదు. అఖిల్ సినిమాకి ఏం పేరు పెడతారా అని అందరూ రకరకాల ఊహాగానాలతో ఎదురుచూస్తుంటే, ‘అఖిల్’ టైటిల్ అనౌన్స్ చేసి అభిమానుల్ని థ్రిల్ చేశారు దర్శకుడు వీవీ వినాయక్. ఈ నెల 20న ఏయన్నార్ జయంతికి పాటలు విడుదల కానున్నాయి. అక్టోబర్ 22న విజయదశమి కానుకగా విడుదల చేస్తామని ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్న హీరో నితిన్ తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కొన్ని పాటలను అఖిల్, హీరోయిన్ సాయేషాలపై ఆస్ట్రియా, స్పెయిన్లలో చిత్రీకరిస్తున్నారు.