కాపు జాతితో బాబు మైండ్‌ గేమ్‌: ముద్రగడ | Mudragada comments on chandrababu | Sakshi
Sakshi News home page

కాపు జాతితో బాబు మైండ్‌ గేమ్‌: ముద్రగడ

Published Fri, Dec 30 2016 5:11 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

కాపు జాతితో బాబు మైండ్‌ గేమ్‌: ముద్రగడ - Sakshi

కాపు జాతితో బాబు మైండ్‌ గేమ్‌: ముద్రగడ

కిర్లంపూడి: కాపు జాతితో ఏపీ సీఎం చంద్రబాబు మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్ర గడ పద్మనాభం ఆరోపించారు. కాపు రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన కాపులకు బహిరంగ లేఖ విడుదల చేశారు.

‘ఈ మధ్య మన జాతి (బలిజ, తెలగ, ఒంటరి, కాపు) రిజర్వేషన్ల సాధన కోసం చేస్తున్న నిరసన లను తట్టుకోలేక చంద్రబాబు ప్రభుత్వం.. వారి పెంపుడు పత్రిక, చానల్‌లో కాపు పోరాటంలో చీలికలని, కాపు, బలిజల మధ్య కుమ్ములాటలని రాయిస్తోంది’ అని ముద్రగడ మండిపడ్డారు. ఉద్యమం ప్రారంభం నుంచి తనను తిట్టించడం కోసం కొంత మంది పెద్దలతో పాటు కాపు కార్పొరేషన్‌నూ ప్రభుత్వం వినియోగించు కుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement