పథకాల అమలు కోరుతూ ధర్నా
Published Tue, Aug 30 2016 12:18 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM
ఏలూరు (సెంట్రల్): ఎస్టీ ఉప కులాలకు సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయాలని కోరుతూ సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద రాష్ట్ర ఎస్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సింగం పట్టాభి మాట్లాడుతూ గిరిజన కాలనీల్లో కమ్యూనిటీ భవనాలు నిర్మించాలని, ప్రతి గిరిజన కుటుంబానికి 3 ఎకరాల భూమి, కులవృత్తులు చేసుకుంటున్న ఎస్టీలకు రుణాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, బోగస్ గిరిజనులను కఠినంగా శిక్షించి, నిజమైన ఎస్టీలకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ కె.భాస్కర్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో çపలువురు మహిళలు పాల్గొన్నారు
Advertisement