
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గత వారం నష్టాలతో మొదలు పెట్టి చివరకు లాభాలతో స్టాక్ మార్కెట్ ముగిసింది. ఈ సోమవారం లాభాలతో మార్కెట్ ప్రారంభం అవుతుందని ఆశించగా.. మార్కెట్ ప్రారంభమైన కాసేపటికే ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభించారు. దీంతో దేశీ సూచీలు వెనువెంటనే పాయింట్లు కోల్పోవడం ప్రారంభించాయి. మరోవైపు అంతర్జాతీయ సూచీలు సైతం మిశ్రమంగా స్పందిస్తున్నాయి, దీంతో మార్కెట్‌లో అస్థిరత నెలకొంది.
బాంబే స్టాక్ ఎక్సేంజీ గత శుక్రవారం 52,,975 పాయింట్ల వద్ద క్లోజవగా ఈ రోజు ఉదయం 52,985 పాయింట్లతో మొదలైంది. అయితే కాసేపటికే వరుసగా పాయింట్లు కోల్పోవడం మొదలైంది. ఉదయం 9:30 గంటల సమయానికి 100 పాయింట్లు నష్టపోయి 52,875 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా నష్టాల బాటలోనే వెళ్తోంది. ఉదయం 9:30 గంటల సమయానికి 6 పాయింట్లు నష్టపోయి 15,849 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది..
Comments
Please login to add a commentAdd a comment