కైలాసనాధ కోనలో భక్తుల రద్దీ | heavy rush in kailasanadhakona | Sakshi
Sakshi News home page

కైలాసనాధ కోనలో భక్తుల రద్దీ

Published Mon, Sep 26 2016 5:30 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

కైలాసనాధకోనలో  పవిత్ర స్నానాలు చేస్తున్న భక్తులు

కైలాసనాధకోనలో పవిత్ర స్నానాలు చేస్తున్న భక్తులు

 
నారాయణవనం:  
ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన కైలాసనాధకోనలో సోమవారం భక్తులు అధిక సంఖ్యలో పవిత్ర స్నానాలు చేసి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఇటీవల పదవీ విరమణ పొంది దేవాదాయ శాఖ అటెండర్‌ గురవయ్య కామాక్షాంభిక, కైలాసనాధునికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. అనంతరం సుమారు 600 మంది భక్తులకు, పర్యాటకులకు అన్నప్రసాదాలను ఆయన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది గుర్రప్ప, పుత్తూరు సదాశివేశ్వరస్వామి ఆలయ కమిటి సభ్యులు శివ, కృష్ణ, మునిరాజ తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement