abhisekam
-
9న నరసన్నకు సప్తనదీతీర్థ మహాజ్యేష్ఠాభిషేకం
సఖినేటిపల్లి (రాజోలు) : శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మూలవిరాట్‌కు ఈ నెల 9న సప్తనదీ తీర్థ మహాజ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నట్టు ఆలయ ప్రధానార్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, ఆలయ ఇ¯ŒSచార్జ్ అసిస్టెంట్ కమిషనర్ వి.దేముళ్లు శుక్రవారం తెలిపారు. దేవస్థానం ఆధ్వర్యంలో గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావే రి జలాలను క్షేత్రానికి తీసుకువచ్చినట్టు తెలిపారు. జ్యేష్ఠపూర్ణిమ, జ్యేష్ఠా నక్షత్ర పర్వదినం సందర్భంగా స్వామివారికి పుణ్యనదుల జలాలతో విశేష పూజలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అభిషేకంలో పాల్గొనే భక్తులు దేవస్థానానికి రూ.200 చెల్లించి, టిక్కెట్టు తీసుకోవాలని కోరారు. స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, ఆలయ పర్యవేక్షకుడు డి.రామకృష్ణంరాజు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
కైలాసనాధ కోనలో భక్తుల రద్దీ
నారాయణవనం: ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన కైలాసనాధకోనలో సోమవారం భక్తులు అధిక సంఖ్యలో పవిత్ర స్నానాలు చేసి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఇటీవల పదవీ విరమణ పొంది దేవాదాయ శాఖ అటెండర్ గురవయ్య కామాక్షాంభిక, కైలాసనాధునికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. అనంతరం సుమారు 600 మంది భక్తులకు, పర్యాటకులకు అన్నప్రసాదాలను ఆయన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది గుర్రప్ప, పుత్తూరు సదాశివేశ్వరస్వామి ఆలయ కమిటి సభ్యులు శివ, కృష్ణ, మునిరాజ తదితరులు పాల్గొన్నారు. -
ఏకదంతుడికి శతకలశ క్షీరాభిషేకం
–తరలివచ్చిన భక్తజన సమూహం కాణిపాకం(ఐరాల): స్వయంభువు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ప్రత్యేకోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం శతకలశ క్షీరాభిషేకం జరిగింది. ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాకార మండపంలో ఉభయదారులు ఉత్సవమూర్తులకు సాంప్రదాయ బద్ధంగా అష్టోత్తర శతకలశ క్షీరాభిషేకం నిర్వహించారు. ఈక్రమంలో దేవస్థాన సిబ్బంది, అర్చకులు, వేదపండితులు ఆలయ సిబ్బంది ఉభయదారులుగా వ్యవహరించారు. వారితో పాటు గ్రామస్తులు క్షీర కలశాలను కాణిపాకం పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాకార మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సిద్ధి బుద్ధి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ తేనె, నెయ్యి , పెరుగు, పాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అలంకరణ చేసి, దూపధీప నైవేద్యాలను సమర్పించారు. ఆలయాధికారులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఈఓ పూర్ణచంద్రారావు, ఏఈఓ కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్ర బాబు , ఇన్స్పెక్టర్లు చిట్టిబాబు, మల్లికార్జున పాల్గొన్నారు.