9న నరసన్నకు సప్తనదీతీర్థ మహాజ్యేష్ఠాభిషేకం
9న నరసన్నకు సప్తనదీతీర్థ మహాజ్యేష్ఠాభిషేకం
Published Fri, Jun 2 2017 11:24 PM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM
సఖినేటిపల్లి (రాజోలు) :
శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మూలవిరాట్‌కు ఈ నెల 9న సప్తనదీ తీర్థ మహాజ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నట్టు ఆలయ ప్రధానార్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, ఆలయ ఇ¯ŒSచార్జ్ అసిస్టెంట్ కమిషనర్ వి.దేముళ్లు శుక్రవారం తెలిపారు. దేవస్థానం ఆధ్వర్యంలో గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావే రి జలాలను క్షేత్రానికి తీసుకువచ్చినట్టు తెలిపారు. జ్యేష్ఠపూర్ణిమ, జ్యేష్ఠా నక్షత్ర పర్వదినం సందర్భంగా స్వామివారికి పుణ్యనదుల జలాలతో విశేష పూజలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అభిషేకంలో పాల్గొనే భక్తులు దేవస్థానానికి రూ.200 చెల్లించి, టిక్కెట్టు తీసుకోవాలని కోరారు. స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, ఆలయ పర్యవేక్షకుడు డి.రామకృష్ణంరాజు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement