narasanna
-
9న నరసన్నకు సప్తనదీతీర్థ మహాజ్యేష్ఠాభిషేకం
సఖినేటిపల్లి (రాజోలు) : శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మూలవిరాట్‌కు ఈ నెల 9న సప్తనదీ తీర్థ మహాజ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నట్టు ఆలయ ప్రధానార్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, ఆలయ ఇ¯ŒSచార్జ్ అసిస్టెంట్ కమిషనర్ వి.దేముళ్లు శుక్రవారం తెలిపారు. దేవస్థానం ఆధ్వర్యంలో గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావే రి జలాలను క్షేత్రానికి తీసుకువచ్చినట్టు తెలిపారు. జ్యేష్ఠపూర్ణిమ, జ్యేష్ఠా నక్షత్ర పర్వదినం సందర్భంగా స్వామివారికి పుణ్యనదుల జలాలతో విశేష పూజలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అభిషేకంలో పాల్గొనే భక్తులు దేవస్థానానికి రూ.200 చెల్లించి, టిక్కెట్టు తీసుకోవాలని కోరారు. స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, ఆలయ పర్యవేక్షకుడు డి.రామకృష్ణంరాజు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
8న కోరుకొండ నరసన్న కల్యాణం
అదే రోజు మధ్యాహ్నం రథోత్సవం 12 వ తేదీ వరకూ ఉత్సవాలు అన్నవరం దేవస్థానంలో వాల్‌పోస్టర్ ఆవిష్కరణ అన్నవరం : అన్నవరం దేవస్థానం దత్తత ఆలయమైన కోరుకొండలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి దివ్యకల్యాణ మహోత్సవాలు మార్చి ఎనిమిది నుంచి 12వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు తెలిపారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు హాలులో మంగళవారం స్వామివారి కల్యాణానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఫాల్గుణ శుద్ద ఏకాదశి, మార్చి ఎనిమిదో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు స్వామివారి రథోత్సవం, అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం నిర్వహిస్తారని వారు చెప్పారు. మిగిలిన నాలుగు రోజులు రోజుకొక వైదిక కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. దేవస్థానం పీఆర్ఓ తులా రాము, వ్రతపురోహిత సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఛామర్తి వెంకటరెడ్డి పంతులు (కన్నబాబు), కార్యదర్శి బండి నర్శింహమూర్తి, వ్రతపురోహితులు ఆకొండి వ్యాస్, కర్రి వైకుంఠం తదితరులు పాల్గొన్నారు. -
ఫిబ్రవరి 3 నుంచి నరసన్న కల్యాణోత్సవాలు
అంతర్వేది (సఖినేటిపల్లి) : ఫిబ్రవరి 3 నుంచి 11వ తేదీ వరకూ అంతర్వేది శ్రీలక్షీ్మనృసింహస్వామివారి కల్యాణమహోత్సవాలకు ముహూర్తాలను నిర్ణయించినట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చిక్కాల వెంకట్రావు మంగళవారం చెప్పారు. ఈ మేరకు ఆలయంలో శ్రీస్వామివారి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి దైవజ్ఞ తంగిరాల ప్రభాకరపూర్ణయ్య గంటల పంచాంగాన్ని బట్టి ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాసకిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు కల్యాణ మహోత్సవాలకు ముహూర్తాలను నిర్ణయించారు. కల్యాణ మహోత్సవాల శుభలేఖను తయారుచేసి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చిక్కాల వెంకట్రావుకు వారు అందజేశారు. కల్యాణ మహోత్సవాలలో పర్వదినాలు, వాటి సమయాలను త్వరలోనే ప్రకటిస్తామని ప్రధాన అర్చకుడు కిరణ్ పేర్కొన్నారు. కాగా ధనుర్మాసంలో ఈ నెల 24 వచ్చిన శ్రీస్వామివారి జన్మనక్షత్రం ప్రత్యేక పూజలు ఉదయం ఏడుగంటలకు నిర్వహిస్తున్నట్టు, అభిషేకం తెల్లవారుజామున నాలుగు గంటలకు నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకుడు కిరణ్ తెలిపారు.