ఫిబ్రవరి 3 నుంచి నరసన్న కల్యాణోత్సవాలు | narasanna festivals feb-3 to | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 3 నుంచి నరసన్న కల్యాణోత్సవాలు

Published Tue, Dec 20 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM

narasanna festivals feb-3 to

అంతర్వేది (సఖినేటిపల్లి) :
ఫిబ్రవరి 3 నుంచి 11వ తేదీ వరకూ అంతర్వేది శ్రీలక్షీ్మనృసింహస్వామివారి కల్యాణమహోత్సవాలకు ముహూర్తాలను నిర్ణయించినట్టు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ చిక్కాల వెంకట్రావు మంగళవారం చెప్పారు. ఈ మేరకు ఆలయంలో శ్రీస్వామివారి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి దైవజ్ఞ తంగిరాల ప్రభాకరపూర్ణయ్య గంటల పంచాంగాన్ని బట్టి ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాసకిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు కల్యాణ మహోత్సవాలకు ముహూర్తాలను నిర్ణయించారు. కల్యాణ మహోత్సవాల శుభలేఖను తయారుచేసి ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ చిక్కాల వెంకట్రావుకు వారు అందజేశారు. కల్యాణ మహోత్సవాలలో పర్వదినాలు, వాటి సమయాలను త్వరలోనే ప్రకటిస్తామని ప్రధాన అర్చకుడు కిరణ్‌ పేర్కొన్నారు. కాగా ధనుర్మాసంలో ఈ నెల 24 వచ్చిన శ్రీస్వామివారి జన్మనక్షత్రం ప్రత్యేక పూజలు ఉదయం  ఏడుగంటలకు నిర్వహిస్తున్నట్టు, అభిషేకం తెల్లవారుజామున నాలుగు గంటలకు నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకుడు కిరణ్‌ తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement