Antarvedi
-
వైభవంగా అంతర్వేది తిరు కళ్యాణ మహోత్సవాలు
-
కోనసీమ జిల్లా : వైభవంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం (ఫొటోలు)
-
ఫిబ్రవరి 8 నుంచి అంతర్వేది ఉత్సవాలు
సాక్షి, సఖినేటిపల్లి: అంతర్వేది శ్రీలక్ష్మీనృసింహస్వామి దివ్య తిరుకల్యాణ మహోత్సవాల షెడ్యూల్ విడుదలైంది. దేవస్థానం కార్యాలయంలో గురువారం జరిగిన ప్రత్యేక సమావేశంలో విడుదల చేశారు. ఆలయ అర్చకులు, వేదపండితులు నిర్ణయించిన ముహూర్తానికి ఆలయంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.విజయరాజు ఉత్సవాల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఫిబ్రవరి 8న రథసప్తమి, 11న స్వామి కల్యాణం, 12న రథోత్సవం, 16న పౌర్ణమి సముద్రస్నానం, 17న తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. ఆలయ చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ శ్రీరాజా కలిదిండి కుమార రామగోపాలరాజా బహద్దూర్, అసిస్టెంట్ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ, దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ జి.ప్రసాద్, ఎంపీపీ వీరా మల్లిబాబు, ఈఓ బి.వెంకటేశ్వరరావు, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, అర్చకులు పాల్గొన్నారు. (చదవండి: తిరుమల శ్రీవారి టికెట్లకు ఫుల్ డిమాండ్) -
లక్ష్మీనృసింహుని సన్నిధిలో శర్వానంద్, రష్మిక
సాక్షి, సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ చిత్రం హీరో హీరోయిన్లు శర్వానంద్, రష్మికా మంధన్న గురువారం సందడి చేశారు. స్వామి వారికి వారు ప్రత్యేక పూజలు చేశారు. వారికి ప్రధానార్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, వేద పండితుడు చింతా వేంకటశాస్త్రి ఆశీర్వచనాలు తెలిపారు. క్షేత్ర మహాత్మ్యం గురించి వారు అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఆలయంలో చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేశారు. లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సారథ్యంలో తిరుమల కిశోర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సందర్భంగా శర్వానంద్, రష్మిక మాట్లాడుతూ, గోదావరి తీరం చాలా ఆహ్లాదకరంగా ఉందన్నారు. చక్కటి వాతావరణం, కొబ్బరి తోటలు, పంట పొలాలు కనువిందు చేస్తున్నాయని అన్నారు. చదవండి: (అభిమానులకు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ అజయ్‌భూపతి) -
సముద్రంలో అల్లకల్లోలం: ముందుకొచ్చి.. వెనక్కి మళ్లి
-
దేవాలయాల పరిరక్షణకు పటిష్ట చర్యలు
చిలకలూరిపేట: దేవాలయాల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని క్రైస్తవ శ్మశానవాటికను ఎమ్మెల్యే విడదల రజనితో కలిసి శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి విమర్శించేందుకు ఏమీ లేక టీడీపీ వంటి ప్రతిపక్షాలు కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు అంతర్వేది వంటి ఘటనలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. అందుకే ప్రభుత్వం ఈ కుట్ర కోణాన్ని వెలికి తీసేందుకు అంతర్వేది కేసు విచారణను సీబీఐకి అప్పగించినట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
‘చలో అంతర్వేది’కి అనుమతుల్లేవ్
ఏలూరు టౌన్: ప్రశాంతమైన కోనసీమ ప్రాంతంలో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు హెచ్చరించారు. రాజకీయ పార్టీలు చలో అంతర్వేది, చలో అమలాపురం అంటూ పిలుపునిస్తున్నా యనీ వీటికి ఎటువంటి అనుమతులు లేవన్నారు. ప్రజలు సంయమనంగా ఉండాలని కోరారు. ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్‌తో కలిసి డీఐజీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, నిందితులు ఎంతటివారైనా పట్టుకుని శిక్షించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రూ.95 లక్షలతో నూతనంగా రథాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కోవిడ్–19 నిబంధనలు అమల్లో ఉండగా, కోనసీమలో 34, 144 సెక్షన్లు అమలులో ఉన్నాయని, ఎవరూ ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేసేందుకు అనుమతులు లేవన్నారు. నిబంధనలు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులకు దూరంగా ఉండాలని కోరారు. ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. అంతర్వేది ఘటనపై ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. సీబీఐ దర్యాప్తులో ఉన్నందున ఈ కేసుకు సంబంధించి ఇతర విషయాలపై మాట్లాడకూడదన్నారు. అంతర్వేది ప్రాంతంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని, అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలెవరూ ఆందోళనలు చేసేందుకు రావటానికి అనుమతులు లేవని చెప్పారు. -
ఏడంతస్తులు.. 41 అడుగుల ఎత్తుతో నిర్మాణం
సాక్షి, విజయవాడ: వచ్చే ఫిబ్రవరిలో అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణోత్సవాలు జరుగుతాయి. అప్పటిలోగా అందరి అభిప్రాయాల మేరకు.. ఆకృతిలో ఎటువంటి మార్పులు లేకుండా రథాన్ని సిద్ధం చేయాలని అధికారులను అదేశించిన్నట్లు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం బ్రాహ్మణ వీధి దేవదాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆ శాఖ కమిషనర్ పి.అర్జునరావుతో మంత్రి వెలంపల్లి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొత్త రథం నిర్మాణానికి ఆకృతి సిద్ధమైందన్నారు. రథం నిర్మాణంపై చర్చించి ఆకృతిని తయారు చేయించామన్నారు. కొత్త రథాన్ని శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తు వచ్చేలా ఆకృతి రూపొందించామన్నారు. (చదవండి: ఈ అలజడి ఎవరి మనోరథం?) ఆరు చక్రాలతో కూడిన రథం మొత్తాన్ని ఏడు అంతస్తులుగా రూపొందిస్తున్నమని వెలంపల్లి తెలిపారు. కొత్త రథం నిర్మాణంతో పాటు.. రథశాల మరమ్మతుల నిమిత్తం 95 లక్షల రూపాయలు ఖర్చవుతుందన్నారు. ఈ మేరకు దేవదాయశాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందన్నారు మంత్రి వెలంపల్లి. సమావేశంలో దేవదాయ శాఖ కమిషనర్ పి.అర్జునరావు, ఎస్ఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అంతర్వేది ఘటన వెనుక చంద్రబాబు హస్తం..
సాక్షి, విశాఖపట్నం: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం దగ్ధమైన ఘటన వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరుల హస్తం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ప్రవాస అంద్రుడిలా హైదరాబాద్‌లో ఉంటూ రాష్ట్రంలో అలజడి సృష్టించాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరామని, త్వరలోనే చినబాబు, పెదబాబు హస్తం బయటపడుతుందంటూ చంద్రబాబు, నారా లోకేశ్‌లను ఉద్దేశించి విమర్శించారు. అంతర్వేదిలో గలాటా సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగాయని ప్రచారం చేయాలనుకున్నారని మండిపడ్డారు. ఈ ఘటనలో గుంటూరు, హైదరాబాద్ వ్యక్తుల ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారని తెలిపారు. స్థానికంగా శుక్రవారం జరిగిన‘మన ఆరోగ్యం మన చేతుల్లోనే’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటనతో ఇక్కడి భూములకు ధరలు పెరిగాయన్నారు. భూ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఘటనల్లో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.(చదవండి: అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు) మతాల పేరిట విధ్వంసం: మంత్రి అవంతి అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు సీఎం ఆదేశించడం సంతోషకరమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో మతాల పేరిట విధ్వంసం సృష్టించే యత్నం కొన్ని పార్టీలు చేస్తున్నాయని ఆరోపించారు. రాజధాని అంశం రాష్ట్రాల పరిధిలోనే ఉందని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. చంద్రబాబు ట్రాప్‌లో పడి పవన్ కళ్యాణ్ అమరావతిపై ప్రేమ కనబరుస్తున్నారని అన్నారు. 13 జిల్లాల ప్రజలు కలిసి ఉండాలన్న ఉద్దేశంతోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రతిపాదన చేసినట్టు చెప్పారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ జూమ్ ద్వారా ప్రజలలో చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. కాగా ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎన్వీవి సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ సత్యవతి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, అదీప్ రాజు, తిప్పల నాగిరెడ్డి, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, నార్త్ కన్వీనర్ కేకే రాజు, నగర కన్వీనర్ వంశీ కృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తదితరులు పాల్గొన్నారు. -
‘అంతర్వేది’పై సీబీఐ..
సాక్షి, అమరావతి: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సీఎం వైఎస్ జగన్ గురువారం నిర్ణయించారు. ఈ ఘటనను సీఎం సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. కేసు దర్యాప్తును ఏపీ పోలీసులు సవాలుగా తీసుకున్న తరువాత కూడా కొన్ని రాజకీయ శక్తులు, సంఘాలు మీడియా సమావేశాలు, సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్రప్రభుత్వంపై లేనిపోని ఆపోహలను ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. దోషులు ఎవరైనాసరే కఠినంగా శిక్షించాల్సిందేనన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని ప్రకటించింది. పలు రాజకీయ పార్టీల సంఘాలు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పూర్తి పారదర్శకమైన ప్రభుత్వంగా ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు సీబీఐ దర్యాప్తును కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన జీఓ శుక్రవారం వెలువడనుంది. సీబీఐతో విచారణ జరిపించండి : డీజీపీ లేఖ కాగా, రథం దగ్థం కేసును సీబీఐతో విచారణ జరపించాల్సిందిగా కేంద్ర హోంశాఖకు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ గురువారం లేఖ రాశారు. సీఎం ఆదేశాల మేరకు డీజీపీ ఈ లేఖ రాశారు. ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇదిలా ఉంటే.. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ ఇప్పటికే పలు రకాల చర్యలు చేపట్టింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. మంత్రులూ క్షేత్రస్థాయిలో పర్యటించి రథం దగ్థం సంఘటనపై సమీక్షించారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. స్థానిక అధికారులూ అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చింది. అంతేకాక.. ఆలయ ఈవో చక్రధరరావును సస్పెండ్ కూడా చేసింది. పాత రథం స్థానంలో కొత్త రథం తయారీకి ఆదేశాలిచ్చింది. ఇందులో భాగంగా రూ.95లక్షలను మంజూరు కూడా చేసింది. ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దంపట్టే ఇన్ని చర్యలు స్పష్టంగా ఉన్నా కొన్ని రాజకీయ శక్తులు, సంఘాలు మత విద్వేషాల ముసుగులో రాజకీయంగా లబ్ధిపొందేందుకు, సర్కారుకు వ్యతిరేకంగా రాద్ధాంతం చేసే కుట్రలకు తెరలేపాయి. ‘సంక్షేమం’ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. నిజానికి అంతర్వేది రథం దగ్థం ఘటనలో ప్రభుత్వాన్ని, ప్రభుత్వ చర్యలను తప్పుబట్టాల్సిన అవసరం ఏమీ లేకపోయినప్పటికీ ప్రతిపక్షాలు అనవసరంగా నానాయాగీ చేస్తున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరోవైపు.. అన్ని రకాలుగా రాష్ట్రంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న సీఎం వైఎస్ జగన్ సర్కారు ఇటీవలే టీటీడీ లెక్కల్నీ కాగ్ ఆడిట్ పరిధిలోకి తీసుకువచ్చేలా నిర్ణయం తీసుకుంది. అలాగే, దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కొన్ని దుష్టశక్తులు ఎప్పటికప్పుడు తమ వక్రబుద్ధిని ప్రదర్శించుకుంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంతర్వేది దుర్ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని నిర్ణయించడం రాజకీయ పరిశీలకులు, మేధావులు, తటస్థులు తదితర అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. -
‘ఈగ కూడా వాలకుండా పచ్చ కండువా కప్పాడు’
సాక్షి, అమరావతి: అంతర్వేది ఘటనపై ట్విటర్ వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పేతే నోరు ఎందుకు మెదపలేదని ప్రశ్నించారు. ‘‘అంతర్వేది ఆలయ రథం దగ్ధంపై గంటల వ్యవధిలోనే నిజనిర్ధారణ కమిటీ వేశారు చంద్రబాబు గారు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పేతే కనీసం నోరు కూడా మెదపలేదెందుకని ప్రజలు అడుగుతున్నారు. రమేశ్ హాస్పిటల్స్ పై ఈగ కూడా వాలకుండా పచ్చ కండువా కప్పి కాపాడాడు’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. (చదవండి: చిట్టీ నాన్నారుని అడుగు చెప్తారు..) నటుడు జయప్రకాశ్‌రెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమ, రంగస్థలం ఓ అద్భుతమైన నటుడిని కోల్పోయిందని, ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరనిలోటని ట్విటర్లో పేర్కొన్నారు. ఆయన ఆత్మకి శాంతిచేకూరాలని, భగవంతుడు ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. -
అంతర్వేది ఘటనపై ప్రాథమిక నిర్ధారణ
సాక్షి, విజయవాడ: అంతర్వేది రథం దగ్దమైన ఘటనలో పోలీసు శాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. క్లూస్ టీమ్ ద్వారా సంఘటన స్థలాన్ని ఏలూరు రేంజి డీఐజీ కేవీ మోహన్ ఆదివారం పరిశీలించారు. అయితే రథం ఉంచిన ప్రాంతంలో పై భాగాన తేనె తుట్టె ఉన్నట్లు గుర్తించారు. రథానికి రక్షణగా తాటాకులు, సర్వే కర్రలు ఉంచగా, రాత్రి వేళ కొందరు వ్యక్తులు తేనె తుట్టెను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే తేనె తుట్టెకు నిప్పుపెట్టడంతో తాటాకులకు అంటుకుని ప్రమాదం జరిగింది. దీంతో రథం దగ్దమైనట్లు పోలీసులు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. ఇంకా ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
అగ్నికి ఆహుతైన స్వామి వారి రథం
-
అగ్నికి ఆహుతైన స్వామి వారి రథం
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రమాదం చోటుచేసుకుంది. 62 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామి వారి రథం అగ్నికి ఆహుతైంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగింది. షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా విద్రోహ చర్య అన్న అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు. మంత్రి వెల్లంపల్లి దిగ్భ్రాంతి అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన ఘటనపై దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఆయన.. దేవదాయ కమిషనర్ పి.అర్జునరావు, జిల్లా ఎస్పీతో ఫోన్ మాట్లాడారు. సహయక చర్యులు చేపడుతున్న దేవదాయ, పోలీస్, పైరింజన్, రెవెన్యూ అధికారులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. ఘటనపై లోతుగా దర్యాప్తు జరపాల్సిందిగా ఆదేశిస్తూ.. దేవదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్‌ను విచారణ అధికారిగా నియమించారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదే విధంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం పున: నిర్మాణానికి చర్యులు చేపట్టాలని దేవదాయ కమిషనర్‌కు మంత్రి సూచించారు. అంతర్వేదిలో నర్శింహస్వామి ఉత్సవ రథం అగ్నికి ఆహుతి కావటంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఖండన అంతర్వేది ఘటన దురదృష్టకరం -స్వరూపానందేంద్ర రధం ఆహుతి కావడంపై తక్షణం విచారణ జరపాలి -స్వరూపానందేంద్ర దుండగుల చర్యగా తేలితే కఠినంగా శిక్షించాలి -స్వరూపానందేంద్ర హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమిది -స్వరూపానందేంద్ర నర్శింహస్వామి రధోత్సవం లోపు నూతన రధ నిర్మాణం పూర్తయ్యేలా దేవాదాయ శాఖ పూనుకోవాలి -స్వరూపానందేంద్ర -
కళ్యాణం కమనీయం
-
అంతర్వేదిలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లీకేజీ
-
జనసంద్రమైన అంతర్వేది క్షేత్రం
-
అంతర్వేదిలో ఉగ్రరూపం దాల్చిన సముద్రం
-
అంతర్వేదికరలో గ్యాస్ పైప్ లైన్ లీక్
-
స్కూలు సమీపంలో గ్యాస్ లీకేజీ
సఖినేటిపల్లి(తూర్పుగోదావరి): సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో ఓఎన్జీసీ బావి నుంచి శుక్రవారం సాయంత్రం భారీగా గ్యాస్ లీకయింది. స్థానిక సెయింట్ మేరీస్ పబ్లిక్ స్కూలు సమీపంలోని బావి నుంచి పెద్ద ఎత్తున గ్యాస్ లీక్ కావటంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలికి చేరుకున్నారు. నీటితో కూడిన గ్యాస్ లీకేజీని పరిశీలించి అదుపులోకి తీసుకొచ్చారు. పాత పైపులు తుప్పు పట్టి ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
నరసన్న పెళ్లికొడుకాయెనే..
∙అంతర్వేదిలో కల్యాణోత్సవాలకు శ్రీకారం ∙బుగ్గన చుక్క, నొసట తిలకంతో దర్శనమిచ్చిన స్వామి మాడవీధుల్లో సూర్య, చంద్రప్రభ వాహనాలపై ఉత్సవం అంతర్వేదిలో లక్షీ్మనృసింహస్వామివారి వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. సూర్యభగవానుడి జన్మదినం రోజైన రథసప్తమి నాడు స్వామిని నవవరుడిని చేశారు. బుగ్గన చుక్క, నొసటన తిలకం, పట్టువస్రా్తలు ధరించి పెళ్లికొడుకుగా సిగ్గులొలుకుతూ దర్శనమిచ్చిన శ్రీవారిని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. సఖినేటిపల్లి / మలికిపురం ఏటా మాదిరి ముద్రికాలంకరణ(శ్రీవారిని పెళ్లికుమారుని, అమ్మవారిని పెళ్లి కుమార్తె చేసే కార్యక్రమం)ను కేశవదాసుపాలేనికి చెందిన బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబాల వారు ఆలయ అర్చకుల సమక్షంలో ఘనంగా జరిపించారు. సాయంత్రం 6.30 గంటలకు ధూపసేవ అనంతరం ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, అర్చకస్వాములు శ్రీవారికి, అమ్మవారికి వైఖానసాగమానుసారం, శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రకారం విశేష పూజలు చేశారు. మామిడాకులు భస్మం చేయగా వచ్చిన బూడిదతో బుగ్గన చుక్కపెట్టి, ఉంగరం తొడిగి పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెను చేసే తంతును పూర్తిచేశారు. ఆనవాయితీగా రథసప్తమి పర్వదినాన కేశవదాసుపాలేనికి చెందిన బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబాల వారు సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. స్వామికి బెల్లంకొండ, అమ్మవారికి ఉండపల్లి కుటుంబీకులు నూతన వస్రా్తలను సమర్పించుకున్నారు. వారు ఏర్పాటు చేసిన అన్నదానంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామి ప్రసాదాన్ని తీసుకున్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చిక్కాల వెంకట్రావు పాల్గొన్నారు. ఆలయ నిర్మాత కృష్ణమ్మకు నివాళులు అంతర్వేదిలో కల్యాణోత్సవాలు ప్రారంభం సందర్భంగా ఆలయ నిర్మాత కొపనాతి కృష్ణమ్మ విగ్రహానికి పలువురు ప్రముఖులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ట్రస్టీలు, ఉత్సవ సేవాకమిటీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏటా ఉత్సవాలు ప్రారంభానికి ముందు పుణ్యక్షేత్రంలో ఉన్న ఆయన నిలువెత్తు విగ్రహం వద్ద నివాళులు అర్పించడం ఆనవాయితీ. తూర్పు వీధి(మెరకవీధి)కి చేరిన రథం.. స్వామి కల్యాణ మహోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది రథోత్సవం. ఈ వేడుక ఈనెల ఏడోతేదీ భీష్మ ఏకాదశి పర్వదినాన మెరక వీధి నుంచి మొదలవుతుంది. ఏడాది పొడవునా ఆలయం వద్ద ఉండే రథానికి ఉత్సవాల సందర్భంగా అవసరమైన మరమ్మతులు చేసి, రంగు రంగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మధ్యాహ్నం రాజకీయ ప్రముఖులు, అధికారులు, ట్రస్టీలు, సేవా కమిటీ సభ్యులు, అర్చకులు రథం వద్ద పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం గోవింద నామస్మరణల మధ్య రథాన్ని మెరకవీధికి తోడ్కొని వెళ్లారు. ఉత్సవాల తొలిరోజు సాయంత్రం సూర్యవాహనంపైన, రాత్రి చంద్రప్రభ వాహనంపైన కొలువుదీరిన శ్రీస్వామి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని... దర్శించుకున్నారు. అంతర్వేదిలో నేడు.. శ్రీలక్షీ్మనృసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు హంసవాహనంపైన, రాత్రి ఏడు గంటలకు శేషవాహనంపైన గ్రామోత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం ధూపసేవ అనంతరం ధ్వజారోహణ నిర్వహించనున్నారు. పూర్ణాహుతితో ముగిసిన క్రతువులు అయినవిల్లి : అయినవిల్లి విఘ్నేశ్వరుని ఆలయంలో మూడురోజుల పాటు నిర్వహిస్తున్న క్రతువులకు శుక్రవారం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగింపు పలికారు. ఆలయ ప్రధానార్చకులు మాచరి సూరిబాబు ఆధ్వర్యంలో స్వామిని పంచామృతాలతో అభిషేకించారు. లక్షగరిక పూజలు చేశారు. వేదపండితులు పూర్ణాహుతి కార్యక్రమంతో స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలకు ముగింపు పలికారు. విద్యార్థుల కోసం చదువుల పండుగ నిర్వహించారు. కార్యక్రమంలో పండితులు విద్యార్థుల నాలుకపై బీజాక్షరాలను లిఖించారు. ఆలయ చైర్మ¯ŒS రావిపాటి సుబ్బరాజు, ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆదివారం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి చేతులు మీదుగా స్వామివారి ప్రసాదంగా విద్యార్థులకు పెన్నులను పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశామని ఈఓ తెలిపారు. -
అంతర్వేది ఆధ్యాత్మిక సవ్వడి
∙నేటి నుంచి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు ∙తొమ్మిది రోజుల పర్వానికి శ్రీకారం ∙కల్యాణం తిలకం దిద్దుకోనున్న ఆది దేవుళ్లు నవ నారసింహక్షేత్రాల్లో అగ్రగామి అంతర్వేది పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువై ఉన్న లక్షీ్మనృసింహస్వామివారి కల్యాణ మహోత్సవాలు రథసప్తమి రోజైన శుక్రవారం ప్రారంభంకానున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకు సూర్యవాహనంపై ఊరేగిస్తారు. అనంతరం 6.30 గంటలకు ఆదిదేవుళ్లయిన నృసింహస్వామి, లక్షీ్మదేవిలను వధూవరులుగా అర్చకులు ముస్తాబు చేస్తారు. అనంతరం ఈ ఏడాది నుంచి అదనంగా భక్తులతో నిర్మించిన చంద్రప్రభ వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. శుక్రవారం నుంచి తొమ్మిదిరోజుల పాటు స్వామివారి వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాలు జరుగుతాయి. – సఖినేటిపల్లి ఉత్సవాల్లో కార్యక్రమాలు.. ఉత్సవాల్లో భాగంగా 6వ తేదీ దశమి నాటి రాత్రి 12.21 గంటలకు మృగశిర నక్షత్రయుక్త తులా లగ్నపుష్కరాంశంలో శ్రీస్వామివారి తిరు కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 7న భీష్మ ఏకాదశి పర్వదినాన మధ్యాహ్నం 2.42గంటలకు శ్రీస్వామివారి రథోత్సవం, 10న సముద్ర స్నానం, 11న హంసవాహనంపై స్థానిక చెరువులో తెప్పోత్సవం జరుగుతాయి. అల్లవరం మండలం బెండమూర్లంకకు చెందిన కొపనాతి ఆదినారాయణ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారని, దానిని ఆయన కుమారుడైన కృష్ణమ్మ 1823లో పూర్తిచేశారని ఆలయంలోని శిలాశాసనంలో ఉంది. గ్రామోత్సవాల్లో వాహనాలు ఇవే.. స్వామివారిని ఈ ఏడాది నుంచి 14 వాహనాలపై గ్రామోత్సవం నిర్వహించనున్నారు. 3న సూర్యవాహనం, చంద్రప్రభ వాహనం, 4న హంస వాహనం, శేష వాహనం, 5న రాజాధిరాజ వాహనం, సింహవాహనం, 6న పంచముఖ ఆంజనేయస్వామి వాహనం, కంచుగరుడ వాహనం, 8న గజవాహనం, పొన్నవాహనం, 9న హనుమద్వాహనం, అశ్వవాహనం, 10న గరుడపుష్పక వాహనం, 11న పుష్పక వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. 7వ తేదీన నూతన వధూవరులుగా మూర్తీభవించిన శ్రీస్వామివారు, అమ్మవార్లను రథంపై అధిరోహింపచేసి, భక్తులు ఊరేగిస్తారు. సర్వం సిద్ధం తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. జేసీ సత్యనారాయణ, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, ఉత్సవాల ఇ¯ŒSచార్జ్, అమలాపురం ఆర్డీఓ గణేష్‌కుమార్ సారధ్యంలో డివిజ¯ŒSస్థాయి అధికారులు తీర్థం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తుల సేవల కోసం దేవస్థానం సిబ్బంది 70 మందిని విధుల్లోకి తీసుకున్నట్టు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ రమేష్‌బాబు చెప్పారు. అసిస్టెంట్ కమిషనర్ చిక్కాల వెంకట్రావు ఆధ్వర్యంలో ట్రస్టీలు, ఉత్సవ సేవాకమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మద్యం దుకాణాల బంద్ 6, 7, 10 తేదీల్లో పుణ్యక్షేత్ర పరిధిలో మద్యం దుకాణాలు పూర్తిగా వేస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. అయితే తీర్థమహోత్సవాల అన్ని రోజులూ వీటిని పూర్తిగా నిషేధించాలని ప్రముఖులు కోరారు. సముద్ర స్నానాల రేవు వద్ద 60 మంది గజ ఈతగాళ్లను, మూడు రెస్క్యూ బోట్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఫిషరీస్ డీడీ అంజలి తెలిపారు. అంతర్వేదికి రాక ఇలా... రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి అంతర్వేదికి చేరుకోవాలనుకునే భక్తులు రావులపాలెం, రాజోలు మీదుగా రావాలి. పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చే భక్తులు దిండి–చించినాడ వంతెన మీదుగా శివకోడు, మలికిపురం మీదుగా చేరుకోవాలి. కల్యాణ మహోత్సవాలు సందర్భంగా అమలాపురం, రాజోలు, భీమవరం, పాలకొల్లు డిపోల నుంచి సుమారు 200 బస్సులు నడపనున్నారు. అంతర్వేదికి ఎంతదూరం... అంతర్వేదిS రాజోలు నుంచి 31 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 104, అమలాపురం నుంచి 63, కాకినాడ నుంచి 118, పాలకొల్లు నుంచి 41, భీమవరం నుంచి 64 కిలోమీటర్ల దూరం ఉంది. ఎప్పటిలానే వ¯ŒS వే.. ఎప్పటిలాగానే తీర్థంలో వాహనాల రాకపోకలకు పోలీసులు వ¯ŒS వేను అమలు చేస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి అంతర్వేదికి వచ్చే వాహనాలు టేకిశెట్టిపాలెం వద్ద ప్రధాన రహదారిలో కేశవదాసుపాలెం మీదుగా అంతర్వేదికి రావచ్చు. తిరుగుప్రయాణంలో ఆలయం వెనుకవైపు ఏటిగట్టు మీదుగా గొంది, గుడిమూల, సఖినేటిపల్లి సెంటర్ మీదుగా మలికిపుం, రాజోలు ప్రాంతాలకు వెళ్లవచ్చు. వీటితో పాటు భక్తుల వాహనాలకు గుర్రాలక్క గుడికి సమీపంలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటుకు పంచాయతీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ స్థలాల నుంచి వాహనాలను గుర్రాలక్క గుడిమీదుగా ఉన్న దండుపుంత బీటీ రోడ్డులో అంతర్వేదికర వద్ద మలుపు తిరిగి గంగయ్యవారధి, గొంది పాములవారి సెంటర్ మీదుగా సఖినేటిపల్లి మూడు తూములు సెంటర్ మీదుగా ప్రధాన రహదారిపైకి చేరుకోవాలి. పటిష్ట భద్రత భక్తుల భద్రతకు వివిధ స్థాయిల్లో సుమారు 1500 పోలీసు సిబ్బందిని నియమిస్తున్నట్టు డీఎస్పీ అంకయ్య చెప్పారు. తీర్థంలో కూడా గట్టి నిఘా ఉంటుందని అన్నారు. స్నానాల రేవు వద్ద ఐటు వాచ్‌టవర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు, అన్నాచెల్లెలుగట్టు, లాంచీలరేవు వద్ద నిషేధాన్ని అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. తీర్థంలో ఐదు కిలోమీటర్ల్ల పరిధిలో మద్యం, మాంసం అమ్మకాలు లేకుండా అధికారులు నిఘా పెడుతున్నారు. -
కలియుగ దైవం లక్ష్మీనరసింహస్వామి
దక్షిణ కాశీగా పురాణ ప్రసిద్ధి చెంది, చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న పవిత్ర పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్షీ్మనృసింహస్వామివారి ఆలయం. ఈ క్షేత్రంలో శ్రీలక్షీ్మనృసింహస్వామివారు శిలారూపంలో పశ్చిమ ముఖంగా అవతరించారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి స్వామివారు కాపాడతారని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాçÜం. ఫిబ్రవరి మూడో తేదీ నుంచి స్వామివారి కల్యాణోత్సవాలు ప్రారంభంకానున్నాయి. – సఖినేటిపల్లి సఖినేటిపల్లి మండలం తీరప్రాంత గ్రామం అంతర్వేది క్షేత్ర మహత్యానికి సంబంధించి అనేక పురాణ గాధలున్నాయి. కృతయుగ ఆరంభంలో సృష్టికర్త బ్రహ్మ రుద్రయాగం చేయడానికి నిర్ణయించి, ఆయాగ వేదికను సాగరసంగమం తీరమైన గ్రామంలో నిర్మించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. యాగరక్షణకు నీలకంఠేశ్వరుడిని ప్రాణప్రతిష్ఠ చేసి, యాగం పూర్తి చేసినట్టు పండితులు చెబుతున్నారు. బ్రహ్మయాగ వేదికగా ఉన్న ఈ గ్రామానికి అంతర్వేదిక పేరొచ్చింది. కాలక్రమంలో అది అంతర్వేదిగా స్థిరపడింది. అంతర్వేది ఉత్సవాల షెడ్యూల్... ఫిబ్రవరి 3 నుంచి 11 వరకూ జరుగుతున్న అంతర్వేది శ్రీలక్షీ్మనృసింహస్వామివారి వార్షిక దివ్య తిరు కల్యాణోత్సవాల ప్రధాన ఘట్టాల షెడ్యూల్. ∙3న రథసస్తమి. సూర్యవాహనం, చంద్రప్రభ వాహనంపై గ్రామోత్సవం. ముద్రికాలంకరణ(శ్రీస్వామివారినిపెళ్లికుమారుని, అమ్మవారిని పెళ్లికుమార్తె చేయడం) ∙6న పంచముఖ ఆంజనేయస్వామి, కంచుగరుడ వాహనాలపై గ్రామోత్సవాలు. రాత్రి 12.21 గంటలకు మృగశిర నక్షత్రయుక్త తులా లగ్నపుష్కరాంశలో శ్రీస్వామివారి తిరు కల్యాణ మహోత్సవం. ∙7న భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీస్వామివారి రథోత్సవం. ∙10న మాఘ పౌర్ణమి(సముద్ర స్నానాలు) ∙11న అంతర్వేది చెరువులో హంసవాహనంపై తెప్పోత్సవం. నా పూర్వజన్మ సుకృతం ఇంత వరకూ లక్షీ్మనృసింహస్వామివారికి అర్చకుడిగా సేవలు చేసుకున్న తనకు ఈ ఏడాది స్వామివారి కల్యాణం చేయించే భాగ్యం దక్కడం పూర్వజన్మసుకృతం. ప్రధాన అర్చకుడిగా తొలిసారిగా స్వామివారి కల్యాణం తన చేతుల మీదుగా జరుగునున్న తరుణంలో ఎంతో ఆనందిస్తున్నా. – పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, ప్రధాన అర్చకుడు స్వామివారి దయ ఎంతో ఉంది శ్రీలక్షీ్మనృసింహస్వామివారు కొలువై ఉన్న దేవస్థానానికి అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తుండడం ఎంతో సంతోషకరం. శ్రీస్వామివారి కరుణకటాక్షాలతో భక్తులు, తాము ఎంతో ఆనందంగా జీవిస్తున్నాం. అలాగే స్వామివారు భక్తుల నుంచి కోరుకునే కార్యక్రమాలను తన చేతుల మీదుగా స్వామివారికి చేరడం ఎంతో సంతృప్తి. – చిక్కాల వెంకట్రావు, అసిస్టెంట్ కమిషనర్ అంతర్వేదిలో సందర్శనీయ ప్రాంతాలు వశిష్టసేవాశ్రమం: ఆలయానికి సుమారు 500 మీటర్ల దూరంలో ఏటిగట్టుకు ఆవలి వైపున ఉంది. అంతర్వేదిలోని వశిష్టాసేవాశ్రమం ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతోంది. ఈ ఆశ్రమాన్ని కల్యాణ మహోత్సవాలకు వచ్చే భక్తులు సందర్శించుకోవచ్చు. ఇక్కడ అరుంధతీ, వశిష్ట మహర్షులు కొలువు దీరారు. చుట్టూ నీరు ఉండేలా అష్టభుజాకారంగా దీనిని ఆచార్య కే.జీ. ప్రసాదరాజు నిర్మించారు. అరుంధతీదేవికి వశిష్ట మహర్షికి వివాహం జరిగిన సమయంలో సమస్త దంపతులకు రక్షణగా నిలవాలని దేవతలు ఆశీర్వదించారని, అందుకే వీరిని దర్శించుకుంటే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని భక్తుల విశ్వాçÜం. గుర్రాలక్క ఆలయం ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో శ్రీలక్షీ్మనరసింహస్వామివారి సోదరి గుర్రాలక్క(అశ్వ రూఢాంబిక) ఆలయం ఉంది. క్షేత్ర ప్రతిపత్తికి ప్రతీకగా ఉన్న ఆమె ఆలయాన్ని భక్తులు దర్శించుకోవడం ఎంతో శ్రేయస్కరం. రథోత్సవం రోజున రథంపై నూతన వధూవరులుగా మూర్తీభవించిన శ్రీస్వామి సతీసమేతంగా గుర్రాలక్క ఆలయానికి వెళ్లి కొత్త దుస్తులు ఇవ్వడం పరిపాటి. నీలకంఠేశ్వరుని ఆలయం ఆలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో శ్రీనీలకంఠేశ్వరుని ఆలయం ఉంది. కృతయుగ ఆరంభంలో బ్రహ్మ రుద్రయాగం నిర్వహించేందుకు వేదికగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు ప్రతీతి. యాగరక్షణకు నీలకంఠేశ్వరస్వామిని ప్రతిíష్ఠించి, యాగాన్ని పూర్తి చేసిన మహాపుణ్యక్షేత్రం ఇది. బ్రహ్మ యజ్ఞవేదికైనందున ఈప్రాంతం అంతర్వేదికగా ఏర్పడి కాలక్రమంలో అంతర్వేదిగా మారింది. ఈ క్షేత్రంలో శ్రీఆంజనేయస్వామిని క్షేత్ర సంరక్షకునిగా కూడా ప్రతిష్ఠించారని పురాణ సారాంశం. ఆకట్టుకునే లైట్‌హౌస్, సాగరసంగమం ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో లైట్‌హౌస్ ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. దానికి సమీపంలోనే సాగరసంగమం ఉంది. -
విశేషమైన క్షేత్రం అంతర్వేది
సఖినేటిపల్లి (రాజోలు) : చారిత్రక ప్రాధాన్యం సంతరించుకున్న అంతర్వేది క్షేత్రం విశేషమైన క్షేత్రమని మైసూరు శ్రీదత్త పీఠం అధిపతి గణపతి సచ్చితానంద స్వామీజీ అన్నారు. అంతర్వేది శ్రీలక్షీ్మనృసింహస్వామి దర్శనానికై బుధవారం వచ్చిన స్వామీజీకి ఆలయ మాజీ ప్రధానార్చకుడు వాడపల్లి బుచ్చిబాబు, ప్రస్తుత ప్రధానార్చకుడు కిరణ్, వేదపండితుడు చింతా వేంకట శాస్త్రి, స్థానాచార్య రామరంగాచార్యులు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చిక్కాల వెంకట్రావు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి స్వామీజీ ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఆశీస్సులు పలికారు. సమాజంలో అందరికీ ధర్మబుద్ది కలిగించమని స్వామిని వేడుకున్నట్లు చెప్పారు. అంతరాలయంలో ఉన్నంతసేపు వైకుంఠంలో ఉన్నట్లుగా ఉందని స్వామీజీ పేర్కొన్నారు. -
ఫిబ్రవరి 3 నుంచి నరసన్న కల్యాణోత్సవాలు
అంతర్వేది (సఖినేటిపల్లి) : ఫిబ్రవరి 3 నుంచి 11వ తేదీ వరకూ అంతర్వేది శ్రీలక్షీ్మనృసింహస్వామివారి కల్యాణమహోత్సవాలకు ముహూర్తాలను నిర్ణయించినట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చిక్కాల వెంకట్రావు మంగళవారం చెప్పారు. ఈ మేరకు ఆలయంలో శ్రీస్వామివారి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి దైవజ్ఞ తంగిరాల ప్రభాకరపూర్ణయ్య గంటల పంచాంగాన్ని బట్టి ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాసకిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు కల్యాణ మహోత్సవాలకు ముహూర్తాలను నిర్ణయించారు. కల్యాణ మహోత్సవాల శుభలేఖను తయారుచేసి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చిక్కాల వెంకట్రావుకు వారు అందజేశారు. కల్యాణ మహోత్సవాలలో పర్వదినాలు, వాటి సమయాలను త్వరలోనే ప్రకటిస్తామని ప్రధాన అర్చకుడు కిరణ్ పేర్కొన్నారు. కాగా ధనుర్మాసంలో ఈ నెల 24 వచ్చిన శ్రీస్వామివారి జన్మనక్షత్రం ప్రత్యేక పూజలు ఉదయం ఏడుగంటలకు నిర్వహిస్తున్నట్టు, అభిషేకం తెల్లవారుజామున నాలుగు గంటలకు నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకుడు కిరణ్ తెలిపారు.